రోజంతా కష్టపడినా తప్పని ఆఫీసరు తిట్లను తలుచుకుంటూ ఏడుపు మొహంతో ఇంటికివచ్చిన వెంగళరావుకు , ఇంట్లో హాయిగా టీవీ ముందు కూర్చున్న భార్యామణి కనిపించి చాలా బాధ వేసింది ! ఆ రాత్రి పడుకునేముందు వెంగళరావు దేవుడిని ఇలా ప్రార్ధించాడు :
" దేవుడా ! ఈ ప్రపంచం లో అదృష్టం అంతా ఆడవాళ్ళకు ఇచ్చి మా మగవాళ్ళను ఇంత దారుణంగా శిక్షించావే ?
" దేవుడా ! ఈ ప్రపంచం లో అదృష్టం అంతా ఆడవాళ్ళకు ఇచ్చి మా మగవాళ్ళను ఇంత దారుణంగా శిక్షించావే ?
నా మీద దయ ఉంచి, నా భార్యకు నా బాధ తెలిసే లాగా కనీసం ఒక్కరోజైనా నా భార్య తో శరీరాన్ని మార్చుకునే వరం ఇవ్వవూ ! "
ఎక్కడినుంచో " తధాస్తు ! " అని వినిపించింది వెంగళరావుకు ! సంతృప్తిగా పడుకున్నాడు !
ఎక్కడినుంచో " తధాస్తు ! " అని వినిపించింది వెంగళరావుకు ! సంతృప్తిగా పడుకున్నాడు !
పొద్దున్నఅయిదు గంటలకు లేసిన వెంగళరావు తను భార్య శరీరం లోనూ, భార్య తన శరీరంలోనూ ఉండటం గమనించి చాలా హేపీగా ఫీల్ అయ్యాడు !
గబగబా లేచి ఆయనకు (ఆమెకేలెండి ) టిఫిన్ తయారు చేసాడు ! పిల్లల్ని లేపాడు !
పిల్లలకు స్నానం చేయించి, టిఫిన్ తినిపించాడు !
లంచ్ బాక్స్ లోకి సర్ది, పిల్లల్ని స్కూల్ లో వదిలి ఇంటికి వచ్చాడు !
మాసిన బట్టలు లాండ్రీకి ఇవ్వడం కోసం తీసుకెళ్ళాడు !
లాండ్రీలో బట్టలిచ్చేసి.... ఆయన (ఆమె) ఇచ్చిన చెక్కు బేంకు లో జమ చేసాడు !
సూపర్ మార్కెట్ కి వెళ్లి కూరగాయలూ, సరుకులూ కొనుక్కొచ్చాడు !
సరుకులన్నీ చక్కగా కిచన్ లో సర్దేసాడు !
పాలవాడికీ, ఇంటి అద్దేకూ లెక్క సరిచూసి చేక్కులిచ్చాడు !
పిల్లి చేసిన కంగాళీ అంతా క్లీన్ చేసి... కుక్కకు స్నానం చేయించాడు !
టైం చూస్తే అప్పుడే మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది !
గబా గబా, పక్క దుప్పట్లు మార్చి ఉతికినవి వేసాడు !
మురికి బట్టలన్నీ తీసుకుని ఉతికేసాడు !
ఇల్లంతా వేక్యూం క్లీనర్ తో ఊడ్చి మాప్ తో తుడిచి శుభ్రం చేసాడు !
స్కూలు కి వెళ్లి పిల్లల్నితీసుకు రావడానికి వెళ్లి వాళ్ళు అడిగేవన్నీ కొనలేక వాళ్ళను నాలుగు తిట్టి ఇంటికి తీసుకొచ్చాడు !
వాళ్లకి ఇంట్లో ఉన్న బిస్కెట్లూ పాలూ ఇచ్చాడు !
రెండు బిస్కెట్లు తనూ నమిలాడు !
దగ్గరుండి వాళ్ళ హోం వర్క్ పూర్తి చేయించాడు !
కాస్త టీవీ చూస్తూ అత్యవసరం అయిన బట్టలు ఇస్త్రీ చేసాడు !
ఇంతా చూస్తే మళ్ళీ భోజనం సమయం అవుతోంది ! గబగబా కూరగాయలు కడిగి, కోసి ..
మసాలా వడలు తాయారు చేసి, బటానీలు వలిచాడు !
రాత్రి అందరి భోజనాలూ అయినాక డైనింగ్ టేబిల్ శుభ్రంగా తుడిచి, గిన్నెలన్నీ కడిగి సర్దేసాడు !
ఇందాక ఇస్త్రీ చేసిన బట్టలను మడతపెట్టి సర్దేసాడు, పిల్లలకు స్నానం చేయించి, నిద్రపుచ్చాడు !
అలిసిపోయి బెడ్రూం కి చేరేసరికి తొమ్మిదయ్యింది !
అక్కడ తన శరీరంలో ఉన్న భార్య శృంగారం కోరుకుంటే ఒపికలేకపోయినా కిమ్మనకుండా కార్యం కానించి వొళ్ళు పులిసిపోయిన వెంగళరావు వొళ్ళు తెలియకుండా నిద్ర పోయాడు !
పొద్దున్నే లేవగానే వెంగళరావు చేసిన మొదటి పని దేవుడి ముందు సాష్టాంగ ప్రమాణం చెయ్యడం ! మళ్ళీ ప్రార్ధించసాగాడు వెంగళరావు :
" దేవుడా ! నాకు అస్సలు బుద్ధి లేదు ! ఆడవాళ్ళు రోజంతా పై చెయ్యకుండా హాయిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్తారనుకోవడం నా మూర్ఖత్వం ! నా కళ్ళు తెరుచుకున్నాయి ! ఇంకా ముందు నా భార్యను గౌరవంగా చూసుకుంటాను మళ్ళీ నన్ను నా శరీరం లోకి పంపించేయ్యి !"
మళ్ళీ దేవుని స్వరం వినిపించింది వెంగళరావుకు :
" సంతోషం నాయనా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు ! నీకు నీ శరీరాన్ని ఇవ్వాలనే ఉంది, కానీ అది జరగాలంటే ఇంకో తొమ్మిది నెలలు ఆగాలి నువ్వు ! ఎందుకంటే రాత్రి నువ్వు నెలతప్పావు ! "
3 comments:
అబ్బే మీరనుకునేది నిజం కాదు మాష్టారూ.. నిజానికి మగాళ్ళే ఆడవారికన్నా ఎక్కువ పని చేస్తారట.
http://www.telegraph.co.uk/relationships/7929014/Feminism-Forget-it-sisters.html
:-)
chalaa bagundi.. mee narration
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )