ఎంత గొప్ప రహస్యం చెబుతావో అనుకున్నా !

Monday, 28 February 2011

అలా మూలకు వస్తావా చెవి కోరుకుతాను... అంటే ఎంత గొప్ప రహస్యం చెబుతావో అనుకున్నా ! ఇదేనా ?

ఏ... దోస్తీ !

షోలే లో అమితాబ్, ధర్మేంద్రల   కన్నా మా స్నేహమే గొప్ప తెలుసా ? 

లోకాలు కలిపే దారా ఇది ?

నాకైతే ఆ చివర స్వర్గం ఉన్నట్లు అనిపిస్తోంది !

జగన్ గారి తరువాతి దీక్ష ఐక్య రాజ సమితిలో !

Friday, 25 February 2011

ఓ............... దార్పు  యాత్రలు కొనసాగుతున్నాయి !
లక్ష్య (లక్ష) దీక్ష, జల దీక్ష, ఫీజుల దీక్ష అయిపోయాయి !
ఎంతో శ్రమ  పడి (ఖర్చు పెట్టి ) జన సమీకరణలు చేసినా సొంత పేపర్ లో, సొంత చానెల్ లో ఇంకా లోపాయకారీ సంభందాలు ఉన్న ఒకటి రెండు చానెల్ ల లో తప్ప ఎక్కడా ఆయన ఊసే కనిపించడం లేదు ! ఇంకేమి చేస్తే జనం (సోనియా) గుర్తించి తనకు అధికార పీఠం  దగ్గరయ్యే  అవకాశం వస్తుందో అని ఆలోచిస్తే అకస్మా
త్తుగా తట్టింది ! విజయవాడలో మొదలుపెట్టి డిల్లీ, హైదరాబాదు కూడా అయిపోయినాక 
ఇంక ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా చేస్తే తప్ప గుర్తింపు రాదేమో అని అనిపించింది !   
వెంటనే ఒక నెలరోజులు ఐక్యరాజ సమితి ముందు జనసమీకరణ చేసి దీక్ష చేస్తే చచ్చినట్లు జగం గుర్తించి హైదరాబాదూ,  ఇండియా ఎందుకు ప్రపంచానికే నువ్వు రాజువయ్యా అంటారని సంబరం వేసింది ! జన సమీకరణకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా తండ్రి సంపాయించి పెట్టారు కాబట్టి నిశ్చయం జరిగిపోయింది !
 జగన్ గారి తరువాతి దీక్ష ఐక్య రాజ సమితిలో !

రమణగారి ఆత్మకు శాంతి చేకూరి ఆయన స్వర్గం లో కోతికోమ్మచ్చులాడాలనీ ప్రార్ధిస్తున్నాము !

బుడుగు, సీ గ్నాన ప్రసూనాంబ, అప్పారావు, తీతా(తీసేసిన తాసిల్దారు), రాధా గోపాలం........... 
వీళ్ళంతా ఈ రోజు మనతో కలిసి మూగపోయారు !
 మనకు భాదతో పలుకు రాకపోతే వాళ్లకు పలుకు నేర్పినాయన పలక్కుండా ఉన్నారాయే !
బాపు కుంచె కు మాటలు నేర్పిన ముళ్ళపూడి ఇంకా లేరు అనుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు !
 ఆయన రాతల్లోనే, ఆయన పుట్టించిన పాత్రల్లోనే ఆయన  ఎప్పుడూ అమరజీవిగా ఉంటారని ధైర్యం చెప్పుకుంటున్నాము ! బాపు గారికి తన ప్రాణ మిత్రుడిని  కోల్పోయిన దుహ్ఖ  సాగరాన్ని ఈద గలిగిన ధైర్యం ఇవ్వాలనీ,
 రమణగారి కుటుంబానికి తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలనీ, రమణగారి ఆత్మకు శాంతి చేకూరి ఆయన స్వర్గం లో కోతికోమ్మచ్చులాడాలనీ ప్రార్ధిస్తున్నాము !   

సరిలేదు ఈ పడవకు !

మేము ఎక్కి వచ్చిన పడవకన్నా ఇదే బాగుందని మా పడవ కూడా దీని మీదే ఎక్కించి విహారం కొనసాగిస్తున్నాం !
కాసేపు అటూ ఇటూ కావాలంటే వాకింగ్ కూడా చేసుకోవచ్చు కదూ ?

నీ కోటు లాగానే.. నీ ప్రేమ కూడా హాయైన వేడి సుమా !


మా ప్రాపర్టీ ఎలా ఉందో చూసుకోవద్దా ?

ఎందుకంత ఆశ్చర్యం ? మీ పేరు మీద మీకు ఆస్తులున్నట్లే నాకూ నా పేరు మీద  ప్రతి చిన్న పెద్ద నగరం లో ప్రధానమైన రోడ్ల మీద ఆస్తులున్నాయి ! ఏ వూరు వెళ్ళినా నా ఆస్తులు ఎలా ఉన్నాయో చూసుకోవడం నాకు అలవాటు !

ఆ కొండ పైకి చీమల్లా జనం !

ఎలా ఎక్కేస్తున్నారో ?

ఏదో అందంగా ఉన్నావు కదా అని వదిలేస్తోంటే... వేషాలు వెయ్యకు ?

Thursday, 24 February 2011

నన్ను నాదారిన పోనీ ! లేకపోతే నీ అడ్రస్ గల్లంతు అయిపోతుంది !

లాహిరి లాహిరి లాహిరిలో ...

 మనం నీళ్ళమీద ఇలా వెళ్ళగలం అని ఎప్పుడూ అనుకోలేదు బాస్ !

ఈ లంకకు నేనే మేస్త్రీ..





ఈ రాజ్యం నాదే  అన్నట్లు ఉన్న ఆ ఇల్లు ఎన్ని భావాలు రేపుతోందో ?
అలాంటి ఇంట్లో ప్రకృతితో స్నేహం చేస్తూ మరణించినా బ్రతికినట్లే !

మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ! కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా ?

మీరు మరో చరిత్ర సినిమా చూడలేదా ? మేమిద్దరం అలా ఇంటి నుంచి దూరంగా వచ్చాం ! 
మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ! కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా ?

ఈ సైకిళ్ల రూటే వేరు !

Wednesday, 23 February 2011


రైలు పట్టాలు ఎక్కిన సైకిలు ! 

హిమనదంలో సైకిల్ !

కొండెక్కిన సైకిల్ !
సైకిల్ ఎక్కమంటే ఎక్కగలం కానీ ఇలా సైకిలెక్కించాలి అంటే గుండె కావాలి !

ఇంక ఇలా వీలు లేదని నేనే సీటు తీసుకెళ్తున్నా !

మా  అబ్బాయికి  స్కూలుకి  వెళ్ళే  వయసు వచ్చేసింది ! ఎ స్కూలుకి వెళ్ళినా, డొనేషను కడతాం అన్నా కానీ సీట్లు లేవంటున్నారు ! ఇంక ఇలా వీలు లేదని నేనే సీటు తీసుకెళ్తున్నా !

నీక్కూడా చెట్టెక్కడం వచ్చా ?

అరె... నీక్కూడా చెట్టెక్కడం వచ్చా ? నాకు తెలీదే ? 
కానీ ఏం చేద్దాం ఇంకో చెట్టు చూసుకో మరి !

నింగికీ నేలకూ మధ్య

Tuesday, 22 February 2011

 ఇప్పుడు పొరబాటున కిందికి వెళ్ళినా.. వెళ్ళేది పైకే !

నిన్ను వదిలి నేను పోలేనులే.. అదీ నిజములే !


స్మశాన వైరాగ్యం !

ఎంత గొప్పగొప్ప  ధనవంతులతో  కలిసి  తిరిగినా... ఇంద్ర భవనాలలో మెలిగినా.. చివరికి చేరేదిక్కడికే !

ఒక్కడూ గోలెయ్యడానికి రారే ?

ఇంత కష్ట పడి గోల్కీపింగ్ చేస్తోంటే ఒక్కడూ గోలెయ్యడానికి రారే ?

ఈ స్కూటర్ లాగుతున్న బస్సు లో ఎవరెక్కుతారో ?

Monday, 21 February 2011

సైడ్ కార్ బావుంది కదూ ?

ఏ దేశమేగినా ...

గొడ్ల వల్ల రోడ్లు జామ్ అవడంలో  మన దేశానికి కాపీ రైట్ ఏమీ లేదు కదా ?

నన్ను చూసి భయపడే వాళ్ళే కనిపించరే ?

ఏ దుర్ ముహూర్తంలో   వీడిని ఆడించడానికి ఒప్పుకున్నానో కానీ... నా పరువంతా పోయిది ! 

 

కొన్ని తమాషా హెయిర్ స్టైల్స్ !

Saturday, 19 February 2011

 నా కళ్ళజోడు బాగుందా?


నాకు ముంగురులంటే ఎంత ఇష్టమో ! 


అప్పటికీ డాడీ కి చెబుతూనే ఉన్నాహెయిర్ కట్ చేసేటప్పుడు  నేను తల ఎత్తను చెయ్యి తియ్యి అని !  వింటేనా ? 


అంతా నేను పడుకోకుండా చక్కగా చదువుతున్నాను అనుకుంటున్నారు కదూ ? 


ఈ మధ్య నా మీద వెన్నుపోటు దాడులు ఎక్కువయ్యాయిలెండి అందుకని ముందు జాగ్రత్త అన్నమాట !

నా జోకులకే ఇలా తియ్యగా నవ్వేస్తోంది  ఇంక ముద్దు పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో ?


నేను స్విచ్చి నోక్కానంటే నా హేలీకాప్టార్ పైకి ఎగురుతుందోచ్ !


వద్దు..  వద్దంటుంటే వినకుండా నా గర్ల్ ఫ్రెండ్ నాకు క్రాఫు దువ్వడం మొదలెట్టింది ! ఈ జుట్టంతా దువ్వడం అయ్యేసరికి సినిమా అయిపోతుందేమో  ?


నేనింత అందంగా ఉంటానా ఇంకా నాకు ఒక్క గర్ల్ ఫ్రెండు దొరకలేదేమిటో అనే బాధ సాలీడులా నా బుర్ర తొలుస్తోంది ! 



బయటికి వెళ్ళేటప్పుడు టోపీ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు అందుకని ఈ ఏర్పాటు !

ఫుట్ బాల్ ప్రపంచకప్ మళ్ళీ ఇంకోటి వచ్చేదాకా ఇంక నా జుట్టు పెరగదా ?

వూల్వరిన్ స్టైలా పాడా ? ఇందాక పరీక్ష రాసేటప్పుడు ఆన్సర్ తట్టక జుట్టు పీక్కుంటే ఇలా అయ్యింది ! 


ఆకులో ఆకు అవడం అంటే ఇలాగే అంటావా ?



నాకెలాగూ దారి తెలియట్లేదు మీకైనా సరిగా కనిపించాలని ఈ జ్యోతి !


అయితే అప్పారావు మాత్రం ఇప్పుడు పెట్రోలు అక్కడ కొనడం మానేసాడు !

Thursday, 17 February 2011

అప్పారావు ఆఫీసుకి వెళ్ళడానికని  బయలుదేరి అపార్ట్మెంట్ కింద సెల్లార్ లో ఉన్న మోటర్ సైకిల్ దగ్గరకు వెళ్తుంటే పక్క ఫ్లాట్లలో ఉన్న మూర్తీ మురళీ కనిపించారు !
" ఏమిటి మూర్తి గారూ చాలా డల్ గా  ఉన్నారు ? " అడిగాడు అప్పారావు !
" ఏం చెప్పమంటారు బాస్ ? ఈ మధ్య మా కారు మైలేజి చాలా తక్కువిస్తోంది ! దానికితోడు నెలకు రెండుసార్లు పెట్రోలు ధర పెరిగిపోతోంది అందుకని బుర్ర వేడెక్కిపోతోంది  " వాపోయాడు మూర్తి !
" అందుకనే బాస్ నేను కారు పక్కన పెట్టేసి మోటర్ సైకిల్ మీదే తిరుగుతున్నా " ఆనందంగా చెప్పాడు అప్పారావు బుర్రు మని మోటర్ సైకిల్ స్టార్ట్ చేస్తూ  !
" అవును గురువుగారూ మేము కూడా అదే చేయాలి అనుకుంటున్నాము " అన్నాడు మురళి !
వాళ్ళిద్దరికీ బై చెప్పి రోడ్డెక్కిన అప్పారావు  స్పీడో మీటర్ వేపు చూసాడు !  పెట్రోలు అయిపోవచ్చినట్లు తెలిసి దగ్గరలోనే రోడ్డు పక్కన సీసాలలో పెట్రోలు అమ్మే వాళ్ల వేపు దారితీశాడు !
" ఖాదిర్ బాయ్ ఒక లీటర్ పెట్రోలు పోస్తావా ? " తన బండి పెట్రోల్ ట్యాంక్ మూత తీస్తూ అడిగాడు అప్పారావు !
" అందుకేగా సాబ్ మేముందీ ? లీటరు చాలా ఇంకా పోయాలా ? " అడిగాడు ఖాదిర్ !
" ఒక లీటర్ చాల్లే భాయ్ ! ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పెట్రోల్ బంకు లో పోయిన్చుకుంటాలే " డబ్బులిస్తూ చెప్పాడు అప్పారావు !
" ఆప్కీ మర్జీ సాబ్, లేకిన్  మేము తెచ్చేది కూడా ఆ పెట్రోలు బంకునించేగా సాబ్  " నవ్వుతూ సలాం చేసాడు ఖాదిర్ భాయ్  !
ఇక్కడ పెట్రోల్ బంకు ఎత్తేసి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం పైగా ఫ్లై ఓవర్ల పుణ్యమా అని పెట్టిన రోడ్ డివైడర్ల వల్ల పెట్రోలు బంకు దగ్గరకు వెళ్ళాలి  అంటే కనీసం అయిదు కిలో మీటర్ల దూరం అయినా వెళ్ళాలి ! ఖాదిర్ భాయ్ లాంటి వాళ్ళ వల్ల అంతంత దూరాలు బండి నడిపించుకుని వెళ్ళాల్సిన బాధ తప్పింది అనుకుంటూ బండి ఆఫీసు వేపు దూకించాడు అప్పారావు !
**** 
ఆరోజు ఆఫీసులో జరిగిన గొడవ వల్ల అప్పారావుకి నిదుర పట్టలేదు ! చాలా సేపు టీవీ లో జగన్, చంద్రబాబు, కే. సి. ఆర్., చిరు, కిరణ్ కుమార్, సోనియాలు ఆ రోజు చేసిన యాత్ర, బంద్, ధర్నా, ప్రకటన ఇంకా ఇలాంటివే కొన్ని  రాజకీయ గంతుల  పైన చర్చలు న్యూస్ చానళ్ళలో చూసి చూసి బుర్ర పగిలి నంత తలనెప్పి వచ్చి కాస్త చల్లగాలికోసం బాల్కనీ లోకి వచ్చాడు అప్పారావు !  
కింద నుంచి ఏదో గుస గుసలు వినిపించి నట్లు అనిపించి చేతికున్న వాచీలో  టైం చూసుకుంటే అది ఉదయం 3.30 గంటలుగా చూపించింది ! ' ఈ సమయం లో గుస గుసలు వినిపిస్తున్నాయి ఏమిటబ్బా,  వాచ్మన్ ఏమైనా సరసాలు ఆడుతున్నాడేమో  ' అనుకున్నాడు అప్పారావు ! కానీ గొంతుల్లో ఆడ గొంతు వినిపించక పోయేసరికి ఎందుకైనా మంచిదని తలుపు వెనక పెట్టిన దుడ్డుకర్ర తీసుకుని, తన ఫస్ట్ ఫ్లోరు ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి చప్పుడు కాకుండా మెట్లు దిగి సెల్లార్ లోకి వచ్చాడు అప్పారావు !  అటూ ఇటూ చూసినా ఎటూ ఎవ్వరూ కనిపించలేదు ! వాచ్మెన్ కోసం చూస్తె హాయిగా తన మంచం మీద పడుకుని గుర్రుకొడుతూ కనిపించాడు ! 
" సింహాచలం.. ఒరేయ్ సింహాచలం... లేరా నాయనా " అని తట్టి లేపాడు అప్పారావు  ! 
ఉలిక్కి పడి లేచాడు సింహాచలం !  
" ఎవరది ? ఓ.. మీరా సార్ ? ఏమిటి ఇప్పుడు వచ్చారు ? బయటకు వెళ్ళాలా ? తలుపు తీయనా ? " గబా గబా లేచి గేటు వేపు వెళ్తూ అన్నాడు సింహాచలం !
" ఇలా లుంగీ బనీను లో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను కానీ కాపలా కాయకుండా ఇలా పడుకోవడానికేనా మేము నిన్ను పెట్టుకుందీ ? " క్లాసు పీకాడు అప్పారావు !
" అయ్యో ఇప్పుడే అలా మగత కమ్మేసింది కానీ రాత్రుళ్ళు నేనసలు పడుకోనండీ. ప్రమాణం " వాపోయాడు వాచ్మాన్ సింహాచలం !
" సర్లే  కానీ.. ఇందాక ఏవో గుస గుసలు వినిపిస్తే.. ఏమిటో చూద్దాం అని వచ్చా.. పద ఒకసారి సెల్లార్ అంతా చూద్దాం " అన్నాడు అప్పారావు !
సింహాచలం వెంటనే సెల్లార్ లైట్లు అన్నీ వేసాడు ! ఇద్దరూ కలిసి సెల్లార్ లో అన్ని వేపులా దృష్టి సారించారు ! ఎక్కడా ఏమీ కనిపించలేదు !  
" మీరేదైనా కల కన్నారేమో సార్ ? " సింహాచలం జోకాడు !
" నీ బొంద !  నిద్రే పోకపోతే.. ఇంక కల ఎలా కంటాను ? పద అంతా చూద్దాం "  అని కార్ల మధ్యకు వెళ్ళేసరికి పెట్రోలు వాసన వచ్చింది ! 
జాగ్రత్తగా చూస్తే రెండు ప్లాస్టిక్ కేన్లలో పెట్రోలు కనిపించింది ! కొంత పెట్రోలు కింద కూడా కనిపించింది ! 
" ఇదేమిటి సింహాచలం ఇక్కడంతా పెట్రోలు ఉంది పైగా కేన్లలో కూడా ఉంది మాధవరావుగారు ఏమైనా తెచ్చి మరిచిపోయాడా ? "  అడిగాడు అప్పారావు ! 
" మాధవరావుగారు వూళ్ళో లేరు కదా సార్ ?  " అని కిందకు వంగి మాధవరావు కారు కిందకు చూసాడు సింహాచలం ! అక్కడ అతనికి చేతిలో పొడుగాటి పైపుతో  నక్కి పడుకున్న చిన్నపిల్లాడు కనిపించాడు !
" ఎవడ్రా నువ్వు ? ఇక్కడేం చేస్తున్నావ్ ? " అంటూ వాడిని పట్టుకుని బయటకు లాగాడు సింహాచలం !
వణికిపోతూ బయటికి వచ్చిన ఆ కుర్రాడు కేర్ మని ఏడవడం మొదలు పెట్టాడు ! వాడి ముఖం చూస్తే ఎక్కడో చూసినట్లు అనిపించింది అప్పారావు కి ! 
ఒక్కసారి లైటు వెలిగింది అప్పారావు బుర్రలో ' వీడు ఆ ఖాదిర్ కొడుకనుకుంటా ఆ మధ్య పెట్రోలు పోయించుకున్నప్పుడు వాడి దగ్గర చూసినట్లు ఉంది ' అనుకుని "ఒరేయ్ నువ్వు ఖాదిర్ కొడుకువా ?"  అడిగాడు అప్పారావు ! 
అవునన్నట్లు బుర్ర ఊపాడు ఆ కుర్రాడు ! అప్పారావు కి ఇప్పుడు అంతా అర్థం అవసాగింది !
" ఓరి దురార్గుల్లారా .. ఇదా మీ పని ? మా బళ్ళలో పెట్రోలు దొంగిలించి మాకే అమ్మేస్తున్నార్రా మీరు ? పైగా పెట్రోలుబంకు ధరలకే ఇక్కడ పెట్రోలు బంకు లేదని ఇలా సేవ చేస్తున్నాం అని బిల్డప్పు  ఒకటి మీ బాబుకి  " కోపంతో సివాలు తొక్కాడు అప్పారావు !
 గబగబా ఫ్లాట్లోకి వెళ్లి ప్యాంటు చొక్కా వేసుకుని, అప్పటికప్పుడు ఆ కుర్రాడిని  పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి అప్పగిస్తే ఆ ఇనస్పెక్టర్  మొత్తం కూపీ లాగాడు ! ' అప్పారావు కిందకు రావడం చూసి గేటు బయట నుంచుని ఉన్న ఖాదీర్ పారి పోయాడనీ, కారు కింద పడుకుంటే కనిపించవు, అందరూ మళ్ళీ పడుకున్నాక వచ్చి తీసుకెళ్తానని చెప్పాడనీ '  వెక్కుతూనే చెప్పాడు ఆ కుర్రాడు ! ఆ తర్వాత పోలీసులు వెళ్లి ఖాదిర్ ని అరెస్టు చెయ్యడమూ చూసాడు అప్పారావు ! కానీ కొన్నాళ్ళ తరువాత మళ్ళీ ఖాదిర్ అదేచోట పెట్రోలు అమ్ముతూ కనిపించాడు అప్పారావుకి ! 
అయితే అప్పారావు మాత్రం ఇప్పుడు పెట్రోలు అక్కడ కొనడం మానేసాడు !

సౌర శక్తి !

Tuesday, 15 February 2011

దివి నుంచి భువికి జారే దివ్య శక్తి పుంజం !

తల్లి ప్రేమా ? / తిండి ప్రేమా ?

 తన పిల్లతో పాటు కడుపులో దాచుకొని  పెంచాలనో లేకపోతే తన పిల్లల కడుపుకోసం పెంచాలనో ఈ పిల్లమ్మ (పిల్లి + అమ్మ ) తాపత్రయం !

చెట్టుతో చెట్టు నై ఉండిపోనా ?

 ఆకాశానికీ భూమికీ మధ్య ప్రకృతిలో మమేకమై ఉండగల అదృష్టం ఎంతమందికి ఉంది

జనం ఆ జెయింట్ వీల్ ఎందుకు ఎక్కుతారో నాకు అర్థం కాదు !

Monday, 14 February 2011


ఎగిరితే చాలదా ?

నువ్వా వీడియో సరిగానే చూశావా ?
ఇలా ఎక్సర్ సైజ్ చేస్తే మన రెక్కలు గట్టిపడతాయంటావా ?

నన్ను వాకింగ్ కి తీసుకెళ్తున్నా అని మీ అమ్మతో చెప్పావ్ ?

Friday, 11 February 2011

ఎంతసేపూ ఆ మోటర్ సైకిల్ వాడికోసం వెయిట్ చేయ్యడమేనా ?
ఒక ఆటా లేదూ పాడూ లేదూ !
దాగుడుమూతలాడదాం వస్తావా లేదా ?

కాఫీ కనిపిస్తే చిన్నపిల్లాడిని అయిపోతా !

కాఫీకి అలా దాసుడిని పోయాను మరి !

నీ ముద్దు ఇంకాస్సేపు భరిస్తే నేను చచ్చిపోవడం ఖాయం !

వాడు ఫోటో తీసేసాడు !

జనం కూడా చూసేసారు కానీ  నన్ను వదిలేయ్ !

నువ్వు బ్రష్ చేసుకోవా ?
అంత కంపు మీ ఆవిడెలా భరిస్తోందిరా బాబూ ?

కొద్దిగా జాగర్తగా నడువు తమ్ముడూ !

ఈ గాలికి హెలీకాఫ్టర్ బేలన్సు చేసేసరికే చచ్చే చావోస్తోంది !
వాడు చూడు ఎలా బేలన్స్ చేసుకుంటూ నడిచేస్తున్నాడో ?
కొద్దిగా జాగర్తగా నడువు తమ్ముడూ !
పొరబాటున బాలన్స్ తప్పి ఆ కర్ర ఇటు తగిలించావంటే మనం ఫట్ !

ఈ చోటు అతనిదే కానీ ఎంత దయ అతనికి మామీద ?

Thursday, 10 February 2011


మా ఇంటికి జాగా ఇవ్వడమే కాక మా భారాన్ని ఎంత ఆనందంగా మోస్తున్నాడో ?