వీళ్ళనేనా మనం ఎన్నుకుంది ?

Tuesday 22 September 2009

మనం ప్రేమతో గెలిపించుకుని MLA లు గా మంత్రులుగా నిలబెట్టిన ప్రజాప్రతినిధులు జగన్ సేన భయంతోనో, లేకపోతే ఇష్టంతోనైనా తమ తమ విధులను నిర్వర్తించకుండా, అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్థంబింపజేస్తుంటే, ప్రబలుతున్న స్వయిన్ ఫ్లూ, పెరుగుతున్న ధరలు, విజ్రుమ్భిస్తున్న నేర ప్రపంచం లోనికి మన రాష్ట్రాన్ని తోసేస్తుంటే, నాకనిపిస్తుంది వీళ్ళసలు మనుషులేనా అని ! వారి స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడనికేనా వారిని జనం ఎన్నుకుంది ? వారికి ఇష్టంవల్లో, భయం వల్లో కారణం ఏదైనా ఒక వ్యక్తిని నేతగా ఎన్నుకోవాలనుకుంటే ఇదా పద్దతి ? తమ పనులు నిర్వర్తిస్తూ కూడా వారి అధిష్టానంతో సంప్రదింపులు జరుపుకోవచ్చు కదా ? ఇంకా కొన్ని వార్తలు చూస్తే అసహ్యం వేస్తోంది ! నిజంగా గుండె పోటువచ్చి, లేక తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని కాదు కానీ, కొందరు వ్యక్తులు ఎలా చనిపోయినా గానీ , రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక మరణించినట్లు చూపడానికి కొందరు డబ్బులు ఇవ్వడమూ, ఆ కుటుంబాలు అలా చేయడమూ వింటే మనం భూమి మీదే ఉన్నామా అనే అనుమానం తెప్పిస్తోంది !ఇంత జుగుప్సాకరమైన పద్ధతులలో రాజకీయాలు నడపడం అవసరమా? ప్రజా ప్రయోజనాలను పక్కన బెట్టి స్వార్ధ ప్రయోజనాలకోసం ఇంతగా దిగజారిన ఈ నేతలను ఎంత తిట్టినా వారికి సిగ్గు వస్తుందా? వారికి తామూ మనుషులమేనని గుర్తు వస్తుందా? అలాకాకుంటే వారిని గద్దెలెక్కిన్చిన మననే తిట్టుకోవాలి మనం !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )