సెల్ ఫోను వాడటం వలన ఎంత దారుణం జరిగిందో !

Friday 15 April 2011


నాకు ఒక మిత్రుడు పంపిన యదార్థ సంఘటన వివరాలు  మీ అందరితో పంచుకోవాలని అనిపించింది !

:బెంగుళూరు లోని ఒక ఆసుపత్రిలో  ఒక నాలుగేళ్ల బాలికను  కాలు విరిగిందని చేర్పించారు ! విరిగి బయటకు పొడుచుకు వచ్చిన ఎముకను సరి చేయడానికి ఒక చిన్న ఆపరేషను చెయ్యడానికి సిద్దం అయ్యారు అక్కడి సర్జనులు ! అది చిన్న ఆపరేషనే అయిన ముందు జాగ్రత్త చర్యగా లయిఫ్ సప్పోర్ట్ సిష్టానికి ఆ పాపను జోడించి ఆపరేషను మొదలు పెట్టారు ! డాక్టర్లు ఆ ఆపరేషను కు ముందు ఆ సిస్టం లో వేరు వేరు పరిస్థితులను క్రోడీకరించి సిద్ధం చేసారు !

అకస్మాత్తుగా ఆపరేషను మధ్యలో ఆ సిస్టం పని చేయడం ఆగిపోయింది !

కారణం :  ఆపరేషన్ దియేటర్ బయట ఎవరో తన సెల్ ఫోను వాడుతోంటే దాని ఫ్రీక్వెన్సీ ఈ సిస్టం ను అడ్డుకుంది !
కంగారుగా పరిగెత్తి ఆ ఫోను ఎవరిదో తెలుసుకుని ఆపుదామని ప్రయత్నించారు కానీ కుదరక ఆ చిన్న ప్రాణం గుటుక్కుమంది !

కావాలని కాకపోయినా నిషిద్ద ప్రదేశంలో  సెల్ ఫోను వాడటం వలన ఎంత దారుణం జరిగిందో చూసారుగా !

అందుకని మనం చేయవలిసింది ఏమిటంటే ఇకనుంచి, హాస్పిటల్స్ దగ్గర గానీ, పెట్రోలు బంకుల దగ్గరగానీ, విమానయానం సమయంలో కానీ ఇంకా ఎక్కడెక్కడైతే   సెల్ ఫోను వాడకం నిషిద్దమో అక్కడ సెల్ ఫోన్ల గొంతు నోక్కేద్దాం ! మనవల్ల తెలిసో తెలియకో ఇంకో ప్రాణి బలికాకుండా చూద్దాం !

3 comments:

durgeswara said...

మనసు వికలమయిది

Unknown said...

Akkada cell phone jammar petta vachuga .... yevariki ye time lo argent call vastudo telidu kada.

ప్రభు said...

ఏమోనండీ మరి జామర్లు కూడా వీటిని పని చేయ్యనివ్వవేమో తెలియదు !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )