పొద్దున్నే కాసిని ఎక్సర్ సైజ్ లు, కాస్సేపు యోగా !
ఇంకా ఎవరూ ఆడుకోవడానికి రాలేదే ?
ఉయ్యాల జంపాల ఆడిన తరువాత దిగటం ఎలాగో తెలియట్లేదే ?
ఇలా నీళ్ళలో ఉండమంటే రోజంతా ఉంటా !
నేను కుంగ్ ఫూ నేర్చుకోలేదు కానీ అవసరమైతే రెడీనే !
అందుకే పొద్దున్నే ఎక్సర్ సైజెస్ చెయ్యాలనేది ! బరువు తగ్గకపోతే ఇంత చిన్న చెట్టుకూడా ఎక్కలేము !
బరువు తగ్గే దాకా ఇక్కడే కూర్చుని చెట్టు ఎక్కినట్లు ఊహించుకోవలేమో ?
దాగుడుమూతలు ఆడుతున్నాం ! నేను ఇక్కడున్నట్లు ఎవరికీ చెప్పకండే ?
వాళ్ళంతా పెద్ద పెద్ద చెట్లు ఎలా ఎక్కుతారబ్బా? నేనైతే ఊరికే ఇలా పడిపోతుంటా !
ఆటలు ఆడీ ఆడీ బాగా అలిసిపోయా ! కాస్సేపు ఓ కునుకేస్తున్నా !
నాకు లంచం ఇచ్చి నాతో పని చేయించుకో లేరు ఎవరూ ! (మరీ ఒక్క గడ్డిపరకా ఇచ్చేదీ ? )
నిజం చెప్పు నేను చెట్లు ఎక్కలేనని మన వీధిలో అమ్మాయిలకి చెప్పింది నువ్వే కదూ ?
మధ్యలో ఈ పాడు అడ్డం లేకపోతే ఎంచక్కా మనం కలిసి ఆడుకునేవాళ్ళం కదూ ?
ఆడుకోవడానికి పోనీయలేదని నేను అలిగానన్నమాట !
ఆడుకోవడం లేకపోతే ఇలా పడుకోవడం ! అదండీ మా దినచర్య ! బావుందా ?
ఏమీ అనుకోకపోతే కొద్దిగా కిందకు దించుతారా ?
ఈ విషయాలన్నీ మీరు అందరికీ చేబుతారంటేనాకు భలే సిగ్గేస్తోంది బాబూ !
మళ్ళీ ఎప్పుడైనా రండి కలిసి ఆడుకుందాం ! సరేనా ?
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )