అన్నా హజారే (సహస్రాలు) కు సహస్రకోటి వందనాలు !

Friday, 8 April 2011

అన్నా హజారే దీక్షకు మద్దతిస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మహదానందం వేస్తోంది ! అయితే సోనియాగాంధీ లాంటి అవినీతి కళంకిత రాజకీయ నాయకులు కూడా మేమూ మద్దతిస్తున్నాం అనడం అనుమానాలను రేకెత్తిస్తోంది ! గోడలు లేని ప్రభుత్వ ద్వారానికి ద్వారపాలకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్న మన్మోహన్ సింగ్ గారికి ఇప్పుడైనా తన కర్తవ్యం భోధపడుతుందని ఆశ పడటం ఎడారిలో మరీచిక లానే కనిపిస్తోంది ! ఎన్నో ప్రక్రుతిక  వనరులూ, కష్టపడే మనస్తత్వం ఉన్న మానవ వనరులు కూడా ఉండీ ఇంకా మనం అగ్ర రాజ్యం గా ఎదగలేక పోవడానికి ఈ అవినీతే కారణం ! స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకు ఒక సరైన ఉద్యమం అన్నా హజారే గారి ద్వారా మొదలయ్యింది ! జయప్రకాశ్ నారాయణ్ గారి జనతా ఉద్యమం కూడా  తక్కువ ఉద్యమం కాదనుకోండి ! కానీ అది మళ్ళీ రాజకీయ నాయకుల చేతుల్లోకే వెళ్లి దిక్కులేని చావు చచ్చింది ! ఇప్పుడలా కాకుండా ఉండాలని కోరుకుందాం ! కానీ ఇన్నేళ్ళు అవినీతి ప్రపంచం లో పూర్తిగా మగ్గిపోయిన (బాధితులకు కూడా) మళ్ళీ మంచి జీవితానికి అలవాటు పడటానికి చాలా సమయం కావాలేమో ?

లోకపాల్ బిల్ కోసం ఏర్పడబోయే కమిటీకి ఏ రాజకీయ నాయకులూ అద్యక్షత వహించ కూడదు ! అన్నా గారికంటే దానికి తగిన అద్యక్షుడు లేరు  !

పెద్దలంతా ఎలా ఉన్నా యువత మటుకు ముందుకు వచ్చి వారికి మద్దతుగా నిలవాలి ఎందుకంటే భవిష్యత్తు వాళ్ళదే కదా ?

మన భారతా వని లో మళ్ళీ న్యాయం,  నీతి విలసిల్లాలని ప్రయత్నిస్తున్న అన్నా హజారే (సహస్రాలు) కు సహస్రకోటి వందనాలు !









1 comments:

Anonymous said...

agree

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )