నాకు ఒక మిత్రుడు పంపిన యదార్థ సంఘటన వివరాలు మీ అందరితో పంచుకోవాలని అనిపించింది !
:బెంగుళూరు లోని ఒక ఆసుపత్రిలో ఒక నాలుగేళ్ల బాలికను కాలు విరిగిందని చేర్పించారు ! విరిగి బయటకు పొడుచుకు వచ్చిన ఎముకను సరి చేయడానికి ఒక చిన్న ఆపరేషను చెయ్యడానికి సిద్దం అయ్యారు అక్కడి సర్జనులు ! అది చిన్న ఆపరేషనే అయిన ముందు జాగ్రత్త చర్యగా లయిఫ్ సప్పోర్ట్ సిష్టానికి ఆ పాపను జోడించి ఆపరేషను మొదలు పెట్టారు ! డాక్టర్లు ఆ ఆపరేషను కు ముందు ఆ సిస్టం లో వేరు వేరు పరిస్థితులను క్రోడీకరించి సిద్ధం చేసారు !
కారణం : ఆపరేషన్ దియేటర్ బయట ఎవరో తన సెల్ ఫోను వాడుతోంటే దాని ఫ్రీక్వెన్సీ ఈ సిస్టం ను అడ్డుకుంది !
కంగారుగా పరిగెత్తి ఆ ఫోను ఎవరిదో తెలుసుకుని ఆపుదామని ప్రయత్నించారు కానీ కుదరక ఆ చిన్న ప్రాణం గుటుక్కుమంది !
కావాలని కాకపోయినా నిషిద్ద ప్రదేశంలో సెల్ ఫోను వాడటం వలన ఎంత దారుణం జరిగిందో చూసారుగా !
అందుకని మనం చేయవలిసింది ఏమిటంటే ఇకనుంచి, హాస్పిటల్స్ దగ్గర గానీ, పెట్రోలు బంకుల దగ్గరగానీ, విమానయానం సమయంలో కానీ ఇంకా ఎక్కడెక్కడైతే సెల్ ఫోను వాడకం నిషిద్దమో అక్కడ సెల్ ఫోన్ల గొంతు నోక్కేద్దాం ! మనవల్ల తెలిసో తెలియకో ఇంకో ప్రాణి బలికాకుండా చూద్దాం !
3 comments:
మనసు వికలమయిది
Akkada cell phone jammar petta vachuga .... yevariki ye time lo argent call vastudo telidu kada.
ఏమోనండీ మరి జామర్లు కూడా వీటిని పని చేయ్యనివ్వవేమో తెలియదు !
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )