అనుకున్నట్లు గానే మద్దెలచెరువు సూరి అంతం కూడా రక్తసిక్తంగానే జరిగింది ! హింస అనే నాగుపాముకు పాలు పోసి పెంచిన వాళ్ళను ఆ పాము కాటు వేయడం కొద్దిగా వెనకా ముందూ అంతే ! స్వార్ధం కోసం, పలుకుబడి ఉందనీ, ధన మదంతో, బల గర్వంతో, రాజకీయ నాయకుల అండదండలతో హింసా విష వలయం లో దూకే వాళ్లకు దాని ప్రభావంలోనే అంతమవ్వాల్సిన పరిస్థితి వస్తుందనే ముందు చూపు ఉండదు ! ఉద్యమాల ముసుగులో పిల్లలను హింసకు పెరేపించే వాళ్ళు కూడా ఈ జ్వాలకు ఆజ్యం పోసేవాళ్ళే ! శాంతి యుతంగా పోరాటాలను సాగించాలనీ, సమస్యలను పరిష్కరించుకోవాలనీ చెప్పిన పెద్దల మాటలను పెడ చెవిన పెట్టి హింసతో తమ మిధ్యారాజ్య పరిధిని పెంచుకునే వారు సహజంగానే వార్ధక్యాన్ని చూడరు !
ఇంతకు ముందు రాంగోపాల్ వర్మ తాను తీయబోయే సినిమాకు రవి-సూరి ల కథను స్పూర్తిగా ఎందుకు తీసుకున్నాడా అని కొంత మందికి ఉన్న అనుమానం ఇప్పుడు తీరిపోయి ఉంటుంది ! ఎందుకంటే ఫాక్షనిజం అనే రావణాకాష్టం ఎప్పుడూ కాలుతూనే ఉంటుంది ! చరిత్ర ముసుగులో ఇంకొన్ని సినిమాలు తీసేయొచ్చు ! త్వరలో రక్త చరిత్ర పార్ట్ - 3 , తరువాత 4, 5, ... అలా అలా..

సూరి మరణం తో రక్తచరిత్ర - 3 కి స్క్రిప్ట్ తయారు చేసుకునే టైం వచ్చేసింది !
Tuesday, 4 January 2011
Posted by ప్రభు at 1/04/2011 12:35:00 pm
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
అవును, అవి అంతులేని కథలు
telugu lo ela post cheyali?
@ssreddy555 లేఖిని లో కానీ, జిమెయిల్ లో కానీ బ్లాగ్ పోస్టులలో కానీ మాటలను ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో టైపు చేస్తే మనం కోరుకున్న బాషలోకి వచ్చేలాగా transliteration టూల్స్ ఉంటాయి !
అవి వాడి కాపీ పేస్ట్ చేసి తెలుగులో పోస్ట్ చెయ్యొచ్చు !
బ్లాగ్ లో అయితే డైరెక్ట్ గా పబ్లిష్ చెయ్యొచ్చు !
కామెంట్ పోస్ట్ చెయ్యాలంటే మటుకూ కాపీ పేస్టే !
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )