నేనైన నీవు

Friday, 9 April 2010


నా కష్టాలను నీవే అనుకున్నావు..
నా కన్నీళ్లను నీ కళ్ళలో కార్చావు..
నేనివ్వలేనని నీ కోర్కెలను చంపావు..
నీ వారిని వీడి నాస్వంతమయ్యావు..
నా గమ్యాన్ని నాతోటే చేరావు..
నా విజయానికి గర్విస్తూ నీ వైపు చూస్తే..
నన్ను గుండెలో నింపిన నువ్వు నాలానే ఉన్నావు..
నేనే నీవైన నీకు నేనేమివ్వగలను ప్రియా ?

1 comments:

ప్రభు said...

సతీష్ స్పూర్తి తో అదే చిత్రానికి ఇంకో పిచ్చి పలుకు :
మురిపించి, తన మరులలో మైమరపించిన నా చెలి ఏదీ ?
కనిపించలేదు, పలకరించలేదు కానీ..
నాప్రక్కనే ఉన్న అనుభూతి నన్ను పిచ్చివాణ్ణి చేసింది !
అనిపించే చెలి కనిపించదేమని ఎలుగెత్తి ఏడ్చాను !
తనతో తిరిగిన అన్ని ప్రదేశాలలో వెతికాను !
ఊళ్లు వెతికాను, బీళ్ళు వెతికాను !
నా చెలి ఎక్కడుందో ఎవరైనా చెప్పరూ అని అందరినీ అడిగాను !
చెట్టునడిగాను, చేమనడిగాను !
పువ్వునడిగాను, గువ్వనడిగాను !
నా గుండెలో పొంగిన దుహ్ఖంలా కురిసిన వానలో తడిచాను !
భువిని జారిన నీటిలో నా నీడ చూసి నమ్మలేకపోయాను !
నా చెలి ఎక్కడికీ పోలేదు నాతోనే ఉంది.. నాలోనే ఉంది..
నా లానే ఉంది...

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )