థాంక్స్ ఫ్రెండ్ ! నువ్వు నాలాంటి చిన్న జీవికి కడుపు నిమ్పినందుకు !

Saturday 30 April 2011

దేవుడికి పండూ రాసిన ఉత్తరాలు !

Friday 29 April 2011


రాబోయే పుట్టిన రోజుకి తనకు కానుకగా ఏమి కొంటె బావుంటుందో చెప్పాలని, ఇంటి పనుల్లో బిజీగా ఉన్న తల్లిదగ్గరకి  గుణుస్తూ వచ్చాడు పండూ !
  "మమ్మీ... మమ్మీ.. మరే  నా బర్త్డే కి  నాకు సైకిల్ కావాలి మమ్మీ  !"
పండూగాడు బాగా అల్లరి వాడిగా పేరు మోసాడు ! ఇంటి దగ్గరా, స్కూల్ లో వాడి అల్లరికి అంతే లేదు !
అందుకనే " పండూ నువ్వు పుట్టినరోజుకి సైకిల్ కొని ఇవ్వదగినట్లే ప్రవర్తిస్తున్నావంటావా ? " అంది వాళ్ళ మమ్మీ !
పండూ గాడైతే తనను మించి ఎవరికీ అంత మంచి బర్త్ డే గిఫ్ట్ పొందే అర్హతే లేదన్నాడు !  
పండూ గాడికి కొద్దిగా అద్యాత్మికత, సత్పర్వర్తన నేర్పాలనే ఉద్దేశ్యం తో  వాళ్ళ మమ్మీ అంది " పండూ నువ్వొక పని చెయ్యాలి ! నీ రూం కి వెళ్లి పోయిన పుట్టినరోజు నుంచి ఇప్పటిదాకా నువ్వు ఎలా ప్రవర్తించావు ఎన్ని మంచిపనులు చేసి, ఎంత మంచి వాడివి గా ఉన్నావో ఒక సారి ఆలోచించు తరువాత ఒక కాగితం తీసుకుని దేముడికి ఉత్తరం రాయి  ! అందులో నీకు నీ బర్త్ డే కి సైకిల్ ఎందుకివ్వాలో వివరించు ! "   
గంతులేస్తూ రూం కి పరిగెత్తాడు పండూ తన టేబుల్ దగ్గర కూర్చొని దేవుడికి ఉత్తరం రాయడం మొదలు పెట్టాడు !

  మొదటి ఉత్తరం  :

 ప్రియమైన దేవా,
పోయిన సంవత్సరం అంతా నేను చాలా మంచి కుర్రాడిగా ఉన్నాను కదా ! నాకు నా బర్త్ డే కి ఒక సైకిల్ కావాలి ! అది ఎర్రగా ఉంటె నాకిష్టం !
మీ నేస్తం 
పండూ
  పండూ కి తెలుసుగా తను రాసింది నిజం కాదని ! ఎందుకంటే తను అసలు పోయిన సంవత్సరం గుడ్ బాయ్ లా లేనే లేడు ! అందుకని ఆ లెటర్ చింపి ఇంకోటి రాయడం మొదలు పెట్టాడు !
 
రెండో ఉత్తరం :
ప్రియమైన దేవా, 

నేను మీ నేస్తం పండూ  రాస్తున్నాను ! పోయిన సంవత్సరం గుడ్ బాయ్ గా ఉన్నాను కదా అందుకని నాకు ఒక ఎర్ర సైకిల్ కావాలి ! థాంక్స్ !
మీ నేస్తం 
పండూ 
 మళ్ళీ చదివి చూసుకుని నిజం రాయలేదని అనిపించి చిన్చేసాడు !
మూడో ఉత్తరం !
ప్రియమైన దేవా, 
పోయిన సంవత్సరం నేను పర్వాలేదు కదా ! అయినా నాకు నా బర్త్  డే కి సైకిలు కావాలి !
పండూ 

పండూ కి తెలుసు ఇలా లెటర్ పంపితే ఏమీ ప్రయోజనం ఉండదని ! అందుకని దాన్ని కూడా చింపి మళ్ళీ లెటర్ రాయడం మొదలు పెట్టాడు !

నాలుగో ఉత్తరం :
దేవా,
నాకు తెలుసు నేను పోయిన సంవత్సరం గుడ్ బాయ్ లా లేనని ! నన్ను క్షమించు ! నువ్వు నాకు నా బర్త్ డే కి సైకిల్ ఇచ్చావంటే  నేను గుడ్ బాయ్ లా ఉంటాను ! ప్లీజ్ !
థాంక్ యూ !
పండూ 
పండూ కి అనిపించింది ఇది నిజం అయినా గానీ ఇలా ఉత్తరం రాస్తే తనకు సైకిల్ రావడం అసాధ్యం అని !
పండూకి చాలా బాధగా అనిపించింది ! దిగాలుగా మమ్మీ దగ్గరికి వెళ్లి " నేను చర్చ్ కి వెళ్లొస్తాను మమ్మీ !" అని చెప్పాడు !

తన ప్లాన్ బాగా పని చేసినట్లు అనిపించింది మమ్మీకి ! బాధతో ఉన్నట్లు కనిపిస్తున్న పండూ బుజం తట్టి " భోజనం సమయానికి వచ్చెయ్యాలి ! " అంది మమ్మీ !
  నెమ్మదిగా వీధి చివరనున్న చర్చ్ కి నడుచుకుంటూ వెళ్ళాడు పండూ ! చర్చ్ లో వేదిక దగ్గరకు వెళ్లి అటూ ఇటూ చూసాడు ఎవరూ లేక పోవడం గమనించి అక్కడున్న మేరీమాత విగ్రహాన్ని తీసి తన చొక్కాలోపల దాచుకుని చర్చ్  నుంచి ఇంటికి ఎక్కడా ఆగకుండా పరిగెత్తాడు పండూ ! 
తన రూములోకి వెళ్లి తలుపు వేసేసుకుని, చొక్కా కింద దాచిన మేరీ మాత  విగ్రహాన్ని తన టేబుల్ మీద పెట్టి , కూర్చుని కాగితం తీసుకుని మళ్ళీ దేవుడికి ఇంకో లెటర్ రాయడం మొదలు పెట్టాడు పండూ ! 
ఐదో / ఆఖరి ఉత్తరం :
దేవా,

నీ మమ్మీని కిడ్నాప్ చేసాను ! నీకు మళ్ళీ మీ మమ్మీని చూడాలని ఉంటె వెంటనే నాకొక ఎర్ర సైకిల్ పంపు !
అర్థం అయ్యిందా ?
పండూ 

ఇతరులకు పంచితే మనకు హాయి కలిగించే ఆస్తి !

Thursday 28 April 2011

ఇతరులకు పంచితే మనకు హాయి కలిగించే ఆస్తి ,  ఈ నవ్వుల లోకం నిండా ఉన్న కల్మషం లేని నవ్వే !






































ఎంతవారైనా చివరికి ఇలా ప్రకృతిలో కలిసి పోవాల్సిందేగా ?

Wednesday 27 April 2011

అవును మరి మానయినా, మనిషయినా ఎంత గొప్పవారైనా చివరికి ఇలా ప్రకృతిలో కలిసి పోవాల్సిందే !