ఇన్ని లక్షల మందిని ఆధ్యాత్మిక భంధనం తో ఏకంచేసి ఎందరో ఆర్త జనులకు అండగా నిలిచిన మహానాత్మకు శాంతి కలుగు గాక !

Monday 25 April 2011

ఎంతో మంది దైవం లా భావించే గురువు(సత్య సాయి) ఇంక లేరని తెలిసిన భక్తులు శోక సముద్రం లో మునిగి ఉన్నారు !
ఆయన ఇచ్చిన కానుకలు సృష్టించినవా, లేక ఇంద్రజాలికులలా కనికట్టుతో ఇచ్చినవా అనే ప్రశ్నకు సమాధానం తెలియకుండానే సాయి వెళ్ళిపోయారు !
ఆయనను నమ్ముకుని ఆయన చేస్తున్న సేవలలో తమ సంపద ఉపయోగ పడుతుంది అనే ఉద్దేశ్యం తో ప్రజలు ఇచ్చిన సొమ్ము లక్షన్నర కోట్లు వరకూ ఉందంటే ఆయన పై జనానికి ఉన్న విశ్వాసాన్ని అర్థం చేసుకోవచ్చు ! నమ్మకం తో ఇచ్చినా, మూడనమ్మకం తో ఇచ్చినా ఆ సొమ్ము ఇచ్చిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చకపోతే అది మటుకు పాపమే అవుతుంది ! మూడు వారాలకు పైగా మినుకు మంటున్న జీవజ్యోతి సాక్షిగా ట్రస్ట్ పై ఆధిపత్యం కోసం జరిగిన ప్రయత్నాలు ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి ! సందట్లో సదేమియాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బ్రష్టు పట్టించడానికి ఇతోధిక సాయం చేసిన మద్యం వ్యాపారి ఆదికేశవులు లాంటివారు కూడా చిత్రంలో కనిపించి దైవం లాంటి వ్యక్తి కన్నా ధనమే ఎక్కువన్న ప్రస్తుత విచార ధోరణులను స్పష్టీకరించారు !
ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోయినా, ఆ ట్రస్ట్ కు పారదర్సకత తెచ్చే నియమాలను ఏర్పరచడం లోనూ, విధి విధానాలను ఏర్పరచడం లోనూ ప్రభుత్వ సాయం ఉంటే మంచిదనిపిస్తుంది !

ప్రజల నమ్మకమ తో  చేరిన కొండంత  ఆస్తిని దురాశాపరులు కబళించ కుండా   చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే !
ఇన్ని లక్షల మందిని ఆధ్యాత్మిక భంధనం తో ఏకం చేసి  ఎందరో ఆర్త జనులకు అండగా నిలిచిన మహానాత్మకు శాంతి కలుగు గాక !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )