వాళ్లు నవ్వుతున్నారు..
Friday, 31 July 2009
Posted by ప్రభు at 7/31/2009 11:52:00 pmవాళ్ల దెబ్బలకు కూలుతున్న ప్రజలను చూసి,
రాళ్ళు రువ్వుతున్నారు..
అధికార పీఠమెక్కిన అసమర్థత బలంతో !
స్వార్ధానికీ, కపటానికీ అగ్రస్థానం..
నిస్వార్దానికీ, శ్రమకూ అదోస్థానం..
ధనానికీ, దోపిడీకీ అగ్రభాగం..
చెమటకీ, పేదరికానికీ అల్పభాగం.. ఇస్తూ !
మొసలి కంటను నీరు కార్చి..
మెసలి పంచను నిన్ను తార్చి..
ఒక చేతను నిన్ను నిమిరి..
ఇంకొక చేతను నిన్ను నలిపి.. వేస్తూ !
వాళ్లు నవ్వుతున్నారు..
వాళ్ల దెబ్బలకు కూలుతున్న ప్రజలను చూసి,
రాళ్ళు రువ్వుతున్నారు..
అధికార పీఠమెక్కిన అసమర్థత బలంతో !
మా ముంబైలో మొన్న ఎగసిన సముద్రపు అలలు !
Tuesday, 28 July 2009
Posted by ప్రభు at 7/28/2009 02:33:00 pmకొద్ది మంది తీరప్రాంత మత్స్యకారుల ఇళ్ళను కూలగొట్టి ఇబ్బంది పెట్టిన హై టైడ్, వాన అనుకున్నంత ఎక్కువగా కురవకపోవడం వల్ల ముంబై వాసులకు శాపం లా కాకపోయేసరికి తీరమంతా ఒక పిక్నిక్ స్పాట్ లా మారిపోయింది !
కుతూహలం ఎక్కువున్న ముంబై ప్రజ, ఇదివరకు 26 నవంబర్ కి ముంబై పై జరిగిన దాడులను ప్రత్యక్షంగా చూసి, యంత్రాంగాన్ని ఎడిపించినట్లే, ఈసారీ పెద్ద సంఖ్యలో తీరం వెంబడి, కుటుంబాలతో సహా, రైన్ కోటులు తొడుక్కొని గొడుగులు పట్టుకొని, అలలు చిమ్మిన మురికి నీటిలో కేరింతలు కొడుతూ తడిచి పరవశించి పోయింది !
ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటిలోనూ ఆనందాన్ని వెతుక్కుంటాము మేమని ప్రపంచానికి చెప్పింది ముంబై !
అప్పటి కొన్ని చిత్రాలు కింద ఇచ్చాను !
ఎందుకు మారం మనం ?
Saturday, 25 July 2009
Posted by ప్రభు at 7/25/2009 11:11:00 amవింత వైవిధ్యం ఈ మానవ మస్తిష్కం !
ఇసుక తిన్నెల నుంచి మేరు పర్వతాల వరకూ..
పిచ్చుక గుంటల నించి లోతైన లోయలు వరకూ..
వాన చుక్కల నుంచి మహా సముద్రాల వరకూ..
చిన్న మొక్కల నుంచి చిక్కని అడవుల వరకూ..
కలిగిన ఈ ప్రకృతి విశాల విశ్వంలో ఒక చుక్కైతే ,
ఒంటరితనం నుంచి సంఘజీవనం వరకూ..
తున్టరితనం నుంచి సంఘేతర శక్తుల వరకూ..
మంచితనం నుంచి మహోన్నత సౌశీల్యం వరకూ..
పిచ్చితనం నుంచి కరిగించే దుహ్ఖం వరకూ..
కదిలించే ఈ మస్తిష్కం మానవదేహంలో ఒక ముక్కయ్యింది !
మన చేతిలో లేదు ప్రకృతి వైవిధ్యం !
మనకు చేతనయ్యింది మస్తిష్క వైవిధ్యం !
ప్రకృతిని మార్చాలని ప్రయత్నిస్తే ప్రళయం !
మస్తిష్కాన్ని మార్చగలిగితే విశ్వశాంతి !
మరి ఎందుకు మారం మనం ?
