ఫోన్ నేలకేసి కొట్టాడా కొత్త అల్ఖైదా నేత

Monday, 9 May 2011

" హలో... " 
" ఎవరూ జవహరీ భాయేనా ? "
" ష్..  ష్... ఇంకె వడు  ఉంటాడురా  ఇక్కడ ?  చెప్పు ! "
" నేను అయ్. ఎస్. అయ్. చీఫ్.. "
" అబ్బా.. నోర్ముయ్ ! ఎన్నిసార్లు చెప్పాలి పేర్లు అనకూడదని ? ఎప్పుడు నేర్చుకుంటారు రహస్యంగా మాట్లాడటం ? "
" మన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని చెబుదాం అని.. "
" నేను టీవీ చానెళ్ళలో, ఇంటర్నెట్ లో చూస్తున్నాలే.. బదాయీ ! "
" మొత్తానికి ప్రపంచం ఎంత పిచ్చిదో కదా ? "
" కాబట్టేగా మన పదకాలన్నీ హాయిగా పూర్తి  చేసుకోగలుగుతున్నాం ? "
" అక్కడ కొరియర్ ఆచూకీ మనమే ఇచ్చామని కూడా అర్ధం చేసుకో లేకపొతున్నారు జనం ! "
" జనం గొర్రెలు కదా భాయ్ ! "
" ఒసామా..."
" షూ... "
" మాఫ్కర్నా భాయ్ ! ముసలోడి అడ్డం భలే తొలిగి పోయింది కదూ ? "
" మరి మనం ప్లాన్ వేస్తె తిరుగు ఉండదు కదా ? "
" లేకపోతె ప్రతి పనీ తను చెప్పినట్లే కావాలని ఓ గోల చేస్తున్నాడు ! "
" మనం ముస్లిం లను చంపుతోంటే, ఇండియాలో గొడవలు తెస్తోంటే ఒప్పుకోవట్లా ! పైగా ముందు అమెరికా పని పడితే, అందరూ మనం చెప్పినట్లే వింటారు అంటాడు వెర్రిపప్పు ! "
" మరి వాడికే సహాయం చేస్తే మనం పెరిగేదెలా ?  మా పాక్ కనీసం ఆసియాలో అయినా పేరు తెచ్చుకోవాలంటే ఇండియాని నాశనం చెయ్యాలి కదా ? "
" అంతేలే ? కానీ కొద్దిగా జాగర్తగా చెయ్యాలి ఇప్పుడు ! ఎందుకంటే అమెరికా మనకు సాయం చేస్తున్నట్లు ప్రపంచానికి తెలియకూడదు కదా ? "
" అవును భాయ్, నాకో అనుమానం అకస్మాత్తుగా ఒబామా.. "
" ఫిర్  ఏక్ బార్ నువ్వు పేరు చెప్పావంటే తుజే ఖాతం కరుదూన్ గా  ! "
" రెహం కరో భాయ్ ! సరే ఆ నల్లాయన మనతో ఎందుకు కలిసినట్లు ? "
" ఆయనక్కూడా ఎన్నికలు దగర పడ్డాయి మరి,  ఇంకోసారి మళ్ళీ కుర్చీ మీద కూర్చోవాలంటే ఏదైనా కరిష్మా చూపించాలి కదా ? మన సాయం లేకుండా ఇక్కడేమీ జరగదని తెలిసిపోయింది ఆయనకు ! "
" అంతే అంటావా భాయ్ ? "
" మరి ? ఆ ముసలోడికి  జబ్బు చేసిన దగ్గరి నుంచీ, వాడిని దాయడానికి వీర లెవల్లో కష్ట పడాల్సి రావడం, మన ప్లాన్లన్నిటికీ ఆ ముసలోడు  గండి కొట్టాలని చూడటం  భరించ లేక చాచ్చాననుకో ! "
" ఫిర్భీ మనం మనం అనుకున్నట్లే అన్నీ చేసాం కదా ?   కానీ  భాయ్, ఆ నల్లాయన మళ్ళీ ఇలాంటి దాడులే చేస్తానని అంటున్నాడుగా ? "
" అనాలి మరి లేకపోతె ప్రపంచం నమ్మదుగా ? మనం కూడా వాళ్ళతో సంబంధాలు  తెన్చేసుకుంటాం అని బెదిరిస్తాం అని ముందే చెప్పాం గా నల్లాయనకు ? "
" సరే కానీ భాయ్ మరి ఇండియా మన మీద అలా దాడి చేస్తే ? "
" పిచ్చోడా, వాళ్ళ నేతలకు డబ్బులు పిండుకోవడం లో ఉన్న మజా ఇంక దేంట్లోనూ లేదు ! అది జరగని పని ! ఒకవేళ  జరిగినా, మొన్నైతే మనం కావాలని నల్లాయనకు చెప్పాం కాబట్టి తెలిసినా తెలీనట్లు అంజాన్ వేషం వేశాం కానీ,  ముందే గుర్తు పట్టకుండా ఉండటానికి మన రాడార్లు మరీ అంత ఆటబొమ్మలా ?  అందాకా వస్తే నల్లాయన కూడా అడ్డుపడటానికి ఒప్పుకున్నాడుగా ? "
" భాయ్ మరి మన ముస్లింలకు మనం జిహాద్ పేరుతొ చేస్తోంది దావూద్ భాయ్ నల్లవ్యాపార విస్తరణ అని అనుమానం వస్తే ?"
" చుప్ బె సాలె ! పెర్లేత్తోద్దంటే వినవె బేవకూఫ్ ? "
" భూల్గాయా భాయ్ మాఫ్కర్నా ! కానీ నా అనుమానం తీర్చు ! "
" మన బడా భాయ్ అండదండలు లేకపోతె ముస్లింలకు మనుగడ లేదని ప్రచారం మొదలు పెట్టబోతున్నాం ! ఆయన చేసే మాదకద్రవ్యాల వ్యాపారం మనం హిందువులూ , క్రైస్తవుల యువతను మత్తులో ముంచి నిర్వీర్యం చేయడానికని, మారణాయుధాల వ్యాపారం మన జిహాద్ కోసం ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం అని నమ్మిస్తాం ! "
" మరి భాయ్ మన ముస్లిం లలో కూడా చదువుకుని, మనం చేస్తున్న పనులన్నీ అక్రమమనీ, అమానుషం అనీ, ఇస్లాం కి విరుద్ధం అనీ నమ్మే వాళ్ళు ఉన్నారు కదా  వాళ్ళ సంగతేమిటి ? "
" తుం కబ్ సంజోగేరే ? వాళ్ళ మాటలు విననీయకుండా పత్వాలు ఇవ్వడానికి మన కీలు బొమ్మలైన ఇమాం లు కొందరున్నారుగా ? అది కూడా కాకపొతే  వాళ్ళను కూడా అల్లాకు ప్యారీలు చేసేద్దాం ! రోజుకెన్ని యాక్సిడెంట్లు కావట్లేదు ? మన బడా భాయ్ వాళ్ళను దారికి తేవడమో, దారి తప్పించడమో చెయ్యడానికి తన కంపెనీని వాడుతాడు లే !"
" హ హ హ.. డీ కంపెనీ నా ? "
" అబే సాలె పేర్లోద్దురా ! అదే !
" సరే భాయ్ మరి మన నెక్స్ట్ ప్లాన్ ఏమిటి ? "
" అవన్నీ ఇప్పుడు ఇలా కాదు కానీ, కొన్నాళ్ళు అంతా సద్దు మణిగినాక, ఇండియా  పైకి ఎలా దాడి చేస్తే బావుంటుందో ఆలోచిద్దాం ! ఈ సారి మనం కలిసినప్పుడు మాట్లాడు కుందాం లే ! "
" సరే జవహారీ భాయ్ మళ్ళీ కలుద్దాం ! పెట్టేస్తున్నా ! "
" అబే గదేకీ అవ్లాద్  మార్డాలూన్గా తుజే .. " అని ఫోన్ నేలకేసి కొట్టాడా కొత్త అల్ఖైదా నేత

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )