మా ముంబైలో మొన్న ఎగసిన సముద్రపు అలలు !

Tuesday, 28 July 2009

ఎందరినో భయపెట్టి , ఆఖరికి బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా బయటి వూరు వాళ్లు రావద్దు అని ప్రకటించేట్లు చేసిన హై టైడ్ ప్రమాదం ఆఖరికి ప్రశాంతంగా ముగిసింది !
కొద్ది మంది తీరప్రాంత మత్స్యకారుల ఇళ్ళను కూలగొట్టి ఇబ్బంది పెట్టిన హై టైడ్, వాన అనుకున్నంత ఎక్కువగా కురవకపోవడం వల్ల ముంబై వాసులకు శాపం లా కాకపోయేసరికి తీరమంతా ఒక పిక్నిక్ స్పాట్ లా మారిపోయింది !
కుతూహలం ఎక్కువున్న ముంబై ప్రజ, ఇదివరకు 26 నవంబర్ కి ముంబై పై జరిగిన దాడులను ప్రత్యక్షంగా చూసి, యంత్రాంగాన్ని ఎడిపించినట్లే, ఈసారీ పెద్ద సంఖ్యలో తీరం వెంబడి, కుటుంబాలతో సహా, రైన్ కోటులు తొడుక్కొని గొడుగులు పట్టుకొని, అలలు చిమ్మిన మురికి నీటిలో కేరింతలు కొడుతూ తడిచి పరవశించి పోయింది !

ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటిలోనూ ఆనందాన్ని వెతుక్కుంటాము మేమని ప్రపంచానికి చెప్పింది ముంబై !

అప్పటి కొన్ని చిత్రాలు కింద ఇచ్చాను !








0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )