నిన్న ఏదో న్యూస్ చానల్ లో చిరంజీవిగారి ఇదివరకు ఎప్పుడో చేసిన యాత్రలో గుర్రం మీద స్వారీ చేసిన వీడియో చూసాను. ఇవ్వాళ పేపర్ లో ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్తూ కనిపించారు. ఆయన ఒక మెగాస్టార్ మాత్రమె కాక స్వంతగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి, అనుకున్న విధంగా ప్రభుత్వాన్ని ఏర్పరచలేక పోయినా. కొన్ని వోట్లు చీల్చడం ద్వారా, తెలుగు దేశానికి చెక్ పెట్టడంలో కాంగ్రెస్ కు సాయపడి, ఇంకా జగన్ వ్యవహారం ముదిరి కాంగ్రెస్ కు ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా నేను రెడీ అని రోశయ్యగారికి హామీ ఇచ్చి, సోనియాకు కూడా ఇంటికెళ్ళి చెప్పి వచ్చిన రాజకీయ నాయకుడు . ఆయనకు తన పాపులారిటీని ప్రదర్శించుకోవాలని అనిపించడం కూడా సహజమే. అస్సలే ఒక ప్రక్కన జగన్ గారి ఓ..............................దార్పు యాత్ర, జీడి పాకం లాగా సా...గుతోంటే, చంద్ర బాబు కూడా, మహారాష్ట్రలో తిట్టించుకొని, జైలు లో పెట్టించుకొని, నాంపల్లి పోలీసు స్టేషన్ లో వానలో కూర్చొని, కోస్గీలో రాళ్ళు వేయించుకొని ఏదో విధంగా హడావిడిగా కనిపిస్తూ ఉన్నారాయే. ఏదో తమ్ముడితో తెలంగాణా యాసలో ప్రసంగాలు చేయించి, పులి కి ముందు ఇంకో పేరు పెట్టి, కళాకారులకు ప్రాంతీయభావాలు ఉండవని చెబుదామని ప్రయత్నిస్తే, అది కాస్తా అతి పబ్లిసిటీ తో తుస్సు మనే. అందుకని జనంలోకి వెళ్లి జనంతో కలిసి నేనున్నానూ అనిపించుకోక పొతే జనం మరచి పోతారేమోనని బెంగ కదా? ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటీ అంటే. అయ్యా మీరు పబ్లిసిటీ చేయించుకోవడానికి ఉన్న అన్ని దారులూ వాడుకోండి. కానీ మీ వెంట ఉండే సెక్యూరిటీ వారి గురించి, అభిమానుల గురించి కొద్దిగా ఒక నిముషం ఆగి ఆలోచించి చూడండి. మీ మెగాస్టార్ ఇమేజ్ కి జామ్మంటూ వెళ్ళిపోవడం తగిందే కానీ. పాపం జీతపురాళ్ళ కోసం, మీ దర్శనభాగ్యం కోసం, మీ పార్టీలో ప్రతిష్ట పెంచుకోవడం కోసం మీ వెంట ఉండే సెక్యూరిటీ వాళ్ళు, అభిమానులూ, పార్టీ కేడర్ గురించి పట్టించుకున్నారా? మిమ్మల్ని అంటి ఉన్న మీ సెక్యూరిటీ వాళ్ళు మీకు ఇబ్బంది కలగా కుండా ఉండటం కోసం మీవెంట పరిగెత్తాల్సి వచ్చే విధంగా ప్రవర్తించడం మీకు భావ్యమా? కొద్దిగా సమాజంలో ఉన్న ఇతరుల గురించి కూడా ఆలోచించడం మంచిదేమో చిరంజీవిగారూ.
చిరంజీవిగారి గుర్రం/మోటార్ సైకిల్ స్వారీవస్తోంది తప్పుకోండి.. తప్పుకోండి..
Wednesday, 15 September 2010
Posted by ప్రభు at 9/15/2010 06:50:00 pm
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )