మళ్ళీ ఉగ్రవాదం బుస కొట్టింది !

Thursday, 14 July 2011

మళ్ళీ ఉగ్రవాదం బుస కొట్టింది !


జనం మరణించారు... గాయపడ్డారు !

మళ్ళీ రైళ్ళు పడిపోతున్నాయి !

జనం మరణించారు... గాయపడ్డారు !

మళ్ళీ ఉద్యమాలు వేడెక్కినాయి !

జనం రోడ్డెక్కారు.. ఆదాయం తగ్గుతోంది !

మళ్ళీ ధరలు పెరుగుతున్నాయి !

జనం తిండి తగ్గించారు.. తిట్లు పెంచారు !

మళ్ళీ మళ్ళీ స్కాములు జరుగుతున్నాయి !

జనం చూస్తున్నారు.. బిక్కపోతున్నారు !

ప్రభుత్వం మాత్రం ఏమీ చెయ్యదు !

మహా చేస్తే ఇంకో మంత్రివర్గ విస్తరణ చేసేసి,

లేకపోతే పెకముక్కలలా అదే మచ్చపడ్డ మంత్రులకు శాఖలు మార్చేసి,

బుజం తట్టుకొని సెహబాష్ మేము దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాం అని ప్రకటించుకుంటారు !

మనం చూడగలిగితే చూస్తూ ఉందాం ! చూడలేక పొతే... పోతాం !

అంతేగానీ మార్పు తేవడానికి మటుకూ ప్రయత్నించం !

మనకు మనం జేజేలు కొట్టుకుందాం = జై జై అసమర్ధులం అని !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )