మళ్ళీ మనం క్రికెట్ లో విశ్వ విజేతలం !

Sunday 3 April 2011




మళ్ళీ మనం క్రికెట్ లో విశ్వ విజేతలం !
ప్రతి భారతీయుడూ పులకిన్చేలా,  ధాటిగా ఆడిన శ్రీలంకకు దీటుగా సమాధానం చెప్పి ధోనీ సేన మన భారతాన్ని మళ్ళీ ప్రపంచ కప్ చాంపియన్ గా నిలపెట్టారు ! దేశం కోసమనీ, సచిన్ కోసమనీ చెపుతున్నా జట్టులోని ప్రతి వ్యక్తీ వ్యక్తిగతంగా కూడా గెలుపు ఉద్వేగాన్ని అణుచుకో లేక కంట తడి పెట్టడం చూస్తోంటే చాలా హృద్యంగా అనిపించింది  !
టోర్నమెంట్ మొదట్లో పసికూనలతోనూ సీరియస్ గా చివరి వరకూ నరాలు తెగేలా టెన్షన్ అనుభవిస్తూ గెలిచినా ఉద్దండ పిండాలయిన అసీస్, సవుత్ ఆఫ్రికా, పాక్, శ్రీలంక  టీములతో సమిష్టి కృషితో తన గొప్పదనాన్ని చాటుతూ నిలబెట్టుకుంది ! సచిన్ కి వందో శతకానికి ఇంకా సమయం వున్నట్లు ఉంది ! 
భారత క్రికెట్ జట్టుకు ఘనమైన హృదయపూర్వక శుభాకాంక్షలు !
ఇంకా ముందు కూడా ఇదే స్పూర్తి తో ఆడి దేశానికి, తమకూ పేరు తేవాలని కోరుకుందాం !

1 comments:

బాలు మంత్రిప్రగడ said...

కోట్లాది భారతీయుల కలని నిజం చేసిన 'టీం ఇండియా' కి శుభాకాంక్షలు
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )