ఎటు చూసినా ధరలు చుక్కలనంటుతోంటే, ద్రవ్యోల్బణం ఎలా తగ్గుతుంది? వీడికెమైనా పిచ్చా ? అనుకోకండి. నిజమా అంటే నిజంగా నిజం కాదులెండి. నింగిని దాటి ఎగిరెగిరి పోతున్న ధరలను తగ్గించడానికి ఉపాయాలు ఎలాగూ తట్టడం లేదు. కనీసం ద్రవ్యోల్బణం రేటును తగ్గించి చూపించినా ప్రజలు సంతోషిస్తారేమోననే ఉద్దేశ్యంతో మన ప్రియతమ ప్రధాని సోనియాగారి దగ్గర అనుమతి తీసుకొని ( లేకపోతె ఇంకేమైనా ఉందా?) ప్రకటించిన కొత్త పద్దతి. అంటే నిజంగా ధరలు తగ్గకపోయినా తగ్గినట్లు ఎలా కనిపిస్తుంది ? చెవుల్లో ఏమైనా కాలీఫ్లవర్లు పెట్టుకు కనిపిస్తున్నామా ? అని తిట్టేయడానికి తయారు కాకండి. మన పెద్దలు చెప్పేవారు కదా పెద్ద గీతను చిన్నది చేయాలంటే దాన్ని చెరపకుండా ప్రక్కన పెద్దగీత పెడితే చిన్నదైపోతుందని . మన అదృష్టం ఈ చిట్కా ఆయనకు తట్టలేదు లేకపోతె ఇంకేమైనా పెద్ద ఆపద మన నెత్తిన పడేది.అంటే అది నిజంగా తగ్గకపోయినా చిట్కాతో తగ్గించినట్లే, ఈ కొత్త ఒక్క అయిడియా తో మన జీవితాలు మార్చేస్తున్నారాయన. జగన్ యాత్రలా ఈ సోది సాగిస్తూనే ఉంటావా లేకపోతె పాయింటుకి వస్తావా ? అని చిరాకు పడిపోకండి మరి. పాయింటు కి వచ్చి చెప్పేస్తున్నా.
ద్రవ్యోల్బణం లెక్కించడానికి వాడే ధరల మూల సంవత్సరం (బేస్ ఇయర్ ) ఇప్పటి వరకూ 1993 -94. ఇకనుంచీ వాడబోయే మూల సంవత్సరం 2004 .అంటే ఈ లోపు పెరిగిన/అప్పటి వరకూ ఉన్న ద్రవ్యోల్బణం ఎఫ్ఫెక్ట్ ఇప్పుడు లేక్కవేసే దానిలో ఇంక కనిపించదన్నమాట. వాళ్ళు చెప్పే కారణాలు అప్పటికన్నా ఇప్పుడు బాగా కొత్త కొత్త సరుకులు చేరాయి కాబట్టి వాటి కి మూల సంవత్సరం లో ధరలు లేవని. మనం నమ్మాలని అనుకుంటే అదికూడా నమ్మేద్దాం లెండి. కానీ అస్సలు ముఖ్యోద్దేశ్యం మాత్రం ఇది. అంటే చిన్నప్పుడెప్పుడో చూసిన వాణ్ని ఇప్పుడు అకస్మాత్తుగా చూస్తే ఎంతో పెద్దయినట్లు తెలుస్తుంది, అదే మొన్నీమధ్య చూసినవాడిని మళ్ళీ చూస్తే పెద్ద తేడా కనపడదు. అదన్నమాట మన ప్రధానిగారి కొత్త మన్మోహనాస్త్రం. ఎంతయినా ఆర్ధిక శాస్త్రవేత్త కదా స్టాటిస్టిక్స్ ద్వారా తిమ్మిని బమ్మిని చేయవచ్చు అని తెలియకుండా ఉంటుందా?
ఇంకేం మనకు ద్రవ్యల్బణం తగ్గిపోతుందోచ్.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )