ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ?
Friday, 9 September 2011
Posted by ప్రభు at 9/09/2011 10:52:00 amచాలా సింపుల్ !
నంబర్లను వదిలేయండి - ముఖ్యంగా ఎత్తు, బరువు, వయసు అలాంటివి మనకెందుకు చెప్పండి ?
డాక్టర్లు చూసుకునే వివరాలు అవి !
మీ మిత్రులుగా ఎప్పుడూ ఆహ్లాదంగా కనిపించే వాళ్ళనే ఉంచుకోండి - ఏడుపుగొట్టు మొహం గాళ్ళను వదిలేయండి (మీది ఏడుపుగొట్టు మొహం కాకుండా చూసుకోండి లేకపోతె మిమ్మల్నీ ఎవరూ మిత్రులుగా ఉంచుకోరు ) !
ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి ! పనిలేని బుర్ర ఖాళీ అవుతుందని మరవకండి ! అలా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా కొత్త విషయాల గురించి అలోచించి మతిమరుపును మర్చిపోండి !
చిన్న చిన్నవి అయినా కొన్నిస్మృతులు ఎన్నో ఆనందకరమైన క్షణాలను మనసుకు అందించగలవని గుర్తించండి ! నవ్వడానికి ప్రయత్నించండి - ఎవరైనా నేస్తం మిమ్మల్ని నవ్వించ గలిగే వారుంటే వారి సాంగత్యంలో క్షణాలు గడపండి లేదా కుటుంబంతో, మిత్రులతో కలిసి హాస్య చిత్రాలు చూడండి ! కడుపు చెక్కలు అయ్యేలా నవ్వండి !
కన్నీరు కార్చండి తప్పులేదు ! బాధ ఏడిస్తే తగ్గుతుంది - కానీ ఎవరూ , ఏ క్షణమూ శాస్వతం కాదని మరవకండి ! మనకు మనమే తోడని తెలిసి - కళ్ళు తుడుచుకుని, గుండె గట్టిపరుచుకుని, నవ్వుతూ ముందుకు సాగండి !
మీకిష్టమైన వాటితో మీ సమయాన్ని నింపండి ! మీ స్నేహితులో, మీ కుటుంబమో, మీ వ్యాపకమో - ఇలా వీటి మధ్య ఉంటే మీకు బాధ దగ్గరకే రాదనీ మరవకండి !
మీ ఆరోగ్యమే మీ బలం అని తెలుసుకోండి - అది బాగుంటే దాన్ని కాపాడుకోండి, బాగోపోతే బాగుచేసుకోండి ! మీకు కుదరకపోతే తెలిసిన నిపుణుల సాయం తీసుకోండి !
ఏ ఊరైనా వెళ్ళండి కానీ అపరాధభావ నగరం మటుకూ వెళ్ళకండి ! తప్పుచేసాం అని నమ్మితే వెంటనే సారీ చెప్పి తప్పు దిద్దుకోవడానికి ప్రయత్నించండి ! అంతే కానీ తప్పించుకుని తిరుగుతూ, గిల్టీ ఫీలవుతూ బుర్ర పాడు చేసుకోకండి !
మీకెవరి మీదైనా ఇష్టం కానీ, ప్రేమ కానీ ఉంటే సందర్భం వచ్చినప్పుడల్లా అది ప్రకటించండి ! అంటే దండోరా వెయ్యమని కాదు - వారికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం ద్వారా, ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా కూడా వారికి సంతోషాన్ని ఇచ్చివారి సంతోషంలో మన సంతోషం వెతుక్కోవచ్చు !
ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదు !
నన్ను హాయిగా పడుకోనిస్తే ఈ క్రిస్మస్ కు మీకు మంచి బహుమతి ఇస్తా !
Thursday, 8 September 2011
Posted by ప్రభు at 9/08/2011 10:08:00 amనాతో చేతి కుస్తీకి ఎవరైనా వస్తారా ?
Friday, 2 September 2011
Posted by ప్రభు at 9/02/2011 10:33:00 am
Subscribe to:
Posts (Atom)