మరువలేను మిత్రమా, మరువలేను !

Friday, 24 July 2009

మరువలేను మిత్రమా, మరువలేను,
మదిలో ముద్రించిన నీ తలపులు,
మమతలు పంచిన నీ మనసును,
మరవమని నీవన్నా, మరువలేను.

ఎంత దూరాన ఉన్నా, ఎక్కడ ఉన్నా,
ఏమి చేస్తున్నా, ఏమీచేయకున్నా,
ఎవరితో ఉన్నా, ఎవ్వరూ లేకున్నా,
ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితీ లేకున్నా,

ఒక్క కడుపున పుట్టకున్నా,
ఒక్కచోట పెరుగకున్నా,
ఒకే చదువు చదువకున్నా,
ఒకే బతుకు బతకకున్నా,

వింతలెన్ని ఎదురైనా,
విత్తమున్నా, లేకున్నా,
విధి మనకే గతి వ్రాసినా,
విడిచి నిన్ను నేనేలోకమేగినా,

మరువలేను మిత్రమా, మరువలేను,
మదిలో ముద్రించిన నీ తలపులు,
మమతలు పంచిన నీ మనసును,
మరవమని నీవన్నా, మరువలేను.

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )