ఇది కొత్త ఫ్యాషన్ తెలుసా ?

Tuesday, 27 October 2009

ఈ పేటకు నేనే మేస్త్రీ !

పీ వీ నరసింహా రావు ఎక్స్ ప్రెస్ వే మీద మొదటి ప్రయాణం

Tuesday, 20 October 2009

ఎప్పుడెప్పుడా అని భాగ్యనగరవాసులందరూ ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది ! పీ వీ ఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే మొత్తానికి నిన్న రోసయ్యగారి హస్తాలమీదుగా జాతికి అంకితం చేయబడింది ! ఆరు వందల కోట్ల రూపాయల ఖర్చుతో 11.66 కి మీ పొడవుతో దర్జాగా దేశం మొత్తం మీద అతి పొడవైన ఫ్లై ఓవర్ గా పేరు మ్రోగించుకొంటూ ప్రయాణికులను ఆహ్వానించింది !
ఈ రోజు ఉదయమే ముంబైకి బయలుదేరిన నేను ఎంతో సంతోషించాను ! ఆహా తొలిసారి ఈ ఎక్స్ ప్రెస్ వే ను వాడుతున్నాను ఏమి నా భాగ్యమూ అని బయలు దేరాను ఏరో ఎక్స్ ప్రెస్ లో !
ద్విచక్ర, త్రి చక్ర వాహనాలనూ, రిక్షా, లారీ లేక ట్రాక్టర్ లను , పాద చారులను దీనిమీడకు రానిచ్చేది లేదని ముందు నుంచీ డంకా బజాయించి చెబుతున్న ప్రభుత్వపు మాటలను ప్రజలు మన్నిన్చేట్లు చేయడానికి బ్రిడ్జి మొదట్లో ఎవరైనా ఉంటారేమో అని చూస్తె పాపం ఎవ్వరూ లేరు ! దానికి తగ్గట్లు గానే ఈ ఎక్స్ ప్రెస్ వే పై నుంచి నగర అందాలను చిత్రభద్దమ్ చేయడానికి కొందరు పాదచారులు ప్రయత్నిస్తూ కనిపించారు ! ఇంకా కొత్త బ్రిడ్జి కాబట్టి సరిగా అవగాహన లేక వాహనాలు తక్కువ వేగం తో వెళుతున్నాయి కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతె వారి పరిస్తితి వారి వల్ల వాహన చాలకుల పరిస్థితీ తలుచుకుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది !
ఏరో ఎక్స్ ప్రెస్ బస్లో కూర్చొని చూస్తుంటే ఉదయాన్నే పూర్తి దృశ్యం సరిగా కనిపించలేదు కానీ కంటోన్మెంట్ దగ్గర పెరిగిన చెట్లు చక్కటి అనుభూతిని ఇచ్చాయి ! హైదరగూడా దగ్గర లోయలోకి చూస్తున్నట్లు అనుభూతి కూడా బానే ఉంది !
ఈ అనుభూతులకు తూట్లు పొడుస్తూ బ్రిడ్జి మీద తక్కువ వేగంలో కూడా ఎగిరెగిరి పడుతున్న వాహనాలు, కింద రోడ్డు ఎన్ని వంకరలు ఉంటే అన్ని వంకరలతోనూ, ఎన్ని ఎత్తుపల్లాలు ఉంటే అన్ని ఎత్తుపల్లాలతోనూ, స్తంబాలను బ్రిడ్జి మీద గతుకులులా అనిపించనివ్వకుండా, ఒకే లెవెల్ లో ఉంచి తిన్నగా రోడ్డు వేయడం అంత కష్టమైన పనా ? , రెండు చోట్ల స్పీడు బ్రేకర్లతో అక్కడ సన్నగా మారి ఇంకా నిర్మాణం పూర్తికాలేదని చెప్పక చెబుతున్న బ్రిడ్జీ భవిష్యత్తులో ఈ రెండు చోట్లా ఒకవేళ ట్రాఫిక్ వచ్చి జాంలు ఏర్పడితే చాలా ఇబ్బంది కరం కావొచ్చని హెచ్చరిక చేసింది !

ఎవరో ఇది ముంబై లో ఈ మధ్యనే ప్రారంభించిన వొర్లి - భాంద్రా సీ రూటు బ్రిడ్జి కన్నా బావుందని ప్రశంసించారు, కానీ అది తిన్నగా ఎటువంటి వంకరాలూ లేకుండా జనావాసాలకు దూరంగా, సముద్రం లో ఉంటే , ఈ బ్రిడ్జి అష్టావక్రంగా, రెండు ప్రక్కలా పెరుగుతున్న కాంక్రీటు అరణ్యం మధ్యలో వెళ్తూ ఉంది ! ఎలా ఉన్నా రెంటి పనీ ఒక్కటే, రద్దీ తగ్గించి సమయాన్ని మిగల్చడం ! దీనికి పెట్టవలసిన శబ్ద కాలుష్యాన్ని తగ్గించే నాయిస్ బ్రేకర్లు పెట్టి బ్రిడ్జి పొడుగూతా ఉన్నా ప్రజల నిద్రను కాపాడుతారని ఆశిస్తాను !
ఒక 15 నిముషాలలో ముగిసిన మొదటి ప్రయాణం ఆనందాన్నీ, ఆందోళన నూ సమ పాళ్ళలో రుచి చూపించింది అచ్చు ఉగాది పచ్చడిలా !