ఎత్తైన పలకరింపు !

Thursday, 16 December 2010

అదేంటీ ? నేను గుడ్ మార్నింగ్ చెబుదాం అని వస్తే పారిపోతారే ?

ఎంత కమ్మగా ఉందో !

నాకు చాక్లెట్ చూస్తే నా మీద నాకే  కంట్రోల్ తప్పి పోతుంది !

ఎంతైనా బాసు, బాసే !

నాతో వస్తావా ?

అరె ఇది బొమ్మా ? నేనింకా నిజమైన అమ్మాయి పిలుస్తోందని వచ్చా !

వర్ధిల్లుతోంది ప్రజాస్వామ్యం !

Wednesday, 15 December 2010

" ఏమో అనుకున్నాను కానీ నువ్వు గట్టి పిండానివేనోయ్ ప్రతి పక్ష నాయకుడి బీ పీ పెంచేసి జుట్టు పీక్కునేలా చేసావు " అధికార పార్టీ సీనియర్ నేత !
" నాదేముంది సార్ అంతా మీ బోటి పెద్దల ట్రయినింగే   కదా ? "  వినయంగా అన్నాడు బుల్లి నేత లోలోపల సంబర పడిపోతూ !
" లేకపోతే, అవినీతనీ, ప్రజల సమస్యలనీ పెద్ద ఫోజులు పెట్టేస్తున్నాడు ఆ అప్పోజిషన్ లీడరు "
" మీరలా మా వెన్ను తడుతున్నంత కాలం మీ శిష్యులం మేమంతా కలిసి సభలో మన లొసుగులు బయట పడనీయకుండా, అసలు ఏ విషయం మీద కూడా చర్చ జరగనీయకుండా అల్లరి చేసేసి, అవసరమైతే అప్పోజిషన్ వాళ్ళూ వాకవుట్ చేసినాక పై పై చర్చలు జరిపించేసి మనం పెట్టిన బిల్లులన్నీ పాస్ చేసేయిస్తాం సార్ "  రెచ్చిపోయాడు బుల్లి నేత !
" ప్రతి సారీ ఇలా ఎలా మేనేజ్ చేస్తారయ్యా ? " పెద్ద నేతకి అనుమానం వచ్చింది !
" ఏముంది సారూ. స్పీకరు మనోడేగా ? అసలు వాళ్ళు నోటీసిచ్చిన పాయింట్లను చర్చకే అనుమతించడు. పొరబాటున అనుమతించినా నాలుగు మాటలు మాట్లాడగానే మేమంతా అల్లరి చేసి, అప్పోజిషన్ లో బీ పీ ఎక్కువున్న వాళ్ళను నానా మాటలూ అనేస్తాం. మీ పరిపాలనలో అట్లా జరిగిందనీ, అసలు అన్నిటికీ మీరు మీ ప్రభుత్వంలో చేసిన తప్పులే కారణాలనీ, మీరు దద్దమ్మలనీ, ప్రజలు మిమ్మల్ని చీకొట్టారనీ, అసలు మాట్లాడే అర్హతే లేదనీ, మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనీ అంటాం, ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా ఎత్తి దెప్పి పోడుస్తాం. వాటికి ఎదురు చెప్పీ, మనల్ని తిప్పి తిట్టీ  వాళ్ళు అలిసి పోయి వాకవుట్  చేసేస్తారు, లేకపోతే సభకు అడ్డుతగుల్తున్నారని చెప్పి మార్షల్స్ తో బయటికి లాగేయిస్తాం, సందు చూసుకొని మనం పెట్టిన బిల్లులు పాస్ చేసేద్దాం.  తరువాత మనవాళ్ళందరూ పేపర్ల వాళ్ళకూ, టీవీ ల వాళ్ళకూ ఇంటర్వ్యూలు ఎడాపెడా ఇచ్చేసి   ప్రజాస్వామ్యాన్ని అప్పోజిషనోళ్ళు  అపహాస్యం చ్సేస్తున్నారానీ, ప్రజల సమస్యలు చర్చించడానికి వాళ్లకు చిత్తశుద్ధి లేదనీ ఎదురు దాడి చేసేద్దాం " వివరించాడు బుల్లినేత సంబరంగా !
" మరి అప్పోజిషనోళ్ళు ఊరుకుంటారంటావా ? మనవాళ్ళ మీద కేసులు పెడితే ? "   ఎంతయినా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఇంకా పూర్తిగా చావని పెద్ద నేత అడిగాడు !
పడీ పడీ నవ్వాడు బుల్లి నేత !  " ఊరుకోండి సార్ భలే జోకులేస్తారు మీరు. మన సభలలో జరిగే విషయాలను స్పీకరు అనుమతిలేకుండా కోర్టులు ఎలా వాదిస్తాయి సార్ ? పొరబాటున ఏదైనా న్యాయమూర్తి సమన్లు ఇచ్చినా, మన స్పీకరు వాళ్లకు తనను పిలిచే హక్కు రాజ్యాంగం ప్రకారం లేదని చెబుతాడు. మన నేతలను ప్రశ్నించ గలిగే జాయింట్ కమిటీలు వెయ్యడానికి మనం  ఎలాగూ ఒప్పుకోం కాబట్టి మనకు తిరుగు లేదు.ఇదే పద్దతి మనం కేంద్రం లోనూ పాటిస్తున్నాం సార్.  " వివరించి చెప్పాడు బుల్లి నేత. 
" సరేనోయ్ అలాగే కానీయండి. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి ! "  అంటూ గ్లాసెత్తి చీర్స్ కొట్టాడు పెద్ద నేత !

వీణ్ణి నీళ్ళలోకి తోస్తే ?

ఈ మనుషులు చాలా తెలివైన వాళ్ళు లా ఉన్నారే ?
ఇంత గొప్పవాణ్ణి నన్ను పట్టించుకోకుండా ఇలా కట్టిపడేశారు !

సైకిల్ ఎక్కడం రాదు దానికి !

నేనెలాగూ తోక్కుతున్నాగా మళ్ళీ తనెందుకు పరిగెట్టడం ?

తిన్నగా నడవాలి !

అంతే అన్నా ! అలాగే తిన్నగా ఇంకో పదడుగులు వేసావంటే అందరూ చప్పట్లు కొట్టేస్తారు !

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు !


డేంజర్ !  ఇక్కడంతా పోయినోళ్ళే ఉన్నారు జాగ్రత్త !




ఈయనను కత్తితో పొడిచి లేపేశారు !

ఈయనను నడిరోడ్డు మీద కాల్చేశారు !

ఈయన ఎన్కౌంటర్  చేస్తూ వెళ్ళిపోయాడు !

ఈయన దేశ సరిహద్దు కాపాడుతూప్రాణాలు అర్పించాడు !

ఈయన బాంబు దాడిలో ముక్కలయ్యాడు !
ఈయన మిస్సైల్ తో తునకలయాడు !
ఈయన విప్లవ మార్గంలో పో.. యాడు !

ఇవి మనుషుల ఎముకలతో చేసిన కళాఖండాలు ! సరదాగా ఇలా పోయారని చెప్పాను కానీ వాళ్ళెలా మరణించారో నాకు తెలియదు ! ఏదేమైనా పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు !

వానొస్తే ఇంక రైన్ డాన్సే !

నన్ను బ్రహ్మ జెముడు అంటారు గురువుగారూ !
నేను డాన్స్ చేస్తున్నాను అనుకుంటున్నారా ?
లేదండీ నేను నిలవ చేసుకున్న నీళ్ళు అయిపోతే వానల కోసం ఒంటికాలిమీద తపస్సు చేస్తున్నా !
మబ్బులు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి వాన గేరంటీ !