స్వర్గం అంటే అలా ఉంటుందన్నమాట !

Monday 13 June 2011


దేవుడి ప్రియ భక్తుడు ఒకరోజు దేముడికి పెట్టిన రిక్వెస్ట్ ఇది : 
" దేవా నీ దయవల్ల ప్రశాంతంగా బ్రతుకు గడిపేస్తున్నా కానీ అసలు స్వర్గం, నరకం ఎలా ఉంటాయో చూడాలని ఉంది ! " 
దేవుడు ఆ భక్తుడిని వెంట పెట్టుకుని ఒకచోతుకు తీసుకు వెళ్ళాడు ! అక్కడ రెండు తలుపులు ఉన్నాయి ! మొదటి తలుపు తెరిచి చూపించాడు దేముడు ! 
ఆ గదిలో ఒక గుండ్రటి బల్ల మీద మధ్యలో ఒక పెద్ద గిన్నె లో పాయసం చక్కని సువాసనలు వెదజల్లుతూ నోరూరిస్తోంది ! ఆ బల్ల చుట్టూ కూర్చున్న వాళ్ళంతా బక్కగా, అనారోగ్యంగా కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో ఆకలితో బాధ పడుతోన్నట్లు వాళ్ళ కళ్ళలో ఆకలి తెలుస్తోంది ! వాళ్ళ చేతులకు పొడుగాటి కాడలు ఉన్న చెంచాలు కట్టి ఉన్నాయి వాళ్ళు వాటి సాయం తో ఆ బల్ల మధ్యలో ఉన్న గిన్నె లోంచి పాయసం తీయగలుగుతున్నారు ! కానీ ఆ స్పూన్ల కాడలు చేతులకన్నా పొడుగ్గా ఉండటం వాళ్లకు  పాయసం  తమనోట్లో పెట్టుకుని తినడం కుదరట్లేదు ! అలా ఎన్ని స్పూన్లు పాయసం తీసినా అది నేలపాలవుతోంది కానీ వాళ్ళ ఆకలి తీరట్లేదు ! 
వాళ్ళ బాధను, ఇబ్బందినీ చూసిన భక్తుడు చలించి పోయాడు ! అప్పుడు దేవుడు ఆ తలుపు మూస్తూ అన్నాడు : " నరకం అంటే ఇదన్నమాట ! "
దేవుడు భక్తుడిని ఇంకో గది తలుపు దగ్గరకు తీసుకువెళ్ళి, తలుపు తెరిచి,  చూడమన్నాడు ! 
 ఈ గది కూడా ముందు గదిలానే ఉంది ! 
ఆ గదిలో కూడా ఒక గుండ్రటి బల్ల మీద మధ్యలో ఒక పెద్ద గిన్నె లో పాయసం చక్కని సువాసనలు వెదజల్లుతూ నోరూరిస్తోంది ! 
ఆ గదిలో వాళ్ళ చేతులకు కూడా  పొడుగాటి కాడలు ఉన్న చెంచాలు కట్టి ఉన్నాయి  కానీ ఈ గదిలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా, ఆనందంగా కనిపించారు ! 
 " స్వర్గం అంటే ఇదే ! " అన్నాడు దేవుడు నవ్వుతూ !
భక్తుడికి సరిగా అర్థం కాలేదు ! " ప్రభూ కొద్దిగా వివరించి చెప్పరూ ? " అడిగాడు భక్తుడు !
 " ఇందులో పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు భక్తా ! నేను అందరికీ ఒకేలా వసతులూ, అడ్డంకులూ కల్పిస్తాను ! ఇతరులతో పంచుకునేవల్లకు స్వర్గం దక్కుతుంది ! అంతా తమకే దక్కాలనుకునే స్వార్ధ జీవులకు నరకం మిగులుతుంది ! " 
మళ్ళీ గదిలోకి చూసిన భక్తుడికి తమ తమ స్పూన్లతో ఇతరులకు తినిపిస్తున్న స్వర్గ వాసులు కనిపించారు ! 




1 comments:

durgeswara said...

మంచి కథ. బావుంది

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )