హైదరా 'బాధ' బాటచారులు !
Tuesday, 22 September 2009
Posted by ప్రభు at 9/22/2009 02:17:00 pm
మన భాగ్య నగరంలో ప్రజలు కాలి నడకన వెళ్ళాలి అంటే అది ఒక నరకమే !రోడు మీద ఎటువైపు నుంచి ఎ వాహనం వస్తుందో తెలీదు ! రోడ్డుకు కుడి చేతి పక్కగా నడుద్దాం అంటే బస్సు స్టాప్ లూ , దాని దగ్గరకు పోలేనంతగా ఆటోలు, తోపుడు బళ్ళూ , పైగా రాంగ్ రూటులో ఎదురొచ్చే సైకిళ్ళూ , స్కూటర్లూ, ఆటో లూ , అప్పుడప్పుడు కార్లూ, లారీలూ కూడా ! ఏయ్ నీకేమైనా పిచ్చా ఫుట్పాత్ మీద నడవకుండా రోడ్డుమీద నడుస్తూ అవడ్డూ, ఇవడ్డూ అంటావే అంటున్నారా ? అయితే మీది హైదరా ' బాధ ' కాదు ! మన మున్సిపాలిటీ పెద్దలు పాపం రోడ్లు వెడల్పు చేస్తారు కానీ ఫుట్పాత్ పెట్టడం మరిచిపోతారు, లేకపోతే పేరుకి బుల్లి గా ఉంచుతారు ! పొరపాటున ఫుట్పాత్ ఉందీ అంటే దాని మీద ట్రాన్స్ ఫార్మర్లు , చెట్లూ వాటి చుట్టూతా కంచెలూ, చెత్త కుప్పలూ, బట్టబయటి సులబ్ లూ !మనకి అవిలేని ప్రదేశం కనిపించిందీ అంటే చక్కగా పూర్తి ఫుట్పాత్ మీద చక్కగా డిస్ప్లే చేస్తూ పళ్ళూ, ఇంకా నానా చెత్తా అమ్మేవాళ్ళు ! ఇంకా విరిగి పోయి పడబోతున్న స్తంబాలూ,తెగిపోయి వేలాడుతున్న తీగెలూ ఇలా వీటన్నిటినీ దాటుకుంటూ గమ్యాన్ని చేరడం అంటే పద్మవ్యూహంలో అడుగు పెట్టినట్లే ! మరి మున్సిపాలిటీ లో పెద్దలు బతికేదీ ఇదే నగరమైన పాపం వాళ్ళు ఈ చెత్త రోడ్లమీద నడవరనుకుంటా ! వాళ్ళు సరే పోలీసులెం చేస్తున్నారూ అంటారా ? భలేవారే మీరు ఇవన్నీ వాళ్ళ ఆదాయ మార్గాలు ! రోజూ బంగారు గుడ్లు పెట్టే బాతులు ! వాళ్ళు ఎలా పట్టించుకుంటారు? ఇంక మనం నోరు తెరిచి అడగాలంటే గూండాలు తయారు మన భరతం పట్టడానికి ! ఎవరిని ఎంత తిట్టి లాభం ఏమిటి ? స్వలాభం తప్ప ఇతరుల పని పట్టని పాలకులనూ, అధికారులనూ, ప్రజలనూ ఎలా తిట్టాలో మీరే చెప్పండి !
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )