తల్లులు మారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇదెలా సాధ్యం ?

Wednesday, 15 September 2010

 ఆ మధ్య మన రాష్ట్రం లోనే ఒకామె తాను వివాహేతర సంభందంలో కన్నతన బిడ్డను దైవాంశ సంభూతురాలుగా చూపించడం కోసం తాను ఆ బిడ్డను చేరతీసాను అని చెప్పుకుంది. కొన్నాళ్ళ క్రితం ఇంకో ఆమె తను చెప్పిన మాట వినట్లేదని తన బిడ్డను కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చి చంపింది. అదేదో దేశంలో ఒకామె కొన్ని నెలలుగా  ఆగకుండా ఆన్లైన్ గేం ఆడటం కోసం, పిల్లలకు ఫ్రిజ్ లో ఉన్న చెత్తనే పెడుతూ మాడ్చింది. ఇప్పుడింకో ఆమె  తన అక్రమ సంభందానికి అడ్డు వస్తోందని నాలుగేళ్ల కూనను వాతలు పెట్టి హింసించింది. భర్త నుంచి విడిపోయినప్పుడే పోనీ అతనికే ఇస్తే పెంచుకునే వాడేమో? అనాథాశ్రమం  లో చేర్చడానికి తన పరువు అడ్డువచ్చిందేమో ఆ రాక్షసికి. ఇంతకన్నా రోడ్డు మీద వదిలి వేసిన తల్లులే మానవత్వం కొంత ఉన్నవాళ్ళు అనిపిస్తోంది. స్వార్ధం పెచ్చు మీరిపోయి, రక్తం పంచి, ప్రేగు తెంచి కన్న బిడ్డను చిత్ర హింసల పాలు చేస్తున్న, ఇలాంటి ఉపాధ్యాయురాలిని చూస్తోంటే కలియుగాంతానికి ఎంతో దూరం లేదేమో అనిపిస్తోంది. చెట్లకు కాయలు భారమైనట్లు ఉందికదా మరి.

5 comments:

శ్రీనివాస్ said...

కల్కి దిగి రావాల్సిన సమయం ఆసన్నం అయింది :))

Hemalatha said...

nijame prabhu garu ...

maatrutvam mantagalusthondi.chala badhakaramaina vishayam.

Nrahamthulla said...

ఎందుకు వీళ్ళకు పిల్లలు? కంటికి రెప్పలా పోషించలేని తల్లిదండ్రులకు బిడ్డల్ని కనే అర్హత లేదు.ఇలా బిడ్డల్ని హింసించేవాళ్ళు పిల్లల్ని కనకపోవటమే మంచిది.

bonagiri said...

ఇదివరకూ ఇలాంటివాళ్ళు ఉండే ఉంటారు మనకు తెలియకుండా.
ఇప్పుడు మీడియా ఇలాంటివాళ్ళకోసం వెతకటంవల్ల అందరికీ తెలుస్తోంది.

Sree said...

tallulu ani kaadu lendi manushulu maaripotunnaaru... viluvalu maarutunnaay antey... media exposure moolaana manaki teliyadam ekkuvayyindi.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )