పేదరికం అంటే డబ్బులెక్కువగా లేకపోవడమేనా ?

Monday 31 January 2011

 అంబానీల లాంటి ఒక ధనవంతుడు తమ కన్నా ప్రపంచంలో బ్రతుకుతున్న ఇతరులు ఎంత పెదవారో తన కొడుకు కు తెలియ చెప్పాలని అనుకున్నాడు ! ఒక కుగ్రామానికి వెళ్లి అక్కడున్న అతి బీదవాళ్ళ  ఫాంహౌస్ లో రెండు రోజులు  తన కొడుకుతో పాటు ఉన్నాడు ! తిరిగి రాజభవనం లాంటి తమ ఇంటికి వెళ్ళినాక తన కొడుకును దగ్గరకు పిలిచాడు !
 " ఎలా ఉంది మన ట్రిప్ ? "  అడిగాడు ధనికుడు !
 " చాలా గొప్పగా వుంది డాడీ "
"  ఈ ప్రపంచంలో పేదవాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో తెలిసిందా ?" అడిగాడు గర్వంగా ధనికుడు !
 " తెలిసింది డాడీ "
" ఏం తెలుసుకున్నావో చెప్పు " ముసి ముసిగా నవ్వుతూ అడిగాడు ధనికుడు!  
 " నేను గమనించిందేమిటంటే మనకు ఒక కుక్కే ఉంది కానీ వాళ్లకు నాలుగేసి కుక్కలు ఉన్నాయి !  
 మనకు ఓ గార్డెన్ లో మధ్యన ఓ మోస్తరు స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ వాళ్లకు అంతం లేని పెద్ద వాగు ఉంది !
 మన గార్డెన్ లో ఇంపోర్టెడ్ లైట్లు వెలుగులు చిమ్ముతుంటాయి  కానీ వాళ్లకు  చంద్రుడూ మిల మిల మెరిసే చుక్కలూ వెలుగులు  ఇస్తున్నాయి !
 మన వరండా గేట్ దాకా ఉంది  కానీ వాళ్లకు ఆకాశమే వరండా లా ఉంది !
 మన ఇంటి చుట్టూ ఉన్నస్థలం  చాలా చిన్నది కానీ వాళ్ళ ఇంటి చుట్టూ  ఉన్న స్థలం ఆకాశం భూమీ కలిసేంత దాకా ఉంది !
 మనకు చాలామంది సేవకులు ఉన్నారు కానీ వాళ్ళు ఇతరులకు సేవ చేస్తున్నారు !
 మనం మన తిండి కొనుక్కుంటాము  కానీ వాళ్ళు వాళ్ళ తిండి పండిస్తున్నారు !
మనని రక్షించడానికి మన ప్రాపర్టీ  చుట్టూ పెద్ద పెద్ద గోడలున్నాయి కానీ వాళ్ళను రక్షించడానికి చుట్టూ వాళ్ళ స్నేహితులున్నారు ! " చెప్పాడు ఆ ధనికుడి కొడుకు !
వింటూన్న ధనికుని మొహం లో నవ్వు మాయమై మరో బుద్ధుడిని చూసినంత ఆశ్చర్యం తో నోట మాట రాకుండా ఉంది !
" థాంక్స్ డాడీ మనం ఎంత పేదవాళ్ళమో  నాకు తెలియ చెప్పినందుకు ! " అని ముగించాడు ఆ ధనికుడి కొడుకు ! 


Software Engineer Zameen Pe......Every Engineer is special!!!!!

Saturday 29 January 2011

     
Software Engineer Zameen Pe......Every Engineer is special!!!!!
*Main kabhi batlaata nahi ,*
*Par  testing se darta hoon main PM*
*Yun to main, dikhlata nahi,*
*Par Bench par jana chahta hoon main PM*
*Aapko sab hai pata,hai na PM*
*Aapko sab hai pata, mere PM*
*Issues mein yun na chhodo mujhe,*
*Ghar laut kar bhi jaa na paun PM*
*Bhejte kyun nahi Onsite Mujhko aap,*
*Yaad bhi aapko aa na paun PM,*
*Kya itna dumb hoon main PM,*
*Kya itna dumb mere PM*
*Jab bhi kabhi Onsite mujhe,*
*Dher saari kaam deta hai*
*Meri nazar Dhoondhe aapko*
*Sochu yunhi aap aakar work distribute karoge PM*
*Unse main yeh kehta nahi,*
*Par testing se pak jata hoon main PM*
*Chehre pe aane deta nahi,*
*Company chhod kar bhaag jana chahta hoon PM*
*Aapko sab hai pata,hai na PM*
*Aapko sab hai pata, mere PM*

ఇదో రకం సముద్ర స్నానం !

Friday 28 January 2011

కాళ్ళకు తడి అంటకుండా సముద్ర స్నానం చేస్తానని పందెం వేసాను మరి !

ప్రపంచం నా గుప్పెట్లోనే ఉంది !

 మిమ్మల్ని నమ్మించడానికి ఇది చాలా ? ఇంకా ఏమైనా రుజువులు చూపించాలా ?

మన కళ్ళు బానే ఉన్నాయి అద్డం మోసం చేసింది !

ఫోటో తీస్తుంటే తీసిన ఫోటో లో ఇద్దరు ఫోటోగ్రాఫర్లూ  కలిసిపోయి తమాషాగా వచ్చింది కదూ ఫోటో !

ఇవాళ ఇంటికెలా వెళ్ళాలో ?

ఇందాకట్నుంచీ మొత్తుకుంటూనే ఉన్నా మందు ఎక్కువవుతోంది ఆపేద్దాం గురూ అని !
ఇప్పుడు చూడండి మన గ్లాసుల్లో పోసిన మందు కూడా తిన్నగా నిలబడట్లేదు !

