ముద్దుగా ఉన్నావని అయినా చూడకుండా పేల్చేస్తాం !
Thursday, 24 March 2011
Posted by ప్రభు at 3/24/2011 12:14:00 pmమా పంట బాగా పండితే - మీ గొంతు బాగా మండుతుంది !
Wednesday, 23 March 2011
Posted by ప్రభు at 3/23/2011 09:53:00 amబ్లాగర్లందరికీ హోలీ శుభాకాంక్షలు !
Saturday, 19 March 2011
Posted by ప్రభు at 3/19/2011 05:08:00 pmబ్లాగర్లందరికీ హోలీ శుభాకాంక్షలు !
వికీ లీక్స్ ఏమీ లీక్ చెయ్యలేదే ?
Friday, 18 March 2011
Posted by ప్రభు at 3/18/2011 10:33:00 amనిజమే కదా ? వికీ లీక్స్ కొత్తగా ఏమీ చెప్పలేదు !
మన రాజకీయ నాయకులు ఎంత అవినీతి దురంధరులో మనందరికీ తెలుసు కదా ?
వోటు వెయ్యడానికి డబ్బు అడిగే మనం ఎంత వెధవలమో కూడా మనందరికీ తెలుసు కదా ?
పార్లమెంట్ లో కొత్తగా పప్పీషేం అయిన కాంగ్రెస్ ని నిలదీసే బదులు, అసలువాళ్ళ దగ్గరినుంచి డబ్బు తీసుకుని వోటింగ్ చేసిన పార్టీల ప్రభుద్దులను నిలదీయండి !
మధ్య తరగతి నిర్లిప్తంగా వోటు వేయకుండా తమ కుటుంబ సంపాదనకు శ్రమ పడుతున్నంత కాలం రాజకీయ నాయకులు మారరు ! ధనికులు తమ ధనం నిలుపుకోవడానికి ఎవరు కావాలో వారికే వోటు వేస్తారు ! బీదలు తమ అవసరాల కోసం తమకు ఎవరు డబ్బు ఎక్కువిస్తే వారికే వోటు వేస్తారు ! మరి మంచికి వోటు వేసే వాళ్ళ శాతం పెరగాలి అంటే అందరినీ తప్పని సరిగా వోటు చేసి తీరాలనే చట్టం తీసుకురావాలి ! అంత దాకా మనం మారం ! మనం మారనంతవరకూ మన రాజకీయ నాయకులు మారరు ! అంత వరకూ మన దేశం మారదు !
జై భారత్ ! ప్రజాస్వామ్యమా వర్ధిల్లు !
మౌనంగా రోదించిన బుద్ధుడు !
Friday, 11 March 2011
Posted by ప్రభు at 3/11/2011 08:55:00 amప్రతిష్టించిన నాటినుంచీ ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, శాంతియుత సందర్భాలను నవ్వుతూ వీక్షించిన తదాగతుడు, తనను ఇంత చక్కటి ప్రదేశంలో లిబర్టీ విగ్రహంలా టాంక్ బండ్ మధ్యలో ప్రతిష్టించి హైదరాబాదు లో జరిగే ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రత్యక్ష సాక్షిలా చేసి ప్రజలందరినీ దీవిన్చేలా తనకు గౌరవాన్ని ఇచ్చినందుకు తెలుగుజాతికి ఆశిస్సులిస్తూ ఉండేవాడాయన !
ఉత్సవంగా వచ్చి గణపతులను తెచ్చి నిమజ్జనం చేసే ప్రజలను చూసి గర్వంగా చూసేవాడాయన ఎందుకంటే అన్ని మతాలవారూ, జాతుల వారూ, విదేశీయులు కూడా ఆ ఉత్సవంలో భాగం గా ఉండి, సర్వ మానవ సౌబ్రాత్రుత్వాన్ని , వసుధైక కుటుంబకాన్ని ప్రతిబింబించే వారు కాబట్టి !
రోజూ ఇంటినుంచి కార్యాలయాలకూ, పాటశాలలకూ, కళాశాలలకూ, వ్యాపారాలకూ వెళ్లి, మళ్ళీ ఇళ్ళకు మళ్లే హైదరాబాదీలను చూసి ముచ్చట పడే వాడా సిద్ధార్ధుడు ! తననూ, తన చుట్టూ ఉన్న వనాలనూ చూడటానికి వచ్చే పర్యాటకులను నవ్వుతూ పలకరించే వాడా శాంతి దూత !
గోకుల్ చాట్ తో పాటు లేజర్ షో లో జరిగిన బాంబు దాడికి ఉలిక్కి పడినా అది జరిపింది ఉగ్రవాదం ముసుగులో ఉన్న రాక్షసులు కాబట్టి వారిని శిక్షిస్తే చాలని సరిపెట్టుకున్నాడా బుద్ధుడు !
కే సి ఆర్ గారి కూతురు కవిత నేతృత్వంలో కోటి బతుకమ్మల జాతరను పరవశిస్తూ వీక్షించాడాయన ! ఇదే తల్లీ ఉద్యమాలు నడిపే పధ్ధతి, శాంతి యుతంగా సంఘటితంగా మన భావాన్ని తెలిపే స్పూర్తి అని ఆశీర్వదిన్చాడాయన !
నిన్న పోలీసుల ట్రాఫిక్ ఆక్షలను తట్టుకుని, పోలీసు రక్షణ వలయాలను చేదించి టాంక్ బండ్ చేరిన వేలాది మందిని ఉత్సాహంగా చూస్తూ ఆశీర్వదించే లోపు ఆ ఉద్యమం ముసుగులో ముష్కరులు చేస్తూన్న విద్వంసం చూసి తల్లడిల్లి పోయాడా బుద్ధుడు !
" ఆపండిరా ! ఇది తప్పురా ! తమ్ముడి పైన కోపం వస్తే తాతలను తంతారా ? " అని అరిచాడు కానీ అక్కడి జనం ఆయనను ఇంకో విగ్రహంగా చూసారు తప్ప పట్టించుకోలేదు !
ఉద్యమ స్పూర్తిని మరిచిన ఉన్మాదులను చూసి బెంబేలు ఎత్తాడాయన ! తెలుగు వెలుగులా నిలిచిన పెద్దలను, అవమానిస్తూ కూల్చేస్తోంటే సిగ్గుతో తలవంచాడు ఆయన !
తనను వారితో బాటు టాంక్ బండ్ మీద కాక విద్వంసకారులకు అందకుండా నీటి మధ్యలో ప్రతిష్టించి కూలినవారితో పాటు కూలిపోయే అవకాశం ఇవ్వనందుకు మౌనంగా రోదించాడు బుద్ధుడు !
Subscribe to:
Posts (Atom)