వస్తున్నారొస్తున్నారు !
Posted by ప్రభు at 7/24/2009 10:04:00 pmవస్తున్నారొస్తున్నారు…
యువకులు కదిలొస్తున్నారు !
చురకత్తులు పదునుపెట్టి…
చురకంచులు చేతబూని…
వస్తున్నారొస్తున్నారు !
వ్యసనంలో మునిగి ఉన్న…
పతనమైన యువతకు…
జగమంటే మత్తుకాదు…
జనమందరి శ్రమఫలం…
అని చెప్పీ, అదిలించీ…
మంచిదారిన పెట్టాలని…
వస్తున్నారొస్తున్నారు !
వస్తున్నారొస్తున్నారు…
యువకులు కదిలొస్తున్నారు !
చురకత్తులు పదునుపెట్టి,
చురకంచులు చేతబూని…
వస్తున్నారొస్తున్నారు !
నీతిలేని పనులనెన్నో..
నియమంగా చేసేవాళ్ళున్నారు…
నిజం చెప్పాలంటే వీళ్ళు…
జాతికే చీడపురుగులు,
వీళ్ళనేరివేయాలని…
కాళ్ళు విరగకొట్టాలని…
వస్తున్నారొస్తున్నారు !
వస్తున్నారొస్తున్నారు…
యువకులు కదిలొస్తున్నారు !
చురకత్తులు పదునుపెట్టి,
చురకంచులు చేతబూని…
వస్తున్నారొస్తున్నారు !
కులమంటూ, మతమంటూ…
కూడుగుడ్డ కడ్డు పెట్టేవాళ్ళూ..
జాలిలేక కొంచమైన …
జగమంతా మింగేవాళ్ళూ..
యువతను కూపస్త మండూకం…
చెయకుండ చూడాలని..
వస్తున్నారొస్తున్నారు !
వస్తున్నారొస్తున్నారు…
యువకులు కదిలొస్తున్నారు !
చురకత్తులు పదునుపెట్టి,
చురకంచులు చేతబూని…
వస్తున్నారొస్తున్నారు !
కష్టపడీ, చెమటోడ్చీ…
కూటికింత పొందలేక,
కర్షకులూ, కార్మికులూ…
క్రుంగిపోవుతున్నారు..
వారందరినీ మేలుకొలిపి,
పోరుకు సిద్దపరచాలని..
వస్తున్నారొస్తున్నారు !
వస్తున్నారొస్తున్నారు…
యువకులు కదిలొస్తున్నారు !
చురకత్తులు పదునుపెట్టి,
చురకంచులు చేతబూని…
వస్తున్నారొస్తున్నారు !
నా మనసు వసుధైక కుటుంబకం !
Posted by ప్రభు at 7/24/2009 10:04:00 pmనా జ్ఞానం బ్రాహ్మణం !
నా వాణిజ్యం వైశ్యం !
నా శ్రమ క్షుద్రం !
నా బాష ఆంధ్రం !
నా జాతి భారతీయం !
నా జన్మ వసుందరం !
నా ఉనికి మానవత్వం !
నా ఆత్మ భాగవంతం !
నా మనసు వసుధైక కుటుంబకం !
శుభోదయం నేస్తం !
Posted by ప్రభు at 7/24/2009 10:03:00 pmకాకి కావ్.. కావ్.. అన్నా…
కూటికోసం కూలి తప్పదు !
గుండె మండిపోతున్నా..
మనసు కరిగి పోతున్నా…
నవ్వు కోసం నువ్వు తప్పవు !
ఈ యాంత్రిక జీవన ఎడారిలో…
సుఖ మరీచికలు ఎన్ని వున్నా..
ఆత్మీయ ఒయాసిస్ నీ మైత్రి !
ప్రియా నీకోసం సముద్రాలు దాటను !
Posted by ప్రభు at 7/24/2009 10:01:00 pmచెలీ నీకోసం పర్వతాలు ఎక్కను !
సఖీ నీకోసం అరణ్యాలు దాటను !
ప్రేయసీ నీకోసం పందేలు ఆడను !
కానీ……..
నీతోటే నేనుంటా !
నీ మాటే నేవింటా !
నీ నవ్వులే పూయనిస్తా !
నీ కలలే పండనిస్తా !
వయస్సు లేని ఆత్మ !
Posted by ప్రభు at 7/24/2009 10:00:00 pmతాను కట్టుకున్న శరీరం మీద ప్రేమతో
రొజూ చూసే తోటి ఆత్మల శరీరాలను
కొత్తగా చూస్తోంది !
అదే పెద్దలు కానీ….
ప్రేమొస్తే గురువా.. దేవా….
ఉలుకొస్తే పశువా… శిశువా.. !
అదే తొటివాడు కానీ…
ఇష్టమైతే ఇంద్రుడా.. చంద్రుడా…
కష్టమైతే ఎర్రోడా.. కర్రోడా !
అదే పిల్లలు కానీ…
ముద్దొస్తే మీదే ఈలొకం రండి… రండి..
మాటొస్తే నాశనమవుతారు పోండి.. పోండి..!
కొన్ని ఆత్మలంతే !
వయసే లేని ఆత్మలకు జ్ఞానమెప్పుడు ?
శరీరాల రంగుతెరలు రాలినప్పుడు !
ఎవరూ చెప్పకండే గంగమ్మకు ....
Posted by ప్రభు at 7/24/2009 09:59:00 pmఆ కొప్పులోని వెచ్చదనం..
శివుని ఆలింగనాన్ని తలపిస్తూ..
కర్తవ్యం మరిపించింది..
భూలోకంలో తననే నమ్ముకున్న..
బిడ్డల దాహార్తి తీర్చాలన్న ధ్యాసే లేదు…
భూమాత చూసింది..
బిడ్డల దాహ బాధ తోపాటు..
వారికి తిండి పుట్టించాల్సిన..
తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ..
నింగిని చూస్తూ బీళ్ళు తడుముతున్న..
రైతన్నలను చూసి కరిగి పోయింది…
సూరన్నతో కలిసి కుట్ర చేసింది…
వేడి పెంచేసింది..
పిల్లల మంచికోసం..
మండిపోయింది..
శివుని కొప్పును మరపించి..
దించింది గంగను కిందికి…
పిచ్చి గంగమ్మ గంతులేస్తోంది..
నెమ్మదిగా దేశం చల్లబడుతోంది..
ఎవరూ చెప్పకండే గంగమ్మకు..
ఇది శివుని కౌగిలి కాదని !
ఆ తల్లిదేవత కింకో బ్రహ్మొత్సవం !
Posted by ప్రభు at 7/24/2009 09:58:00 pmఆ తల్లిదేవత కింకో బ్రహ్మొత్సవం !
పలకని బిడ్డపై అలకలు చూపని,
మరచిన పిల్లలను నిత్యం తలచి.
ఇవ్వడమేగానీ తీసుకోవటం తెలియని,
దేవుని బదులుగా ప్రేమను పంచే.
ఆ కన్నదేవతకేదీ నిత్యోత్సవం !
బిడ్డ అందానికి మొట్టమొదటి సాక్షి,
బిడ్డ నడతకి మొట్టమొదటి గురువు,
బిడ్డ ఆటలకి మొట్టమొదటి నేస్తం ,
బిడ్డ చేతలకి మొట్టమొదటి ముద్దాయి,
ఆ కన్నదేవతకేదీ నిత్యోత్సవం !
కాలి, కాల్చిన సూర్యుడు !
Posted by ప్రభు at 7/24/2009 09:57:00 pmనిద్ర లేచాడు సూర్యుడు,
తన కాంతితో లోకాన్ని
తేజోవంతం చేయాలని,
జరుగుతున్నది చూసి
ఎర్రనైపోయాడు,
బాగుపడండని జనులకు
లేతవెలుగులిచ్చాడు,
మారని జనులజూసి,
ఉగ్రుడైపోయాడు,
అంతకంతకు వెలుగు పెంచి,
వేడెక్కి పోయాడు,
చండ్ర నిప్పులు జిమ్మి,
లొకాన్ని కాల్చాడు
కాల్చినా కరగని
లోకుల్ని చూశాడు,
కరుణకీ లోకంలో,
చోటులేదనుకున్నాడు,
జ్వలించిపోయాడు,
జ్వాలల్ని రేపాడు,
తాళజాలక ప్రజలు,
పరుగెత్త నవ్వాడు,
నవ్వుతూ చూశాడు,
నవ్వలేక ఆగాడు,
ఆగి చూసినవాడు,
చూడలేకపోయాడు,
కాల్చదగినవారు
రక్షణలో ఉండగా,
రక్షించదగినవారు
కాలిపోతున్నారు,
తన వేడికి మాడేది,
పీడితులేనని తెలిసి,
కన్నీరు కార్చాడు,
అలసి, కళ్ళెర్రపడి,
సిగ్గుపడి, పా..రిఫోయి,
దాగాడు సూర్యుడు,
పడమటి కొండల వెనుక
మరువలేను మిత్రమా, మరువలేను !
Posted by ప్రభు at 7/24/2009 09:56:00 pmమరువలేను మిత్రమా, మరువలేను,
మదిలో ముద్రించిన నీ తలపులు,
మమతలు పంచిన నీ మనసును,
మరవమని నీవన్నా, మరువలేను.
ఎంత దూరాన ఉన్నా, ఎక్కడ ఉన్నా,
ఏమి చేస్తున్నా, ఏమీచేయకున్నా,
ఎవరితో ఉన్నా, ఎవ్వరూ లేకున్నా,
ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితీ లేకున్నా,
ఒక్క కడుపున పుట్టకున్నా,
ఒక్కచోట పెరుగకున్నా,
ఒకే చదువు చదువకున్నా,
ఒకే బతుకు బతకకున్నా,
వింతలెన్ని ఎదురైనా,
విత్తమున్నా, లేకున్నా,
విధి మనకే గతి వ్రాసినా,
విడిచి నిన్ను నేనేలోకమేగినా,
మరువలేను మిత్రమా, మరువలేను,
మదిలో ముద్రించిన నీ తలపులు,
మమతలు పంచిన నీ మనసును,
మరవమని నీవన్నా, మరువలేను.
ప్రేమంటే ఏమిటి?
Posted by ప్రభు at 7/24/2009 09:55:00 pmప్రేమను పొందిన ఎంతోమందికిలా,
నాకు గర్వం,
ప్రపంచంలో ప్రేమ నా ఒక్కడి సొత్తేనని,
నాదో భ్రమ,
నాకు గర్వభంగం చేశింది
ఒక్క చిన్న ప్రశ్న - ప్రేమంటే ఏమిటి?
ప్రేమంటే ఏమిటని
నన్ను నేను ప్రశ్నిస్తే,
సమాధానం తోచక
తెల్లమొహం వేసాను,
అవునూ ప్రేమంటే ఏమిటని
నాప్రేయసిని అడిగాను,
తనకూ తెలియదంది,
ఎన్నో రచనలు చదివాను,
ఎందర్నో అడిగాను,
యువకుల్ని, వ్రుద్ధుల్ని,
జంటల్ని, ఒంటరిని,
అందరినీ అడిగాను,
ఉహూ తెలియదనేశారు,
మరి లోకమంతా వ్యాపించిన
ఈ ప్రేమనేది ఎక్కడిది?
ఎవరు కనిపెట్టారు?
ఎందుకు వివరించలేదు?
ఇన్నాళ్ళూ ప్రేమపేరుతో,
జనం చేస్తున్నదేమిటి?
ఎలుగెత్తి అడిగాను,
ఎవ్వరూ చెప్పలేదు,
పిచ్చివాణ్ణయ్యాను,
ప్రేయసికి చెప్పాను,
నాకు ప్రేమంటే తెలియదని,
నేను ప్రేమించట్లేదని,
తనకూ నాకూ ఇష్టమే వారధనీ,
దాన్ని ప్రేమ అనలేనని,
లోకంలో ప్రేమ లేనేలేదనీ,
తనను కూడా ప్రేమించ వద్దని,
విన్నంతనే ఆమె పారిపోయింది,
నన్ను మరిచిపోయింది,
నేనెవరో తెలియదు పొమ్మంది,
పిచ్చివాళ్ళకిక్కడ స్థానం లేదంది,
మంచిగా వెనుకకు మరలిపొమ్మంది,
తలుపు మూసిన చెలిది తప్పుకాదని తలిచి,
తానెక్కడున్నా బాగుంటే చాలనుకొని,
వెనుతిరిగిన నాకు లోకం చీకటై తొచింది,
బ్రతుకు భారమనిపించింది
అడుగు వెయ్యలేక అల్లల్లాడుతూ,
కూలి పోయాను ఆ ఇంటి ముందే,
కడసారి నా చెలికి దీవెనలు చెబుతూ,
గుండెతలుపులు తెరిచి,
కళ్ళు మూసేసాను.
ప్రేమంటే ఏమిటో అప్పుడే తెలిసిన నేను…
ఎంత చిత్రమైనది యవ్వనం ?
Posted by ప్రభు at 7/24/2009 09:53:00 pmఎంత చిత్రమైనది యవ్వనం ?
ప్రతిగుండెను పలకరించి,
తీపి గుర్తులు వదిలివేసి,
ఎటెటో వెళ్ళిపోతుంది !
ఎన్నో ఊహలిస్తూ, ఇంకెన్నో చవి చూపిస్తూ,
నిరంతర వాహినిలా, ప్రేమికులకు వరంగా,
జాగ్రుతం చేస్తూ, జవం లాగేస్తూ,
ఉరకలు వేస్తూ, వెనుచూడక పోతుంది.
వసంతాగమనం, వలపుమయం,
నిరంతరమనుకొని, నిర్లక్షం చేస్తే,
మనకు పొత్తుకుదరదని, వదిలి చక్కా పోతుంది.
20 లో 60 గా ఉండేటి వ్రుద్దులు,
యవ్వనం మనసుకే కానీ వయసుకుకాదని,
60 లో 20 గా ఉండేటి యువకుల
హెచ్చరికను మరిస్తే తిరిగిరాకుండా పోతుంది !
ఎంత చిత్రమైనది యవ్వనం ?
ప్రతిగుండెను పలకరించి,
తీపి గుర్తులు వదిలివేసి,
ఎటెటో వెళ్ళిపోతుంది !
భ్రాంతి కానరా ! బ్రతికిపోవరా !
Posted by ప్రభు at 7/24/2009 09:52:00 pmబాధల వలయం !
భావరాహిత్యం !
బంధువులెవ్వరు ?
భాందవులెవ్వరు ?
భ్రమరం లాంటిది !
బ్రతుకే ఒక భ్రాంతిరా !
లేని తోడుకై,
రాని నీడకై,
చేదు బ్రతుకులో,
తీపిని వెదుకుతు,
తిరుగబోకురా !
తిరిగి రావురా !
ఎండమావిరా,
నేతి బీరరా,
ఎంత చేదినా,
అందని బావిరా,
ఆశ పడకురా !
అంతు లేదురా !
అష్టావక్రమురా,
అంధకారమురా,
బ్రతుకలేవురా,
భావి లేదురా,
భ్రాంతి కానరా !
బ్రతికిపోవరా !
ఏమీ చేయలేని నేను !
Posted by ప్రభు at 7/24/2009 09:51:00 pmనా కలం, నా గళం, నా ప్రాణం,
తహతహమంటుండేవి,
ఏదేదో చేయాలనీ,
లొకాన్ని మార్చాలనీ.
ఎవ్వరూ చూడని నా కలం,
ఎవ్వరూ వినని నా గళం,
ఎవ్వరూ పట్టించుకోని నా ప్రాణం,
ఎందుకనుకొన్నాను,
ఏమీ చేయలేని నేను,
ఇప్పుడు:
నా రాత నాకు పరిమితం,
నా పలుకు నిశ్శబ్ద గీతం,
నా ప్రాణం ఎగిరిపోయిన విహంగం,
నేను జీవచ్చవం,
నా చుట్టూ శూన్యం.
నేను మనిషినేనాఅని ?
Posted by ప్రభు at 7/24/2009 09:50:00 pmనా బిడ్డలు తోటి విద్యార్ధిని రాగింగ్ వంకతో చంపుతుంటే,
నా తమ్ముళ్ళు తోటి బాటసారిని హోలీ వంకతో గుడ్డివాణ్ణి చేస్తుంటే,
నా చెల్లెళ్ళు తొటి మహిళను ఆకలి వంకతొ అమ్ముతుంటే,
నా తల్లిదండ్రులు తొటి మనిషిని స్వార్ధం వంకతో దోస్తుంటే,
నా సహచరులు తోటి మిత్రుని మతం వంకతో తరుముతుంటే,
నా నేతలు తొటి ప్రజలను కులం పేరుతొ వేరుచేస్తుంటే,
నా అంతరాత్మ భయం వంకతో నన్ను నిద్రపుచ్చుతుంటే,
నాకనిపిస్తొంది - నేను మనిషినేనాఅని ?
దేవుళ్ళు మన రైతన్నలు.
Posted by ప్రభు at 7/24/2009 09:49:00 pmసముద్ర నగరం !
Posted by ప్రభు at 7/24/2009 09:48:00 pmచుట్టూ సముద్రం, జనంతొ నిండి.
అలల అందం, అలల హోరు,
మళ్ళీ ఎప్పుడొస్తావని అడుగుతుంటే
జనుల ఆత్రం, జనుల జోరు,
మళ్ళీ ఎప్పుడెళ్తావని తరుముతున్నై.
వాన నీటితో పాటు మురుగునీరు,
కలిసి మహాసంద్రమైతే,
మానవత్వంతో పాటు స్వార్థతత్వం
కలిసి మహానగరమాయె.
లాలూబండి !
Posted by ప్రభు at 7/24/2009 09:46:00 pmలాలూబండి ఎక్కుతుంటే,
తత్కాలంటూ జేబులో చిల్లి పెట్టె,
చక్కటి బెర్తు దొరికిందనే సంబరానికి,
పక్క కిటికీకి మధ్య బెర్తుతో గండి కొట్టె.
సర్లేనని నడుం వాలిస్తే,
బొద్దింకలు స్వేచ్చగా గిలి పెట్టె !
కోయిల కూసిన ప్రతిసారీ ....
Posted by ప్రభు at 7/24/2009 09:43:00 pmకోయిల కూసిన ప్రతిసారీ,
నా మది ఎగిరెగిరి పడుతుంది!
రాబోయేది వసంతమనీ, ఇక మిగిలేది ఆనందమనీ,
నా మది ఎగసెగసి పడుతుంది!
వచ్చిన వసంతం పోతుంది,
మిగిలేది విషాదమని చెబుతుంది.
ఎండిపోయిన తటాకమూ, పండిపోయిన జుట్టూ,
రెక్కలూడిన తూనీగా, బిక్కపోయిన శరీరమూ,
వాడిపోయిన పూలూ, వీడిపోయిన చెలిమీ,
రోసిపోయిన జీవితమూ, బోసిపోయిన నోరూ,
తరిగిపోయిన డబ్బూ, పెరిగిపోయిన జబ్బూ,
చెప్పక చెబుతున్నాయి, వసంతం రాదనీ, విషాదం పోదనీ!
అయినా, కోయిల కూసిన ప్రతిసారీ………..
ఏమిటిది ?
Posted by ప్రభు at 7/24/2009 09:40:00 pmఏమిటీ దారుణం?
ఎందుకీ రక్తదాహం?
ఏమౌతోంది విశ్వం?
కరవౌతోంది కారుణ్యం!
ఎక్కడుంది అనురాగం?
ఎందుకీ ద్వేషం?
ఎటుపోతోంది స్నేహం?
చచ్చిపోతోంది సహనం!
ఎక్కడిదీ కుతంత్రం?
ఎవరిదీ విద్రోహం?
ఏమిచేస్తొంది ప్రభుత్వం?
కానరాకుంది యంత్రాంగం!
ఎంతకీ బేరం?
ఎవరిదీ వాణిజ్యం?
ఎటు వెళ్తోంది ఆదాయం?
చవకైపొతోంది జీవితం!
ఎందుకీ రాజకీయం?
ఎప్పటిదీ బానిసత్వం?
ఎన్నాళ్ళీ అరాచకత్వం?
చెదిరిపోతోంది ప్రజాస్వామ్యం!