పేదరికం అంటే డబ్బులెక్కువగా లేకపోవడమేనా ?

Monday 31 January 2011

 అంబానీల లాంటి ఒక ధనవంతుడు తమ కన్నా ప్రపంచంలో బ్రతుకుతున్న ఇతరులు ఎంత పెదవారో తన కొడుకు కు తెలియ చెప్పాలని అనుకున్నాడు ! ఒక కుగ్రామానికి వెళ్లి అక్కడున్న అతి బీదవాళ్ళ  ఫాంహౌస్ లో రెండు రోజులు  తన కొడుకుతో పాటు ఉన్నాడు ! తిరిగి రాజభవనం లాంటి తమ ఇంటికి వెళ్ళినాక తన కొడుకును దగ్గరకు పిలిచాడు !
 " ఎలా ఉంది మన ట్రిప్ ? "  అడిగాడు ధనికుడు !
 " చాలా గొప్పగా వుంది డాడీ "
"  ఈ ప్రపంచంలో పేదవాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో తెలిసిందా ?" అడిగాడు గర్వంగా ధనికుడు !
 " తెలిసింది డాడీ "
" ఏం తెలుసుకున్నావో చెప్పు " ముసి ముసిగా నవ్వుతూ అడిగాడు ధనికుడు!  
 " నేను గమనించిందేమిటంటే మనకు ఒక కుక్కే ఉంది కానీ వాళ్లకు నాలుగేసి కుక్కలు ఉన్నాయి !  
 మనకు ఓ గార్డెన్ లో మధ్యన ఓ మోస్తరు స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ వాళ్లకు అంతం లేని పెద్ద వాగు ఉంది !
 మన గార్డెన్ లో ఇంపోర్టెడ్ లైట్లు వెలుగులు చిమ్ముతుంటాయి  కానీ వాళ్లకు  చంద్రుడూ మిల మిల మెరిసే చుక్కలూ వెలుగులు  ఇస్తున్నాయి !
 మన వరండా గేట్ దాకా ఉంది  కానీ వాళ్లకు ఆకాశమే వరండా లా ఉంది !
 మన ఇంటి చుట్టూ ఉన్నస్థలం  చాలా చిన్నది కానీ వాళ్ళ ఇంటి చుట్టూ  ఉన్న స్థలం ఆకాశం భూమీ కలిసేంత దాకా ఉంది !
 మనకు చాలామంది సేవకులు ఉన్నారు కానీ వాళ్ళు ఇతరులకు సేవ చేస్తున్నారు !
 మనం మన తిండి కొనుక్కుంటాము  కానీ వాళ్ళు వాళ్ళ తిండి పండిస్తున్నారు !
మనని రక్షించడానికి మన ప్రాపర్టీ  చుట్టూ పెద్ద పెద్ద గోడలున్నాయి కానీ వాళ్ళను రక్షించడానికి చుట్టూ వాళ్ళ స్నేహితులున్నారు ! " చెప్పాడు ఆ ధనికుడి కొడుకు !
వింటూన్న ధనికుని మొహం లో నవ్వు మాయమై మరో బుద్ధుడిని చూసినంత ఆశ్చర్యం తో నోట మాట రాకుండా ఉంది !
" థాంక్స్ డాడీ మనం ఎంత పేదవాళ్ళమో  నాకు తెలియ చెప్పినందుకు ! " అని ముగించాడు ఆ ధనికుడి కొడుకు ! 


3 comments:

Ennela said...

chaalaa manchi post...idivaraku chadivaanu kaanee mallee kotthagaa undi..nice..

Bheemrao thodasam said...

ఆధ్యాత్మిక దృష్టిలో మీరు చెప్పింది నిజమే కావచ్చు. కాని, నిజ జీవితంలో సుఖమయ జీవనానికి కావలసిన వస్తు, సేవలు అందుబాటులో లేకపోవడమే కదా పేదరికం అంటే. అందుకే వాటిని సమకూర్చే శక్తి గల డబ్బు ముఖ్యమే అంటాను నేను.

ప్రభు said...

ఆధ్యాత్మికం కన్నా మానసిక బీదరికం మనిషిని ఇబ్బంది పెట్టి జీవితాన్ని నరకం చేస్తుంది భీమ్ రావు గారూ ! డబ్బు అవసరమే, కానీ డబ్బే సర్వస్వం కాదని ఈ పోస్ట్ ఉద్దేశ్యం ! మీ స్పందనకు ధన్యవాదాలు !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )