ఎందుకని నా మిత్రుడడిగాడు !

Wednesday 2 February 2011

ఈత మంచి వ్యాయాయం అయితే తిమింగలాలు ఎందుకు లావుగా ఉంటాయి ?
అందరూ స్వర్గానికే వెళ్లాలని అనుకుంటారు కానీ చావడానికి ఎవరూ ఇష్టపడరెందుకు ?
వర్ణ విభేదం లేదంటారు మరి చదరంగం లో ఎప్పుడూ తెల్ల పావులే ఎందుకు ముందు కదిలించాలి ?
మన దేశం లో వాక్ స్వాతంత్రం  ఉందంటారు మరి టెలీఫోన్ కి బిల్లులు ఎందుకు ? 
డబ్బు చెట్లమీద కాయదు అంటారు మరి బాంకులకు అన్నన్నిశాఖలు ఎందుకు ? 
పిజ్జాలూ, కేకులూ  గుండ్రగా ఉంటే వాటి బాక్సులు చదరంగా ఎందుకుంటాయి ?
జిగురు అది పోసిన బాటిల్ కి  అతుక్కోదు ఎందుకని ? 
మనం ఇతరులకు సాయం చేయడానికే ఉంటే మరి ఇతరులు ఎందుకున్నారు ? 
ఎవరైనా తాగి డ్రైవింగ్ చెయ్యకూడదు కదా మరి బార్లకు పార్కింగ్ ఎందుకు ?

  

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )