ఆ పూవు !

Friday, 28 August 2009

ఆ పూవు !
రేకు రేకునా ఆశలు దాచి..
రంగుల లోకంలోకి ..
త్వరత్వరగా రావాలని..
తన శక్తినంతా ధార పోసి..
విచ్చుకొంది పసిపూవు !

కళ్ళముందు కనపడ్డ..
ప్రకృతిని చూసి నవ్వుకుంది హయిగా..
ఈ అందం రోజూ చూసే భాగ్యం నాదేనని !

తన దగ్గరకి వచ్చిన...
అందగత్తెను చూసి బెట్టు పోయింది..
లోకంలో అదృష్టం తనదేననే గర్వంతో !

గొంతు పిసికి తల పెరుకుతున్న..
పడతిని చూసి వణికిపోయింది..
ఇంత అందగత్తె మనసులో ఇంత కాటిన్యామా అని !

వనిత సౌందర్యాన్నయినా ..
ఇనుమడిస్తానని ఆమె కొప్పునెక్కిన పూవు..
నేల జారిపోయింది వడిలిపోయిన శరీరంతో !

ఆశలన్నీ ఉడిగిపోగా..
మూతపడుతున్న రెప్పల క్రిందినుంచి చూసింది..
తనలో కలిపేసుకుంటున్న ప్రక్రుతి వేపు ఆర్తితో ఆ పూవు !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )