పార్లమెంటులో కాంగ్రెస్ ను ప్రతిపక్షంతో చేతులు కలిపి తాను కోరుకున్న జన లోక్ పాల్ బిల్లు మీద చర్చించి ఒక్క మాటమీద సరే అనిపించిన అన్నాకు ధన్యవాదాలు ! ఇది ఒక మహోత్తరమైన ముందడుగు ! లంచగొండి తనాన్ని రూపు మాపడానికి చట్టం కన్నా లంచం ఇవ్వకూడదనే మన నిర్ణయమే ఎక్కువగా సహాయపడుతుంది ! సిటిజన్ చార్టర్ ద్వారా కొంత వరకూ ఇది కూడా నిర్మూలం అవుతుంది ! ఇకనుంచి మనం చెయ్యవలిసింది అన్యాయాన్ని మౌనంగా భరించడం కాదు ! మొండిగా బట్టబయలు చెయ్యడం ! ఇంక మనం మన జన సామాన్యం లో ఉన్న ఇతర అక్రమాలను రూపు మాపడానికి నడుం కట్టుకోవాలి ! అప్పుడే మన భావి యువతరం స్వర్ణ భారతం లోకి అడుగు పెడుతుంది ! జై భారత్ !
ఈ సాయంత్రం దీక్ష విరమిస్తున్న అన్నా ప్రతిసారీ రావాలని ఎదురు చూడకూడదు !
మనం కూడా నడుంకట్టి నడవాలి !
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )