ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ?

Friday 9 September 2011

చాలా సింపుల్ !
నంబర్లను వదిలేయండి - ముఖ్యంగా ఎత్తు, బరువు, వయసు అలాంటివి మనకెందుకు చెప్పండి ?
 డాక్టర్లు చూసుకునే వివరాలు అవి !

 మీ మిత్రులుగా ఎప్పుడూ ఆహ్లాదంగా కనిపించే వాళ్ళనే ఉంచుకోండి - ఏడుపుగొట్టు మొహం గాళ్ళను వదిలేయండి (మీది ఏడుపుగొట్టు మొహం కాకుండా చూసుకోండి లేకపోతె మిమ్మల్నీ ఎవరూ మిత్రులుగా ఉంచుకోరు ) !

ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి ! పనిలేని బుర్ర ఖాళీ అవుతుందని మరవకండి ! అలా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా కొత్త  విషయాల గురించి అలోచించి మతిమరుపును మర్చిపోండి !

 చిన్న చిన్నవి అయినా కొన్నిస్మృతులు  ఎన్నో ఆనందకరమైన క్షణాలను మనసుకు అందించగలవని గుర్తించండి !   నవ్వడానికి ప్రయత్నించండి - ఎవరైనా నేస్తం  మిమ్మల్ని నవ్వించ గలిగే వారుంటే వారి సాంగత్యంలో క్షణాలు గడపండి లేదా కుటుంబంతో, మిత్రులతో కలిసి  హాస్య చిత్రాలు చూడండి ! కడుపు చెక్కలు అయ్యేలా నవ్వండి !

 కన్నీరు కార్చండి తప్పులేదు ! బాధ ఏడిస్తే తగ్గుతుంది - కానీ ఎవరూ , ఏ క్షణమూ శాస్వతం కాదని మరవకండి ! మనకు మనమే తోడని తెలిసి  - కళ్ళు తుడుచుకుని, గుండె గట్టిపరుచుకుని, నవ్వుతూ ముందుకు సాగండి ! 

 మీకిష్టమైన వాటితో మీ సమయాన్ని నింపండి !  మీ స్నేహితులో, మీ కుటుంబమో, మీ వ్యాపకమో - ఇలా వీటి మధ్య ఉంటే మీకు బాధ దగ్గరకే రాదనీ మరవకండి !
 మీ ఆరోగ్యమే  మీ బలం అని తెలుసుకోండి - అది బాగుంటే దాన్ని కాపాడుకోండి, బాగోపోతే బాగుచేసుకోండి ! మీకు కుదరకపోతే తెలిసిన నిపుణుల సాయం తీసుకోండి !

 ఏ ఊరైనా వెళ్ళండి కానీ అపరాధభావ నగరం మటుకూ వెళ్ళకండి ! తప్పుచేసాం అని నమ్మితే వెంటనే సారీ చెప్పి తప్పు దిద్దుకోవడానికి ప్రయత్నించండి ! అంతే కానీ తప్పించుకుని తిరుగుతూ, గిల్టీ ఫీలవుతూ బుర్ర పాడు చేసుకోకండి ! 

 మీకెవరి మీదైనా ఇష్టం కానీ, ప్రేమ కానీ ఉంటే  సందర్భం వచ్చినప్పుడల్లా అది ప్రకటించండి ! అంటే దండోరా వెయ్యమని కాదు - వారికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం ద్వారా, ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా కూడా వారికి సంతోషాన్ని ఇచ్చివారి సంతోషంలో మన సంతోషం వెతుక్కోవచ్చు !

ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదు !


2 comments:

రాజేష్ మారం... said...

ఒక సందేహం.. ఆ బొమ్మలు మీరే డ్రా చేసారా?

ప్రభు said...

అమ్మబాబోయ్ నేనే ?
కాదండీ ఎవరో మిత్రులు పంపినవి వాడుకున్నాను !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )