మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !
Wednesday, 31 August 2011
Posted by ప్రభు at 8/31/2011 04:35:00 pmమచ్చలేని వ్యక్తి సాధించిన మహోన్నత విజయం !
Saturday, 27 August 2011
Posted by ప్రభు at 8/27/2011 03:13:00 pmపార్లమెంటులో కాంగ్రెస్ ను ప్రతిపక్షంతో చేతులు కలిపి తాను కోరుకున్న జన లోక్ పాల్ బిల్లు మీద చర్చించి ఒక్క మాటమీద సరే అనిపించిన అన్నాకు ధన్యవాదాలు ! ఇది ఒక మహోత్తరమైన ముందడుగు ! లంచగొండి తనాన్ని రూపు మాపడానికి చట్టం కన్నా లంచం ఇవ్వకూడదనే మన నిర్ణయమే ఎక్కువగా సహాయపడుతుంది ! సిటిజన్ చార్టర్ ద్వారా కొంత వరకూ ఇది కూడా నిర్మూలం అవుతుంది ! ఇకనుంచి మనం చెయ్యవలిసింది అన్యాయాన్ని మౌనంగా భరించడం కాదు ! మొండిగా బట్టబయలు చెయ్యడం ! ఇంక మనం మన జన సామాన్యం లో ఉన్న ఇతర అక్రమాలను రూపు మాపడానికి నడుం కట్టుకోవాలి ! అప్పుడే మన భావి యువతరం స్వర్ణ భారతం లోకి అడుగు పెడుతుంది ! జై భారత్ !
ఈ సాయంత్రం దీక్ష విరమిస్తున్న అన్నా ప్రతిసారీ రావాలని ఎదురు చూడకూడదు !
మనం కూడా నడుంకట్టి నడవాలి !
మన్మోహన్ సింగ్ గారికి కు జన్ లోక్ పాల్ బిల్ అంటే ఎందుకు భయమో తెలుసా ?
Wednesday, 24 August 2011
Posted by ప్రభు at 8/24/2011 05:13:00 pmమన భారతీయుల జీవితాలలో మళ్ళీ ఊపిరులు ఊదిన అన్నా!
Thursday, 18 August 2011
Posted by ప్రభు at 8/18/2011 10:18:00 am నిజమే మరి మనం చాన్నాళ్ళుగా ' ఇలాంటిఅవినీతి కలుషిత భారతం లోనా మనం పుట్టింది ? ' అని సిగ్గుతో తలలు వంచి జీవచ్చావాలలా బ్రతుకుతున్నాం ! అంటే అన్నాకు ముందు ఎవరూ అవినీతి మీద విరోధం ప్రకటించలేదని కాదు ! ప్రయత్నించిన వారిని పదవీచ్యుతులను చేయడం ద్వారానో, బదలీలు చేయడం ద్వారానో , వారిని నానావిధాలుగా కష్టనష్టాల పాలుచెయ్యడం ద్వారానో, వారినే అవినీతిపరులుగా చిత్రీకరించడం ద్వారానో, వీటివల్ల ప్రయోజనం లేకపోతే ఆవ్యక్తినే గాయపరచడం ద్వారానో , హతమార్చడం ద్వారానో వారందరినీ నిర్వీర్యులను చేసింది ఈ అవినీతి బూతం !
కానీ అన్నాహజారే వ్యక్తిత్వం, వయసు, నిస్వార్ధపరత్వం ముందు ఈ బూతం పప్పులు ఉడకలేదు ! అవినీతి ఊడలద్వారా మన భారతావని సిరులు పీల్చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం, ఆ రాందేవ్ బాబాలానే ఈ అన్నాను కూడా పక్కకు ఈడ్చేస్తే భయంతో వణికిపోయి నోరుమూసుకుని పడిఉంటారు అనుకుంది ! అయితే అన్నా పట్టువదలని దీక్షకు దిగిరాక తప్పలేదు !
ఇదేమీ అంతిమ విజయం కాదు ! ఏదో విధంగా జనం దృష్టి మరల్చి ఈ కృత నిశ్చయాన్ని బలహీన పరచడానికి ప్రయత్నం జరుగుతుంది ! పెద్దవయసు అన్నాకు నిరవధికంగా దీక్ష చెయ్యగలిగే అవకాశం తక్కువ ! ఆయన ఆరోగ్యం క్షీణించి పోకుండా చూడాల్సిన భాద్యత కూడా ఆయన అనుచరులమీద ఉంది ! యూపీఏ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి జన లోక్ పాల్ బిల్లుకు త్వరగా పచ్చజెండా ఊపుతుందని ఆశించడం కొద్దిగా కష్టమే !
సమీప భవిష్యత్తులోనే అవినీతిరహిత భారతావనిని చూడగలం అని ఆశిద్దాం !
జై భారత్ !
స్వాతంత్రమనే వజ్రపు వన్నెతగ్గనీయవద్దు !
Monday, 15 August 2011
Posted by ప్రభు at 8/15/2011 12:18:00 pm మనకు వచ్చిన ఈ స్వాతంత్రానికి మన దేశపు అన్ని ప్రాంతాలకూ చెందిన వివిధ భాషల, భిన్న జాతుల ప్రజల ఐకమత్య పోరాటమే మూల కారణం ! భిన్ననాగరికతల సమ్మేళనమే మన దేశ గౌరవం అని గొప్పగా భావించే వాళ్ళం మనం ! ప్రస్తుత కాలం లో అవినీతి కారణంగా పెరిగిన అధిక ధరలు , ద్రవ్యోల్బణం, నెమ్మది నెమ్మదిగా మనందరినీ మానవత్వపు విలువలు మరిచి స్వార్ధపరత్వం వేపు అడుగులు వేయిస్తున్నాయి ! మనం విద్యతో వికసించాల్సిన బుద్ధిని సంకుచింప చేస్తూ ఇలాగే వెళ్తుంటే రష్యాలానే మనలో మనం కుమ్ములాడుకుని విచ్చిన్నమై పోవడానికి మనకు ఎంతో కాలం పట్టదు ! అప్పుడు సింహం నాలుగు ఎద్దుల కథలో లాగా మనం బలహీన పడటం ఖాయం ! అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పొరుగు దేశాలకు అప్పుడు మనను ఆక్రమించుకుని మనపై మళ్ళీ బానిసత్వాన్ని రుద్దడం చాలా సులువవుతుంది !
అదే జరగాలనుకుంటే మనం ఇలాగే ఉందాం !
కాదనుకుంటే మనకు దొరికిన ఈ స్వాతంత్రమనే వజ్రాన్ని మెరుగు పెడుతూ, దాని వెలుగులు కుల, మత, బాష, జాతి, లింగ, ప్రాంత భేదాలను పక్కనపెట్టి అందరితో సమైఖ్యంగా పంచుకుంటూ మన దేశ ప్రగతికి పాటుపడదాం !
భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !
జై భారత్ !
ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే వాళ్ళు ఎక్కడైనా ఉంటూ ఉంటారేమో ?
Monday, 8 August 2011
Posted by ప్రభు at 8/08/2011 07:12:00 pm
Subscribe to:
Posts (Atom)