రేపు రాబోతున్న మన దేశ ప్రజలందరికీ ఎంతో ముఖ్యమైన బాబ్రి మసీద్ / రామజన్మ భూమి కోర్టు తీర్పు కోసం అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీన్ని సాకుగా చేసుకొని కొందరు విద్రోహులూ, దేశ ద్రోహులూ మన మధ్య పుల్లలు పెట్టి హింసాత్మక సంఘటనల ద్వారా విద్వంసం సృష్టించాలనే ప్రయత్నం చేయోచ్చు అనేది మనందరికీ తెలిసిందే. ప్రతిసారీ అలా జరగడం చూస్తూనే ఉన్నాం. ఒక న్యాయస్థానంలో వచ్చే తీర్పు నచ్చినా, నచ్చకపోయినా దానిని తెలియచేయడంలో అనవసరమైన రభస, అల్లరి చేయడం అనాగరికం అని తెలిసినా, కొందరి ఉన్మాద మూక ప్రోత్సాహాలతో మనందరం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. మనం మన వంతుగా ఎటువంటి వదంతులనూ నమ్మడం కానీ, పుట్టించడం కానీ చేయకుండా మన విజ్ఞతను చూబిద్దాం. రంజాన్ మాసం మొదలైన దగ్గరి నుంచీ ఈ రోజు ఉదయం వరకూ జరిగిన వినాయక నిమజ్జనం వరకూ మనం చూపించిన సంయమానికీ, సర్వ మానవ సౌబ్రాత్రుత్వానికి ఎటువంటి విఘాతం కలగకుండా కాపాడుకుందాం . ఈదేశం మనది దీన్ని మనమే శాంతియుతంగా ఉంచుకోవాలి. మనం ఇతరుల భావాలను దెబ్బదీయకుండా, వారి భావోద్వేగాలను రెచ్చగొట్టకుండా, ప్రవర్తించడాన్ని ఇంకా ఇంకా సాగించాలి, ఎన్నో ఏళ్లుగా మనదయిన శాంతి కాముకత అనే ఆస్తిని దొంగిలించడానికి ప్రయత్నించే వారి బారిని పడకుండా మనను మనమే కాపాడుకోవాలి. ఎప్పుడూ ఏదో ఒక పనికిమాలిన మాట అని తరువాత నాలిక కరుచుకొనే చిదంబరం చెప్పాడనో, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులకూ కొన్ని పరిమితులు ఉండాలని భావించే మన్మోహన్ చెప్పాడనో కాక మన రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని మనం సంయమనం పాటిద్దాం. ఎన్నో మతాలూ జాతుల కలయిక మనదైనా మన జాతి భారతజాతి అనీ దీన్ని ముక్కలు చేయడం ఎవరితరమూ కాదనీ మళ్ళీ ప్రపంచానికి చాటిద్దాం.
జై భారత్ ! శాంతి వర్ధిల్లాలి !
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
జై భారత్ ! శాంతి వర్ధిల్లాలి !
సుప్రీంకోర్టు నెలాఖరుకి అలాహాబాదు కోర్టు ను తీర్పు చెప్పనిస్తుందో లేకపోతే కామన్ వెల్త్ గేమ్స్ అయినాక చెప్పమంటుందో ?
మళ్ళీ కొన్నాళ్ళు ఆగాలి.
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )