సరుకు జాగ్రత్త

Tuesday 31 May 2011


నువ్వు డ్రైవింగ్ బాగా చేసి సరుకు జాగ్రత్తగా తీసుకెల్తావని నాకు తెలుసు కానీ.. పొరబాటున సడెన్  బ్రేకు వేసావో సరుకు గల్లంతై పోద్ది బాసూ  ! 

చట్ట సభలలో నాయకులు

Monday 30 May 2011

ఉక్రెయిన్ 

చైనా 

ఇండియా 

ఇటలీ 

జపాన్ 

మెక్సికో 

రష్యా 

దక్షణ కోరియా 

తైవాన్ 

టర్కీ 
వివిధ దేశాల చట్ట సభలలో నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తుంటారో చూసారుగా ?

ఒకే స్ట్రోకులో వేసిన అద్భుతమైన బొమ్మ !

Friday 27 May 2011


నమ్మడం కష్టం కదూ ? షేడ్స్ ని కూడా ఒక్కసారే చేయగలిగి ఉంటే నిజంగా అద్భుతమైన కళాకారుడే గీసి ఉంటాడు !

గుచ్చుకొంటోంది తీసేయ్ !

చేత్తో పెడితే వద్దన్నానా ? ఇలా వద్దంటే వినవే ?

నిప్పు ఎలా కనుక్కున్నారో ?

Thursday 26 May 2011


ఈ రోజుల్లో పిల్లలను అడిగితే... బహుసా ఇలానే కనుక్కుని ఉంటారు అని చెబుతారేమో ?

దేవుడా... ఈ ఆడవాళ్లకెంత అదృష్టం ఇచ్చావు ?

Wednesday 25 May 2011


రోజంతా కష్టపడినా తప్పని ఆఫీసరు తిట్లను తలుచుకుంటూ   ఏడుపు మొహంతో ఇంటికివచ్చిన వెంగళరావుకు , ఇంట్లో హాయిగా టీవీ  ముందు కూర్చున్న భార్యామణి కనిపించి చాలా బాధ వేసింది ! ఆ రాత్రి పడుకునేముందు వెంగళరావు దేవుడిని ఇలా ప్రార్ధించాడు :
   " దేవుడా ! ఈ ప్రపంచం లో అదృష్టం అంతా ఆడవాళ్ళకు ఇచ్చి మా మగవాళ్ళను ఇంత  దారుణంగా శిక్షించావే ? 
నా మీద దయ ఉంచి, నా భార్యకు నా బాధ తెలిసే లాగా కనీసం ఒక్కరోజైనా నా భార్య తో శరీరాన్ని మార్చుకునే వరం ఇవ్వవూ ! " 
ఎక్కడినుంచో   " తధాస్తు ! "  అని వినిపించింది వెంగళరావుకు !  సంతృప్తిగా పడుకున్నాడు !

పొద్దున్నఅయిదు గంటలకు  లేసిన వెంగళరావు తను భార్య శరీరం లోనూ, భార్య తన శరీరంలోనూ ఉండటం గమనించి చాలా హేపీగా ఫీల్ అయ్యాడు !

గబగబా లేచి ఆయనకు (ఆమెకేలెండి ) టిఫిన్ తయారు చేసాడు ! పిల్లల్ని లేపాడు !


పిల్లలకు స్నానం చేయించి, టిఫిన్ తినిపించాడు !

లంచ్ బాక్స్ లోకి  సర్ది,  పిల్లల్ని స్కూల్ లో వదిలి ఇంటికి వచ్చాడు ! 
మాసిన బట్టలు లాండ్రీకి  ఇవ్వడం కోసం తీసుకెళ్ళాడు !


 లాండ్రీలో బట్టలిచ్చేసి....  ఆయన (ఆమె) ఇచ్చిన చెక్కు బేంకు లో జమ చేసాడు !

సూపర్ మార్కెట్ కి వెళ్లి కూరగాయలూ, సరుకులూ కొనుక్కొచ్చాడు !  
సరుకులన్నీ చక్కగా కిచన్ లో సర్దేసాడు !

పాలవాడికీ, ఇంటి అద్దేకూ లెక్క సరిచూసి చేక్కులిచ్చాడు !


పిల్లి చేసిన కంగాళీ అంతా క్లీన్ చేసి...  కుక్కకు స్నానం చేయించాడు ! 
టైం చూస్తే అప్పుడే మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది !

గబా గబా, పక్క దుప్పట్లు మార్చి ఉతికినవి వేసాడు !

మురికి బట్టలన్నీ తీసుకుని ఉతికేసాడు !

ఇల్లంతా వేక్యూం  క్లీనర్ తో ఊడ్చి మాప్ తో తుడిచి శుభ్రం చేసాడు !

స్కూలు కి వెళ్లి పిల్లల్నితీసుకు రావడానికి వెళ్లి వాళ్ళు అడిగేవన్నీ కొనలేక వాళ్ళను నాలుగు తిట్టి ఇంటికి  తీసుకొచ్చాడు ! 
వాళ్లకి  ఇంట్లో ఉన్న బిస్కెట్లూ పాలూ ఇచ్చాడు ! 
రెండు బిస్కెట్లు తనూ నమిలాడు !


దగ్గరుండి వాళ్ళ హోం వర్క్ పూర్తి చేయించాడు !

కాస్త టీవీ చూస్తూ అత్యవసరం అయిన బట్టలు ఇస్త్రీ చేసాడు !

ఇంతా చూస్తే మళ్ళీ భోజనం సమయం అవుతోంది ! గబగబా కూరగాయలు కడిగి, కోసి ..

మసాలా వడలు తాయారు చేసి, బటానీలు వలిచాడు !


 రాత్రి అందరి భోజనాలూ అయినాక డైనింగ్ టేబిల్ శుభ్రంగా తుడిచి, గిన్నెలన్నీ కడిగి సర్దేసాడు !


ఇందాక ఇస్త్రీ చేసిన బట్టలను మడతపెట్టి సర్దేసాడు, పిల్లలకు స్నానం చేయించి, నిద్రపుచ్చాడు !


అలిసిపోయి బెడ్రూం కి చేరేసరికి తొమ్మిదయ్యింది ! 
అక్కడ తన శరీరంలో ఉన్న భార్య శృంగారం కోరుకుంటే ఒపికలేకపోయినా కిమ్మనకుండా కార్యం కానించి వొళ్ళు పులిసిపోయిన వెంగళరావు వొళ్ళు తెలియకుండా నిద్ర పోయాడు !
పొద్దున్నే లేవగానే వెంగళరావు చేసిన మొదటి పని దేవుడి ముందు సాష్టాంగ ప్రమాణం చెయ్యడం ! మళ్ళీ ప్రార్ధించసాగాడు వెంగళరావు :
  " దేవుడా ! నాకు అస్సలు బుద్ధి లేదు ! ఆడవాళ్ళు రోజంతా పై చెయ్యకుండా హాయిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్తారనుకోవడం నా మూర్ఖత్వం ! నా కళ్ళు తెరుచుకున్నాయి ! ఇంకా ముందు నా భార్యను గౌరవంగా చూసుకుంటాను మళ్ళీ నన్ను నా శరీరం లోకి పంపించేయ్యి !"
మళ్ళీ దేవుని స్వరం వినిపించింది వెంగళరావుకు :
" సంతోషం నాయనా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు ! నీకు నీ శరీరాన్ని ఇవ్వాలనే ఉంది,  కానీ అది జరగాలంటే ఇంకో తొమ్మిది నెలలు ఆగాలి నువ్వు ! ఎందుకంటే రాత్రి నువ్వు నెలతప్పావు ! "

మీ పిల్లలు లంచ్ చెయ్యట్లేదా ?

Monday 23 May 2011










కొద్దిగా కష్టపడి ఇలా సర్ది పెడితే లంచ్ బాక్స్ ఖాళీ చెయ్యడమే కాక, తోటి పిల్లలతో కలిసి పంచుకోవడానికి కూడా తయారైపోతారు !

గుండె గుప్పిట్లోకి వచ్చిన వేళ !

Wednesday 18 May 2011

బిగ్ బజార్ లో అవీ ఇవీ కొంటున్న సందేశ్ కి కాషియర్ తో మాట్లాడుతున్నా ఒక 5 / 6  సంవత్సరాల బాబు కనిపించి కుతూహలంగా దగ్గరికి వెళ్లి వాళ్ళ సంభాషణ విన్నాడు !
 కాషియర్  : " సారీ బాబూ ఈ బొమ్మను కొనడానికి నీ దగ్గరున్న డబ్బులు సరిపోవు ! "
సందేశ్ ని చూసిన బాబు  ఆశతో " చూడండి అంకుల్ ఈ బొమ్మకు నాదగ్గర ఉన్న డబ్బులు సరిపోవంటున్నారు కొద్దిగా చూసి చెప్పరా ? "
సందేశ్ ఆ బాబు దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని లెక్కపెట్టి, బొమ్మ ఖరీదుతో పోల్చి చూసి " నిజమేనమ్మా నీ దగ్గర ఉన్న డబ్బులు ఈ బొమ్మ కొనడానికి సరిపడా లేవు " అన్నాడు !
ఆ బొమ్మను ఇంకా గుండెకు హత్తుకుని నిలబడ్డ బుల్లి బాబును చూసి అతణ్ణి దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తూ అడిగాడు ! " ఎవరికోసం ఈ బొమ్మ కొంటున్నావ్ బాబూ ? "
" మా చెల్లి కి బర్త్ డే గిఫ్ట్ లా ఇద్దామని కొంటున్నాను అంకుల్  ఈ బొమ్మని ! మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం అంటే నమ్మండి ! ఈ బొమ్మను తీసుకెళ్ళి మా అమ్మకిస్తే తను చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తుంది ! " బాధగా బొమ్మ వంక చూస్తూ చెప్పాడు బాబు !
" చెల్లేమో దేవుడి దగ్గిరికి  వెళ్ళింది కదా...
 అమ్మ త్వరలో దేవుణ్ణి చూడటానికి వెళ్తోందని డాడీ చెప్పారు !
 అప్పుడు బొమ్మమమ్మీ తీసుకెళ్తే  చెల్లికి ఇవ్వకలుగుతుంది అనిపించీ ... "
వింటున్న సందేశ్ గుండె ఒక్కసారి ఆగినట్లు అనిపించింది ! ఆ బాబు సందేశ్ కళ్ళలోకి చూస్తూ " నేను మమ్మీని అప్పుడే వెళ్లోద్దని చెప్పమని డాడీకి చెప్పాను అంకుల్ ! నేను ఈ బొమ్మను కొని తీసుకెళ్ళే దాకా ఉండాలి కదా ? " అంటూ తను బాగా హాయిగా నవ్వుతున్న ఫోటో చూపించాడు ఆ బుజ్జి బాబు !
" ఈ బొమ్మతో పాటు మమ్మీకి నా  ఫోటో కూడా ఇస్తున్నా అంకుల్ ఎందుకంటే అప్పుడు మా చెల్లి నన్ను మర్చిపో లేదుగా ?  మా మమ్మీ అంటే కూడా నాకు చాలా ఇష్టం అంకుల్ ! తనను వదిలి ఉండలేనేమో కూడా !  కానీ డాడీ ఏమో చెల్లి దగ్గర ఉండటానికి తను వెళ్ళక  తప్పదు  అంటున్నారు !"  అంటూ ఆ బొమ్మ వంక నిరాశతో చూసాడు ఆ బుల్లి బాబు !
సందేశ్ వెంటనే తన జేబులో చెయ్యిపెట్టి బాబుతో " మళ్ళీ ఇంకో సారి చెక్ చేద్దామా నీ డబ్బులు బొమ్మకు సరిపోతాయో లేదో ? " అన్నాడు ?
" సరే అంకుల్ ! నా డబ్బులు సరిపోతే బావుండు ! " అన్నాడు ఆ బాబు మళ్ళీ చిగురించిన ఆశతో !
ఆ బాబు చూడకుండా తన జేబులోంచి కొంత డబ్బు తీసి బాబు డబ్బులతో కలిపి లెక్కపెట్టాడు సందేశ్ ! బొమ్మకు సరిపడా డబ్బులే కాక ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయి అప్పుడు !
అది చూసిన బుజ్జి బాబు ఆనందం తో " థాంక్స్ దేముడా నా దగ్గర సరిపడా డబ్బులిచ్చినందుకు ! " అని " నిన్న రాత్రి నేను పడుకోబోయే ముందు దేముడికి ప్రేయర్ చేస్తూ చెప్పాను అంకుల్ ' దేముడా నాదగ్గర బొమ్మకు సరిపడా డబ్బులు ఉండేట్లు చూడు  అప్పుడు నేను కొని మా మమ్మీకి ఇస్తే తను   చెల్లికి ఇస్తుంది' అని చెప్పాను ! దేముడు నా మాట విన్నాడు చూసారా ? నాకైతే ఈ బొమ్మతో పాటు ఒక తెల్ల గులాబి కొనడానికి కూడా సరిపడా డబ్బులుంటే బావుంటుంది అనిపించింది కానీ అలా అన్నీదేముడిని అడగడానికి భయం వేసింది ! అయినా కానీ దేముడు బొమ్మతో పాటు తెల్ల గులాబీ పువ్వు కొనడానికి సరిపడా డబ్బులిచ్చాడు చూసారా ? మా మమ్మీకి తెల్లగులాబీలంటే చాలా ఇష్టం అంకుల్ ! "   
అలా ఆ బుల్లిబాబు సందేశ్ కి థాంక్స్ చెప్పే తన బొమ్మను తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ! సందేశ్ ఇందాకటికంటే విరుద్ధమైన మూడ్ తో  షాపింగ్ పూర్తి  చేసాడు కానీ తన ఆలోచనల నుండి ఆ బుజ్జిబాబును చెరిపెయ్యలేకపోయాడు  ! అతనికి అకస్మాతుగా రెండు రోజుల క్రితం న్యూస్ పేపర్ లో చదివిన వార్త గుర్తొచ్చింది !
' బాగా తాగి ఉన్న ఒక ట్రక్ డ్రైవర్ ఒక కారును గుద్దితే అందులో ఉన్న చిన్న పాప అక్కడికక్కడే మరణించిందనీ ఆ పాప తల్లి కూడా కోమాలో ఉందనీ, ఆ కుటుంబం ఎప్పటిదాకా  కోరుకుంటే అప్పటిదాకా  వెంటిలేటర్ మీద ఉంచుతారనీ అంతే తప్ప రికవర్ అయ్యే అవకాశం లేదనీ ' ఆ వార్త సారాంశం ! 
' ఈ బాబు ఆ కుటుంబానికి సంబంధించిన వాడు కాదు కదా ? ' అనుకున్నాడు సందేశ్ !
రెండురోజుల తర్వాత పేపర్ లో ఆ పాప తల్లి చనిపోయిందని చూసిన సందేశ్ తనను తానుకంట్రోల్ చేసుకోలేక ఒక తెల్లగులబీల గుచ్చాన్ని కొని బంధువుల దర్శనానికి ఆమె శరీరాన్ని ఉంచిన చోటికి వెళ్ళాడు ! అక్కడ ఆమె శరీరాన్ని ఒక గాజు బాక్స్ లో పెట్టి ఉంచారు ! ఆ బాక్స్ లో ఆమె గుండెల మీద కనిపించిన ఆ బుజ్జి బాబు నవ్వుతున్న ఫోటో,ఒక తెల్లగులాబీ, ఆ రోజు ఆ బాబు కొన్న బొమ్మ కనిపించి సందేశ్ కళ్ళను నీళ్ళతో నింపి వేసాయి ! తాను తెచ్చిన తెల్లగులాబీల గుచ్చాన్ని ఆమె శవ పేటిక   మీద వుంచి బయటికి నడిచిన సందేశ్ కి తన జీవితం మారిపోయినట్లు అనిపించింది ! 
ఆ తల్లి మీద, చెల్లి మీద ఆ బాబుకి ఉన్న ప్రేమను,  అనుబంధాన్ని ఒక్క క్షణం లో తుంచేసాడు  ఆ  తాగుబోతు ట్రక్ డ్రైవర్ !
అందుకే దయచేసి త్రాగిన మత్తులో వాహనాన్ని నడపకండి !

 
  

పోస్టల్ స్టాంప్ లతో చేసిన చిత్రాలు !

Tuesday 17 May 2011








 ఉత్తరాలు ఎలాగూ రాయట్లేదు కాబట్టి స్టాంపులు ఇలా చేసారంటారా ?
కాదండీ బాబూ కళా పోషణే !