స్వాతంత్రమనే వజ్రపు వన్నెతగ్గనీయవద్దు !

Monday, 15 August 2011


      మనకు  వచ్చిన ఈ స్వాతంత్రానికి మన దేశపు అన్ని ప్రాంతాలకూ చెందిన వివిధ భాషల, భిన్న జాతుల ప్రజల ఐకమత్య పోరాటమే మూల కారణం ! భిన్ననాగరికతల సమ్మేళనమే మన  దేశ గౌరవం అని గొప్పగా భావించే వాళ్ళం మనం  ! ప్రస్తుత కాలం లో అవినీతి కారణంగా పెరిగిన  అధిక ధరలు , ద్రవ్యోల్బణం, నెమ్మది నెమ్మదిగా మనందరినీ మానవత్వపు విలువలు మరిచి స్వార్ధపరత్వం వేపు అడుగులు వేయిస్తున్నాయి !  మనం విద్యతో వికసించాల్సిన బుద్ధిని సంకుచింప చేస్తూ ఇలాగే  వెళ్తుంటే రష్యాలానే  మనలో మనం కుమ్ములాడుకుని  విచ్చిన్నమై పోవడానికి మనకు ఎంతో కాలం  పట్టదు ! అప్పుడు సింహం నాలుగు ఎద్దుల కథలో లాగా మనం   బలహీన పడటం ఖాయం ! అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పొరుగు దేశాలకు అప్పుడు మనను ఆక్రమించుకుని మనపై మళ్ళీ బానిసత్వాన్ని రుద్దడం చాలా సులువవుతుంది !
 అదే జరగాలనుకుంటే మనం ఇలాగే ఉందాం !  

 కాదనుకుంటే  మనకు దొరికిన ఈ స్వాతంత్రమనే వజ్రాన్ని మెరుగు పెడుతూ, దాని వెలుగులు కుల, మత, బాష, జాతి, లింగ, ప్రాంత భేదాలను పక్కనపెట్టి  అందరితో సమైఖ్యంగా పంచుకుంటూ మన దేశ ప్రగతికి పాటుపడదాం ! 
  
  భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ! 
   జై భారత్ !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )