మన భారతీయుల జీవితాలలో మళ్ళీ ఊపిరులు ఊదిన అన్నా!

Thursday, 18 August 2011

 
 నిజమే మరి మనం చాన్నాళ్ళుగా  ' ఇలాంటిఅవినీతి కలుషిత భారతం లోనా మనం పుట్టింది  ? '  అని సిగ్గుతో తలలు వంచి జీవచ్చావాలలా బ్రతుకుతున్నాం ! అంటే అన్నాకు ముందు ఎవరూ  అవినీతి మీద విరోధం ప్రకటించలేదని కాదు ! ప్రయత్నించిన వారిని పదవీచ్యుతులను చేయడం ద్వారానో, బదలీలు చేయడం  ద్వారానో , వారిని నానావిధాలుగా కష్టనష్టాల పాలుచెయ్యడం ద్వారానో, వారినే అవినీతిపరులుగా చిత్రీకరించడం ద్వారానో, వీటివల్ల ప్రయోజనం లేకపోతే ఆవ్యక్తినే గాయపరచడం ద్వారానో , హతమార్చడం ద్వారానో  వారందరినీ నిర్వీర్యులను చేసింది ఈ అవినీతి బూతం !

కానీ అన్నాహజారే వ్యక్తిత్వం, వయసు, నిస్వార్ధపరత్వం ముందు ఈ బూతం పప్పులు ఉడకలేదు !  అవినీతి ఊడలద్వారా మన భారతావని సిరులు పీల్చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం,  ఆ రాందేవ్ బాబాలానే ఈ అన్నాను కూడా పక్కకు ఈడ్చేస్తే భయంతో వణికిపోయి నోరుమూసుకుని పడిఉంటారు  అనుకుంది ! అయితే అన్నా పట్టువదలని దీక్షకు దిగిరాక తప్పలేదు ! 

 ఇదేమీ అంతిమ విజయం కాదు ! ఏదో విధంగా జనం దృష్టి మరల్చి ఈ కృత నిశ్చయాన్ని బలహీన పరచడానికి ప్రయత్నం జరుగుతుంది !  పెద్దవయసు అన్నాకు నిరవధికంగా దీక్ష చెయ్యగలిగే అవకాశం తక్కువ ! ఆయన ఆరోగ్యం క్షీణించి పోకుండా చూడాల్సిన భాద్యత కూడా ఆయన అనుచరులమీద ఉంది ! యూపీఏ ప్రభుత్వానికి  బుద్ధి వచ్చి జన లోక్ పాల్ బిల్లుకు త్వరగా పచ్చజెండా ఊపుతుందని ఆశించడం కొద్దిగా కష్టమే !

  
 సమీప భవిష్యత్తులోనే అవినీతిరహిత భారతావనిని చూడగలం అని ఆశిద్దాం !
జై భారత్ !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )