నా మది నిన్ను పిలిచింది గానమై !

Monday 31 August 2009

మేమిచ్చే పూలూ పళ్ళూ ఎంతని ?

ఆ పూవు !

Friday 28 August 2009

ఆ పూవు !
రేకు రేకునా ఆశలు దాచి..
రంగుల లోకంలోకి ..
త్వరత్వరగా రావాలని..
తన శక్తినంతా ధార పోసి..
విచ్చుకొంది పసిపూవు !

కళ్ళముందు కనపడ్డ..
ప్రకృతిని చూసి నవ్వుకుంది హయిగా..
ఈ అందం రోజూ చూసే భాగ్యం నాదేనని !

తన దగ్గరకి వచ్చిన...
అందగత్తెను చూసి బెట్టు పోయింది..
లోకంలో అదృష్టం తనదేననే గర్వంతో !

గొంతు పిసికి తల పెరుకుతున్న..
పడతిని చూసి వణికిపోయింది..
ఇంత అందగత్తె మనసులో ఇంత కాటిన్యామా అని !

వనిత సౌందర్యాన్నయినా ..
ఇనుమడిస్తానని ఆమె కొప్పునెక్కిన పూవు..
నేల జారిపోయింది వడిలిపోయిన శరీరంతో !

ఆశలన్నీ ఉడిగిపోగా..
మూతపడుతున్న రెప్పల క్రిందినుంచి చూసింది..
తనలో కలిపేసుకుంటున్న ప్రక్రుతి వేపు ఆర్తితో ఆ పూవు !

ఆకలేస్తోందా పోనీ తినేసేయ్ లే !

కూటి కోసం కూలికోసం !

కోయ్ కోయ్ కోతలు కోయ్ !

ఇంటికి రావయ్యా చెప్తా నీ పని !

అమెరికా మాజీ పెద్దలు !

ఛా ! నిజమా ప్రణబ్ జీ ?

Wednesday 12 August 2009


నూట అరవై ఒక్క జిల్లాలలో కరువు పరిస్తితులు !
కంగారు పడకండి దేశ ప్రజలారా, సరిపడినన్ని ఆహార నిల్వలున్నాయి ! ధరలను నియంత్రణలోనే ఉంచుతాం !
ఆహా ! ఆర్ధిక మంత్రిగారు ఎంత గొప్ప మాట సెలవిచ్చారు?
అయ్యా ! మీ ప్రభుత్వ హయాంలోనే ఏవిధమయిన కరువు పరిస్థితులూ లేనప్పుడు ధరలు ఆకాశ మార్గాన పయనించి చుక్కలను దాటుతుంటే ఎందుకు నియంత్రించలేదో ? మరి ఈ కరవు పరిస్థితులలో వాటిని ఎలా నియంత్రిస్తారో? మీకు కొత్తగా ఏమైనా మంత్ర దండం దొరికిందా? లేకపోతె ఇన్నాళ్ళూ కావాలనే నియంత్రించలేదని ఒప్పేసుకుంటూ ఉన్నారా ఏమిటీ కొంపతీసి ?
ఇది మీ అండ దండలతో ధరలు పెంచేసిన వారికి, రాబోయే ' ఇంకా మంచికాలం ' గురించి ఇచ్చే హింటు కాదు కదా?
అదే అయితే ఇంక మేము బతికి బట్ట కట్టినట్టే !

స్వయిన్ ఫ్లూ భూతం ?


ఒక్క రోజులో దేశంలో 9 మరణాలు !
పారిపోతున్న జనం !
ఖాళీ అయిపోతున్న నగరాలు !
ఇదీ మన మీదియా సృష్టిస్తున్నభయ వాతావరణం !
ఒక టీవీ చానల్ ని మించి ఇంకో టీవీ చానల్ పోటీ పడి చేస్తున్న ప్రచారం !
కొన్ని రాజకీయ పక్షాలు తోడై ప్రజల మానసిక పరిస్థితులతో ఆడుతున్న ఆట !

అన్నీ ఇంతేనా అని రోత తెచ్చుకోకుండా కొన్ని చానళ్ళు అప్పుడప్పుడు స్వయిన్ ఫ్లూ పాజిటివ్ గా గుర్తించబడి కాపాదబడిన వారి సంఖ్యను సూచిస్తూ, స్వయిన్ ఫ్లూ బారినపడి బయటపడిన వారితో వారి అనుభవాలను చర్చిస్తూ ఊపిరి పీల్చుకోనిస్తున్నాయి ! స్వయిన్ ఫ్లూ ఇలాంటి పరిస్తితులున్నప్పుడే వస్తుంది, ఒక వేళ తప్పనిసరి పరిస్థితులలో మనం స్వయిన్ ఫ్లూ బాగా ప్రబలిన ప్రాంతాలకు వెళ్ళితే ఇలాంటి జాగ్రత్తలూ తీసుకోవాలి, స్వయిన్ ఫ్లూ వచ్చినప్పుడు ఇలా మనను మనం రక్షించుకోవాలి, అది ఇతరులకు పాకకుండా మనం ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా సజ్ఞాత్మకంగా వివరిస్తూ జనాన్ని జాగారూకం చేయాల్సిన ప్రసార మాధ్యమాలు ఈ విషయంలో చాలాభాగం విఫలమయ్యాయనే చెప్పవచ్చు ! మా మునిసిపల్ కార్పోరేషను ఇంకో అడుగు ముందేసి ఎస్సెమ్మెస్ పోల్ ద్వారా స్కూళ్ళు మూయాలో వద్దో చెప్పమని ప్రజలనే అడిగేసింది !

ఇది నాకు పద్నాలుగు / పదిహేనేళ్ళక్రితం మేము సూరత్ లో ఉన్నప్పుడు వచ్చిన ప్లేగు వ్యాదిని గుర్తు చేసింది !
అప్పుడు ఇన్ని చానళ్ళు లేకపోవడం చేత బ్రతికి పోయాం కానీ, అప్పుడూ అంతే గోరంతలు కొండంతలు చేయబడి, ప్రాణ భయంతో జనం సూరత్ నుంచి వివిధ ప్రాంతాలకు పారిపోయి ఆయా ప్రాంతాల ప్రజలకు కూడా భయాన్ని అంటిన్చేసారు(ప్లేగు అంటక పోయినా) ! ఆలశ్యంగా మేలుకున్న ప్రభుత్వం సూరత్ ను చక్రభందంలో ఉంచి జనం బయటికి పోకుండా చేసి ప్రభలకుండా చేసి భేష్ అనిపించుకుంది ! ఇక్కడ డీవీ రావుగారనే మహానుభావుడు(మునిసిపల్ కమీషనరు) సూరత్ ను చెత్త నగరం నుంచి చెత్తను జాగ్రత్తగా సేకరించే నగరంగా మార్చడంలో పోషించిన పాత్ర చిరస్మరణీయం !

అప్పటి ఆ అనుభవాన్ని చూసినాక కూడా ఇలాంటి మహామారి అంటువ్యాధులు వచ్చినప్పుడు ఏవిధంగా వాటిని ఎదుర్కోవాలో ఒక నిర్దుష్టమైన ప్రణాళిక తయారు చేయడానికి ప్రభుత్వాలకు అడ్డేమిటో తెలియదు !
ఆరోగ్యం కి ఇచ్చే బడ్జట్టు నంతా ఎలా ఖర్చు చేసారని ఎవరూ వైద్యశాఖామాత్యులను అడగకపోయినా ఇటువంటి వెనుకబాటు తనానికి మాత్రం నిలదీయాల్సిందే !

ఒక ప్రాంతంలో అంటువ్యాధులు బాగా వుంటే ఆ ప్రాంతాన్ని రక్షణ వృత్తం (క్వారంటైను) ఉంచి ఇతర ప్రాంతాలకు పాకకుండా చేయాలి ! అది తప్ప అన్నీ జరుగుతున్నాయి ! విదేశాలనుంచి కుప్పలు తెప్పలుగా స్వయిను ఫ్లూ లక్షణాలు ఉన్నవాళ్ళు వస్తుంటే మరి ఆదేశాల విమానాశ్రయాలలో తప్పనిసరిగా అందరి నమూనాలూ సేకరించేలా చేస్తూ, ఆ లక్షణాలు ఉన్నవాళ్ళను పంపనీయకుండా చేయాలని ఎందుకు అనిపించదు? దేశమంతా అభిమానించే మన మాజీ రాష్ట్రపతికి భద్రతపేరుతో అవమానించిన విదేశీ సంస్థలను చూసినా భుద్దిరాదా మన ప్రభుత్వాలకు ?
విదేశాలనుంచి వచ్చేవారికి భద్రతను, ఆరోగ్యాన్నీ పక్కనపెట్టి ఎర్ర తివాచీ పరచాల్సినంత దిక్కు మాలిన పరిస్థితులా మన దేశానికి ? గుడ్డిలో మెల్లలాగా కనీసం మన విమానాశ్రయాలలో నైనా ఈ లక్షణాలు కనిపిస్తున్నవారిని పరీక్షిస్తున్నారు !
మనం ఎందుకు మీమాంస పడుతున్నాం ? ఇటువంటప్పుడు ఇంతమంది అని ఒక సంఖ్య పెట్టుకొని అంతమంది చనిపోయినాక కానీ మనం సరయిన చర్యలు తీసుకోమా?

అందరూ లేవాలి తెల్లారింది !

Monday 10 August 2009

నీ స్నేహమే నేస్తం !

అమ్మో పడిపోతావ్ !

అంతా తింటే చస్తావ్ !

అమ్మాయి కళ్లు

మేమున్నాము కదా !


మిత్రులారా !

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిత్యం పరుగులు తీస్తూ, మూస జీవితచట్రాలలో ఇరుక్కొని, విసిగి వేసారిపోతున్న మన యువతరం, ఎన్నో మానసిక ఆందోళనలకు లోనవుతోంది. క్షణిక ఆవేశాలలో తీసుకొంటున్న ఆకస్మిక నిర్ణయాల వలన, ఎన్నో కుటుంబాలు విడి పోతున్నాయి, కలహాలతో కస్సుబుస్సులతో జీవితాలు భారమవుతున్నాయి. ఇంకొన్ని జీవితాలు అర్థాంతరంగా అంతమౌతున్నాయి. కొన్నిసార్లు వారి భాదను పంచుకొనే వారుంటే కొన్ని భార హృదయాలు తేలికవుతాయి, కొన్ని సలహాలను వినే స్థాయికి చేరి పరిష్కార మార్గానికి మళ్లుతాయి. అందుకోసమే ఈ ఆర్కుట్ కమ్యూనిటీ స్థాపించాము. మీకొసం మేమున్నామూ అని చెప్పడమే కాక తగిన సలహాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తాము ! ఈ కమ్యూనిటీలో ఎవరైనా తమ భాదలను, ఇబ్బందులను, తమ స్వంత పెర్లతోనైనా, ఇతర పెర్లతోనైనా, లేక పేరులేకుండానైనా పోస్ట్ చేసయొచ్చు, అలా వచ్చిన వాటికీ సభ్య కౌన్సిలర్లు కానీ, సంబందిత విషయాలలో అనుభవమున్న కౌన్సిలర్లు కానీ, సలహాలు ఇస్తారు, అవసరమైతే ఫోను ద్వారా మాట్లాడొచ్హు, వీలయితే ఈ విషయాలలో సహాయం చేసే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల లింకులు ఇచ్చి, వారి సాయం కొసం ప్రయత్నిస్తాం. మీ అందరి నుంచి ఆ కమ్యూనిటీపై సలహాలు కోరుతున్నాము !

ఇది కమ్యూనిటీ లింక్ : http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=92872790

చిరిగిన స్వాతంత్ర్యపు చీర !

Saturday 8 August 2009

1947 లో భరతమాతకు..
కట్టిన స్వాతంత్ర్యపు చీర,..
రంగు వెలిసి.. చిరుగుపట్టి..
వెలవెలా.. పోతోంది !

నిజమైన నాయకులు తటస్థులవగా..
నకిలీ నాయకుల దోపిడీకి..
పిగిలి.. చిరిగి పోయింది చీర !

నిస్వార్ధపరులు తప్పుకోగా..
స్వార్ధపరుల కబళింపుకు..
నలిగి.. చిరిగి పోయింది చీర !

చట్టం పట్టు విడవగా..
నేరస్తుల పాశవికానికి..
చివికి ... చిరిగి పోయింది చీర !

న్యాయం నిద్రపోగా...
అవినీతిపరుల దౌర్జన్యానికి..
వెలిసి.. చిరిగి పోయింది చీర !

నాయకులు వినాయకులు కాగా..
వ్యర్ధ ప్రజల రక్షణలో..
చిరిగి..చిరిగి పోయింది చీర !

1947 లో భరతమాతకు..
కట్టిన స్వాతంత్ర్యపు చీర,..
రంగు వెలిసి.. చిరుగుపట్టి..
వెలవెలా... పోతోంది !

రాఖీ శుభాకాంక్షలు !

Wednesday 5 August 2009


రాఖీ చేతికి కట్టినా కట్టకున్నా ఆ సోదరభావంతోనే మనం మెలగాలి ! ఆత్మీయతలే పంచాలి !
స్వార్ధానికీ, కర్కశత్వానికీ దూరమై చల్లగా లోకం వుండాలి ! ఎ చెల్లి కంట కన్నీరైనా ప్రతి అన్నను కరిగించాలి ! సోదరి రక్షకై సోదరుడు ఎప్పుడూ ముందడుగు వేస్తూ వుండాలి ! దారం కాదు కట్టేది అది ఒక బాస అని మరవకుండాలి! పరాయి స్త్రీలో సోదరినీ, పర పురుషునిలో సోదరుని కాన్చేలా యువతరం మారాలి !

మిత్రులందరికీ రక్షా బందన శుభాకాంక్షలు !

సమాజంలో స్వేచ్చగా బతకనీయండి !

Tuesday 4 August 2009

ఇది ఒక స్త్రీ హృదయం !
నేటి సమాజంలో ఆక్రోశిస్తూ ఆవిరవుతున్న ఎందఱో స్త్రీమూర్తుల ప్రతినిధిగా చెబుతోంది !
ఎవరైనా ఏదయినా బాగుచేయలేనప్పుడు పాడుచేసే హక్కు ఎలా వుంటుంది !
ప్రేమ అడిగితె ఇచ్చే బిక్షకాదు !
ప్రేమికులెప్పుడూ మేలుకోరాలి కానీ నరకడం చంపడం వంటి కిరాతకపు చర్యలకు పాల్పడకూడదు !
నిజంగా ప్రేమిస్తే ద్వేషించకూడదు కదా?
పరాయి స్త్రీలో సోదరిని చూడలేని దౌర్భాగ్య పరిస్తితిలోంచి యువత బయటకు రావాలి !
సమాజంలో సగభాగామైన వారి జీవిత నిర్ణయాలు వారినే తీసుకోనీయండి !
సోదర భావానికి అర్ధంలా నిలవండి !

ఊపిరున్నపుడే వచ్చెయ్ నేస్తం !

విప్లవాన్ని చేరుతోంది యువతరం !

Saturday 1 August 2009

యంత్రాల సందులో నలిగిపోయి..
తంత్రాల వలలో చిక్కిపోయి..
మంత్రాల వీధిలో సాగిపోయి,

చాకిరీ వెట్టిలో రగిలిపోయి..
పోకిరీ వారితో మెలిగిపోయి..
లాహిరీ వీధిలో సాగిపోయి,

పెత్తందార్ల భయపు చలికి వణికిపోయి..
అధికార్ల తాకిడి గాలికి కొట్టుకుపోయి..
దళారుల వీధిలో సాగిపోయి,

బ్రతుకు బాటలో అలిసిపోయి..
చితుకు బ్రతుకుల చచ్చిపోయి..
కరకు వీధిలో సాగిపోయి,

కష్టాల ఎండలో ఎండిపోయి,
నష్టాల వానలో మునిగిపోయి,
కాష్టాల వీధిలో సాగిపోయి,

విప్లవాన్ని చేరుతోంది యువతరం !