బక్కెట్లో నిమజ్జనం

Tuesday, 14 September 2010

మొన్న ఈనాడు పేపర్ చూస్తుంటే రెండు ఫోటోలు కనిపించాయి. ఒక దానిలో ఒక యువకుడు తన మిత్రునికోసం గణపతి ప్రతిమ తీసుకు వెళ్తున్నాడు. ఇంకోదానిలో  బురఖాలో ఉన్న ఒక ముస్లిం యువతి, ఇంకో హిందూ యువతితో కలిసి గణపతి ప్రతిమను కొంటోంది. మిగిలిన ఫోటోలలో  రాజకీయనాయకులూ, ఇతరులూ తమ తమ పలుకుబడి పెంచుకునేందుకు సర్వ మత సామరస్యం చూపించినా, ఈ రెండు ఫోటోలూ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. మన మీడియా కూడా పనికిరాని, ఇతరులకు ఇబ్బంది కలిగించే, హింస, లేదా ఫాషన్ పేరుతొ బూతు చూబించే బదులు ఇలాంటి చిత్రాలను ప్రచురించడం లేదా టీవీ లలో చూబించడం చేస్తే మంచితనం పెరుగుతుందని నా నమ్మకం.

నిన్న మా ఇంటి బుల్లి మట్టి గణపతిని నిమజ్జనం చేద్దాం కదా అని హుస్సేన్ సాగర్ కి వెళ్లి చూస్తే అంతటా దుర్ఘంద బూయిష్టంగా, నల్లగా ఉన్న సాగర్ ను చూసి ఏడుపొచ్చినంత పనయ్యింది. ఈ కాలుష్యానికి ఏవిధమైన సంభందం ఉన్నట్లు పాపం జీ.హెచ్.ఎం.సి. వారు ఎలాగూ ఒప్పుకోరు. రోడ్డ్లు గతుకుల స్థాయి దాటి, ఎత్తుపల్లాలతో కొండలూ లోయలను తలిపిస్తున్నా లేశమాత్రం అయినా  సిగ్గు పడని వారు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయగలరని ఎలా నమ్మడం.  చుట్టూ చూస్తే తోలి రోజుల్లో కాలనీలలోని మండపాలలో పెట్టే సైజులలో ఒక్కొక్క కుటుంబం తెస్తున్న గణనాధుని ప్రతిమలను చూసి ఆశ్చర్యం వేసింది. ఎంత పెద్ద గణపతిని ఇంట్లో పెడితే అంత గొప్ప కామోసు. అందరూ గ్రీన్ గణేశ, గ్రీన్ గణేశ అని గోల చేస్తుంటే ఏమీ పట్టకుండా పలు రంగులలో ప్లాస్టర్ అఫ్ పారిస్ తో చేసిన ప్రతిమలను తెచ్చి భక్తీ శ్రద్ధలతో నిమజ్జనం చేసి మురుగు పెంచడానికి యితోధిక సాయం చేస్తున్నది చూసి తట్టుకోవడం కష్టమయ్యింది. ఇంతకూ ముందు ఒక అంతర్జాల మిత్రురాలు చెప్పిన చిట్కా గుర్తు వచ్చింది. అది బక్కెట్లో నిమజ్జనం.  ఆమె చెప్పేవారు నాకు ఇలా చెరువులను ద్వంసం చెయ్యడం ఇష్టం ఉండదు. నేను నా గణపతిని బక్కెట్లో నిమజ్జనం చేసి, తరువాత ఆనీటిని తులసికోటకు పోస్తాను అని. నేను కూడా నిశ్చయిన్చేసుకున్నాను. ఇంక నుంచి ప్రతి సంవత్సరం బక్కెట్లోనే నిమజ్జనమే చేస్తాను. కాకపొతే కొత్త అపార్ట్మెంట్ కాబట్టి ఇంకా మొక్కలు పెట్టలేదు. మంచి పూలమొక్కలు తెచ్చి పెట్టబోతున్నాం. వాటికే గణపతిని నిమజ్జనం చేసిన నీరు పోసి, నా వంతు సాయం హుస్సేన్సాగర్ కి చేద్దాం అనుకుంటున్నాను.  మీరేమంటారు?

11 comments:

శ్రీనివాస్ said...

మాకు పది కిలోమీటర్ల దూరం లొ సముద్రం ఉన్న కారణం చేత చక్కగా నిన్న వెళ్లి సముద్రం లొ నిమజ్జనం చేసి వచ్చాను :)) మీరు బక్కెట్లో కానిచ్చేశారా

ప్రభు said...

ఏమి చేద్దాం సార్ తప్పలేదు ! :)

Hemalatha said...

ప్రభు గారూ.. తప్పలేదని బక్కెట్ లో నిమజ్జనం చేసారా?[:)]పర్యావరణం కోసం కాదా?
-పుట్ల హేమలత

Pramida said...

super idea!!!!!!!!

Rani said...

ప్రభు గారు, మంచి పని చేస్తున్నారు :)

Niru said...

mee blog background ki,,font colour ki debbaki naaku post finish chesesariki talanoppi vachindandi..koncham avi marchedduru..

పానీపూరి123 said...

మేము ఉండే చోటికి, ఒక కిలోమీటర్ దూరంలో పారే నీళ్ళుగల కాలువలో నిమజ్జనం చేశాము :-)

chanukya said...

More we move to city,more uncivilized we are becoming

ప్రభు said...

రంగులతో మీకు ఇబ్బంది కలిగినందుకు క్షంతవ్యుడిని. మార్చిన బ్యాక్ గ్రవుండ్, ఫాంట్ నచ్చాయి అనుకుంటాను నీరుగారూ !

తప్పక అనే కాదండీ, ప్రక్రుతి మీద ప్రేమతోనే ప్రతి సంవత్సరమూ రేగడి మట్టి వినాయకుడినే ప్రతిష్టిస్తూ ఉంటాము.

oremuna said...

మేము మా కాలనీలో పెద్ద వినాయకుని వద్ద చేర్చాము. తరువాత ఆయన ఇష్టం ఎక్కడైనా మునగనీ :-)

ఇందు said...

పర్యావరణం కోసం మీరు పడుతున్న తాపత్రయం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. మీలాగే అందరు ఆలొచిస్తే ఎంత బాగుండో...నాకు కూడా హుస్సెన్ సాగర్ లొ నిమజ్జన్ దృశ్యాలు చూడబుధి కాదు.. ఎవరి వెర్రి ఆనదం వారిది..ఎంచేస్తాం!! రంగు వినాయక విగ్రహాలు వద్దు మట్టీ వినయకుడిని మాత్రమే తీసుకొండి అని ఎంత మొత్తుకున్నా వినేవారెవరు???

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )