స్వయిన్ ఫ్లూ భూతం ?

Wednesday 12 August 2009


ఒక్క రోజులో దేశంలో 9 మరణాలు !
పారిపోతున్న జనం !
ఖాళీ అయిపోతున్న నగరాలు !
ఇదీ మన మీదియా సృష్టిస్తున్నభయ వాతావరణం !
ఒక టీవీ చానల్ ని మించి ఇంకో టీవీ చానల్ పోటీ పడి చేస్తున్న ప్రచారం !
కొన్ని రాజకీయ పక్షాలు తోడై ప్రజల మానసిక పరిస్థితులతో ఆడుతున్న ఆట !

అన్నీ ఇంతేనా అని రోత తెచ్చుకోకుండా కొన్ని చానళ్ళు అప్పుడప్పుడు స్వయిన్ ఫ్లూ పాజిటివ్ గా గుర్తించబడి కాపాదబడిన వారి సంఖ్యను సూచిస్తూ, స్వయిన్ ఫ్లూ బారినపడి బయటపడిన వారితో వారి అనుభవాలను చర్చిస్తూ ఊపిరి పీల్చుకోనిస్తున్నాయి ! స్వయిన్ ఫ్లూ ఇలాంటి పరిస్తితులున్నప్పుడే వస్తుంది, ఒక వేళ తప్పనిసరి పరిస్థితులలో మనం స్వయిన్ ఫ్లూ బాగా ప్రబలిన ప్రాంతాలకు వెళ్ళితే ఇలాంటి జాగ్రత్తలూ తీసుకోవాలి, స్వయిన్ ఫ్లూ వచ్చినప్పుడు ఇలా మనను మనం రక్షించుకోవాలి, అది ఇతరులకు పాకకుండా మనం ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా సజ్ఞాత్మకంగా వివరిస్తూ జనాన్ని జాగారూకం చేయాల్సిన ప్రసార మాధ్యమాలు ఈ విషయంలో చాలాభాగం విఫలమయ్యాయనే చెప్పవచ్చు ! మా మునిసిపల్ కార్పోరేషను ఇంకో అడుగు ముందేసి ఎస్సెమ్మెస్ పోల్ ద్వారా స్కూళ్ళు మూయాలో వద్దో చెప్పమని ప్రజలనే అడిగేసింది !

ఇది నాకు పద్నాలుగు / పదిహేనేళ్ళక్రితం మేము సూరత్ లో ఉన్నప్పుడు వచ్చిన ప్లేగు వ్యాదిని గుర్తు చేసింది !
అప్పుడు ఇన్ని చానళ్ళు లేకపోవడం చేత బ్రతికి పోయాం కానీ, అప్పుడూ అంతే గోరంతలు కొండంతలు చేయబడి, ప్రాణ భయంతో జనం సూరత్ నుంచి వివిధ ప్రాంతాలకు పారిపోయి ఆయా ప్రాంతాల ప్రజలకు కూడా భయాన్ని అంటిన్చేసారు(ప్లేగు అంటక పోయినా) ! ఆలశ్యంగా మేలుకున్న ప్రభుత్వం సూరత్ ను చక్రభందంలో ఉంచి జనం బయటికి పోకుండా చేసి ప్రభలకుండా చేసి భేష్ అనిపించుకుంది ! ఇక్కడ డీవీ రావుగారనే మహానుభావుడు(మునిసిపల్ కమీషనరు) సూరత్ ను చెత్త నగరం నుంచి చెత్తను జాగ్రత్తగా సేకరించే నగరంగా మార్చడంలో పోషించిన పాత్ర చిరస్మరణీయం !

అప్పటి ఆ అనుభవాన్ని చూసినాక కూడా ఇలాంటి మహామారి అంటువ్యాధులు వచ్చినప్పుడు ఏవిధంగా వాటిని ఎదుర్కోవాలో ఒక నిర్దుష్టమైన ప్రణాళిక తయారు చేయడానికి ప్రభుత్వాలకు అడ్డేమిటో తెలియదు !
ఆరోగ్యం కి ఇచ్చే బడ్జట్టు నంతా ఎలా ఖర్చు చేసారని ఎవరూ వైద్యశాఖామాత్యులను అడగకపోయినా ఇటువంటి వెనుకబాటు తనానికి మాత్రం నిలదీయాల్సిందే !

ఒక ప్రాంతంలో అంటువ్యాధులు బాగా వుంటే ఆ ప్రాంతాన్ని రక్షణ వృత్తం (క్వారంటైను) ఉంచి ఇతర ప్రాంతాలకు పాకకుండా చేయాలి ! అది తప్ప అన్నీ జరుగుతున్నాయి ! విదేశాలనుంచి కుప్పలు తెప్పలుగా స్వయిను ఫ్లూ లక్షణాలు ఉన్నవాళ్ళు వస్తుంటే మరి ఆదేశాల విమానాశ్రయాలలో తప్పనిసరిగా అందరి నమూనాలూ సేకరించేలా చేస్తూ, ఆ లక్షణాలు ఉన్నవాళ్ళను పంపనీయకుండా చేయాలని ఎందుకు అనిపించదు? దేశమంతా అభిమానించే మన మాజీ రాష్ట్రపతికి భద్రతపేరుతో అవమానించిన విదేశీ సంస్థలను చూసినా భుద్దిరాదా మన ప్రభుత్వాలకు ?
విదేశాలనుంచి వచ్చేవారికి భద్రతను, ఆరోగ్యాన్నీ పక్కనపెట్టి ఎర్ర తివాచీ పరచాల్సినంత దిక్కు మాలిన పరిస్థితులా మన దేశానికి ? గుడ్డిలో మెల్లలాగా కనీసం మన విమానాశ్రయాలలో నైనా ఈ లక్షణాలు కనిపిస్తున్నవారిని పరీక్షిస్తున్నారు !
మనం ఎందుకు మీమాంస పడుతున్నాం ? ఇటువంటప్పుడు ఇంతమంది అని ఒక సంఖ్య పెట్టుకొని అంతమంది చనిపోయినాక కానీ మనం సరయిన చర్యలు తీసుకోమా?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )