ఎందుకు మారం మనం ?

Saturday, 25 July 2009

ఎంత వైవిధ్యం ప్రకృతి సౌందర్యం !
వింత వైవిధ్యం మానవ మస్తిష్కం !


ఇసుక తిన్నెల నుంచి మేరు పర్వతాల వరకూ..
పిచ్చుక గుంటల నించి లోతైన లోయలు వరకూ..
వాన చుక్కల నుంచి మహా సముద్రాల వరకూ..
చిన్న మొక్కల నుంచి చిక్కని అడవుల వరకూ..
కలిగిన ప్రకృతి విశాల విశ్వంలో ఒక చుక్కైతే ,

ఒంటరితనం నుంచి సంఘజీవనం వరకూ..
తున్టరితనం నుంచి సంఘేతర శక్తుల వరకూ..
మంచితనం నుంచి మహోన్నత సౌశీల్యం వరకూ..
పిచ్చితనం నుంచి కరిగించే దుహ్ఖం వరకూ..
కదిలించే మస్తిష్కం మానవదేహంలో ఒక ముక్కయ్యింది !

మన చేతిలో లేదు ప్రకృతి వైవిధ్యం !
మనకు చేతనయ్యింది మస్తిష్క వైవిధ్యం !
ప్రకృతిని మార్చాలని ప్రయత్నిస్తే ప్రళయం !
మస్తిష్కాన్ని మార్చగలిగితే విశ్వశాంతి !

మరి ఎందుకు మారం మనం ?


0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )