జీవన సత్యం !

Saturday, 20 November 2010

ఇది నిజమేనా ?
నేనిలాగే ఉంటానా ?
నేనూహించుకున్నది అంతా భ్రాంతేనా ?
ఇటువంటి శరీరానికేనా ఈ తాపత్రయాలు అన్నీ ?

కిస్సా కుర్సీ కా !

అతి కాకపోతే ఏమిటీ ?
ఈ కుర్చీలో ఎవరు కూర్చోవాలని చేసారో ?
అసలే చెట్లు తగ్గిపోతున్నాయని అంతా అంటుంటే ఇలా కూడా కలప వృధా చేస్తే ఎలా ?

చేతులు ఎత్తేఉంచా !

అమ్మతోడు !
మీ పాలూ, పెరుగూ నేను తాగలేదు !
అయినా ప్రతిదానికీ హేండ్స్ అప్ అంటారేమిటీ ?

కిస్ పవర్ !

నీ ముద్దులో తీపే కాదు కరంటూ ఉంది బావా !
కళ్ళు మూసుకున్నా చూడు ఎంత వెలుగోచ్చేసిందో !
మన్ని చూసి అది చూడు ఎంత కుళ్ళు కుంటుందో !

మొగెంబో కుష్ హువా !

నీ  కాల్మొక్తా !
నన్నొదిలెయ్ !
మా ఆయన చూస్తే నాకు విడాకులిచ్చేస్తాడు !

కష్టపడ్డావు కానీ... లే !

ఆ రోజులు పొయ్యాయి నాయనా !
దూరంగా నుంచో పెట్టేస్తే ఎత్తావని అనుకుంటారని అనుకుంటున్నావు !
కొద్దిగా ఫోటో షాప్ వాడితే ఇంకా బాగా వస్తుంది !
జనం తెలివి మీరిపోయారు !
ఎవడ్రా ఆ కెమెరా మాన్ అని నన్నే తిడతారు !

ఎవరెక్కువ తింటే వారే రాణి !

Friday, 19 November 2010

ఆ  అందాల  పోటీలో కడుపు మాడిపోయింది !
ఈ పోటీ బావుంది ఆకలంతా తీర్చేసుకోవాలి !

చిక్కేదాకా అక్కడే ఉండు మరి !

నీకు  ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదా ?
ఆ తిండేదో మనింటికి తెచ్చుకొని తినొచ్చుగా ?
ఇంట్లోనేమో డైటింగ్ అంటూ నాటకాలు !
ఇక్కడేమో ద్వారం పట్టనట్లు తినేయడం !

నేను మటుకూ భూమ్మీదే ఉంటా !

ఈ  భూగ్రహంలో  బజార్లు / మాల్ లు భలే ఉన్నాయ్ !
నేనెవరికీ కనపడట్లేదు కాబట్టి ఈ ఫుడ్ అంతా నోక్కేయ్యోచ్చు !

జీవన పోరాటం !

హమ్మయ్య ఇంకొద్దిగా పైకెక్కేస్తే తాగినన్ని నీళ్ళు !
( మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక డజను కన్నా ఎక్కువ జీవులు గోడ దాటడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తాయి ! అవసరం ధైర్యాన్ని ఇస్తుంది కదూ ! )