నరసివంగి ?

Thursday 27 January 2011

మనిషిలోని మృగం అప్పుడప్పుడు ఇలా బయటపడుతుంటుంది !

వాటర్ స్కీయింగ్ అంటే ఇదేనా ?

రండి డాన్స్ చేద్దాం !

మొన్న బూగీవూగీ లో ఫస్ట్ వచ్చింది మేమే !

హాయ్ ! భలే ముద్దోస్తున్నావే ?

Wednesday 26 January 2011

ఇక నుంచీ మనం ఫ్రెండ్స్ !
సరేనా ?

ఇప్పుడిలానే పడుకోవాలి !

ఈ చలికాలం ఎప్పుడు పోతుందో ఏమిటో ?
కడుపు నిండా తిండి తిని ఎన్నాళ్ళయిందో ?

నా సవారీ బావుందా ?

కడుపు నిండా తిండి పెట్టేస్తే మనం చెప్పినట్లే వింటుంది ! లేకపోతే మన్నే భోన్చేసేస్తుంది !

మనం ఎందుకు పెరగాలి నేస్తం ?

Tuesday 25 January 2011

అటు చూడు అక్కడున్నారే వాళ్ళే మీ అమ్మా నాన్నా !
నువ్వూ పెద్దయితే అక్కడే ఉండాలంట !
నువ్వు పెరక్కుండా ఇలా ఉండిపోరాదూ ?

గుడ్డే కదూ ?

నేనుగానీ ఇప్పుడొక ఈల వేసానంటే అదలా పైకి లేస్తుంది !

సూర్యుడిని మింగేస్తున్న గుర్రం !

వస్తున్నా.. వస్తున్నా !

భయపడకు నేనున్నాను ! నీకేమీ కాదు !

ఎందుకీ బట్ట కట్టడం ?

Monday 24 January 2011

ఎందుకు చెప్పూ ఇంత అవస్థ ?
ఎప్పుడూ సర్దుకుంటూ కూర్చోపోతే మాలాగా  ఉండొచ్చుగా ? 

కేరింతల అల !


మా జిమ్ లో చేరతారా !

ఎవరైనా పరవాలేదు మా జిమ్ లో మెంబర్స్ కావచ్చు !
ఫీజులేమీ కట్టవసరం లేదు కానీ ఏదైనా ఎక్విప్మెంట్ పాడితే రిప్లేస్ చెయ్యాలి అంతే !

గొరింటా పూసిందీ కొమ్మా లేకుండా !

 పూసిన  గోరింట అందాలు చూద్దామా ? 















ఎవరు ఎవరిని తాగుతున్నారో ?

Saturday 22 January 2011

మేలుకో నేస్తం !
నువ్వు తాగి తన్మయత్వంతో వదిలే ఆ పొగే బూతమై నిన్నూ నీతోపాటు ఉన్న వాళ్ళనూ మింగేస్తోంది !

ఎంత సేపురా రుచి చూడటం ?

నాకు శత్రువులు ఎక్కువయ్యారని నిన్ను రుచి చూడటం కోసం పెట్టుకున్నాను చూడూ అదే నా పెద్ద తప్పు !
నాకు కూడా మిగల్చకుండా లాగించేస్తున్నావు !
అసలా పొట్టలో ఈ తిండంతా ఎలా పడుతుందిరా బాబూ !

చలో చయ్య చయ్య చయ్యా చయ్యా !

నేను డ్రమ్స్ వాయిస్తుంటే చప్పట్లు కొట్టకుండా రైలు రైలు అంటారే ?

Mobile Number Portability

Friday 21 January 2011

Starting from 20th January 2011



ఎందుకంత నిర్లక్ష్యం ?

ఆగండి !
కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి !
మీరు  పిల్లలను ఆడించాలి  కానీ పిల్లలతో ఆడకూడదు ! 
భావి పౌరులంటే అంత చులకనా ?

ప్రకృతి ఆనకట్టలు !


సరస్సుల మెట్లా లేకపోతే మెట్ల సరస్సులా ?

అప్ అప్ అండ్ అప్ !

ఎందుకురా భయపడతావూ ?
తొందరగా పైకి ఎక్కి నన్ను లాగావంటే అటువేపు వెళ్లిపోవచ్చు !

పాలెక్కడుంటే నేనక్కడ !

ఇలా దాచుకుంటే నేను అందుకో లేను అనుకున్నారు కదూ ?

జీవితం క్షణభంగురం

Thursday 20 January 2011

జీవితం క్షణభంగురం అంటే ఇదేనేమో ?
ఇంకో కష్టమర్ వస్తే మనం అలాగే అవుతామేమో !

చూపులు కలిసిన ------ వేళ !

అంతే బాస్ ఇంకాసేపు ఆపిల్లకు నీ చూపులు గురిపెట్టు !
తరువాత నేను నీ గన్నే నీ గుండెకు గురిపెడతా !

ఇంక నన్నే అమ్మ అనుకో !

ఇవి పాలురా కన్నా !
మీ అమ్ముంటే తనే పట్టేది !

హాయిగా నీడ పట్టున ఉండకూడదా ?

ఎందుకొచ్చిన గిన్నీసు రికార్డులు రా నాయనా ?

డీ !

Wednesday 19 January 2011

 నువ్వు నా ప్రక్కనుంటే చాలు నేస్తం !

తిరగబడ్డ కార్లు !

బింబం కనిపించక ప్రతిబింబమే కనిపిస్తుంటే  కార్లు మన కళ్ళను మాయ చేస్తున్నాయి కదూ ?