వస్తున్నారొస్తున్నారు…
యువకులు కదిలొస్తున్నారు !
చురకత్తులు పదునుపెట్టి…
చురకంచులు చేతబూని…
వస్తున్నారొస్తున్నారు !
వ్యసనంలో మునిగి ఉన్న…
పతనమైన యువతకు…
జగమంటే మత్తుకాదు…
జనమందరి శ్రమఫలం…
అని చెప్పీ, అదిలించీ…
మంచిదారిన పెట్టాలని…
వస్తున్నారొస్తున్నారు !
వస్తున్నారొస్తున్నారు…
యువకులు కదిలొస్తున్నారు !
చురకత్తులు పదునుపెట్టి,
చురకంచులు చేతబూని…
వస్తున్నారొస్తున్నారు !
నీతిలేని పనులనెన్నో..
నియమంగా చేసేవాళ్ళున్నారు…
నిజం చెప్పాలంటే వీళ్ళు…
జాతికే చీడపురుగులు,
వీళ్ళనేరివేయాలని…
కాళ్ళు విరగకొట్టాలని…
వస్తున్నారొస్తున్నారు !
వస్తున్నారొస్తున్నారు…
యువకులు కదిలొస్తున్నారు !
చురకత్తులు పదునుపెట్టి,
చురకంచులు చేతబూని…
వస్తున్నారొస్తున్నారు !
కులమంటూ, మతమంటూ…
కూడుగుడ్డ కడ్డు పెట్టేవాళ్ళూ..
జాలిలేక కొంచమైన …
జగమంతా మింగేవాళ్ళూ..
యువతను కూపస్త మండూకం…
చెయకుండ చూడాలని..
వస్తున్నారొస్తున్నారు !
వస్తున్నారొస్తున్నారు…
యువకులు కదిలొస్తున్నారు !
చురకత్తులు పదునుపెట్టి,
చురకంచులు చేతబూని…
వస్తున్నారొస్తున్నారు !
కష్టపడీ, చెమటోడ్చీ…
కూటికింత పొందలేక,
కర్షకులూ, కార్మికులూ…
క్రుంగిపోవుతున్నారు..
వారందరినీ మేలుకొలిపి,
పోరుకు సిద్దపరచాలని..
వస్తున్నారొస్తున్నారు !
వస్తున్నారొస్తున్నారు…
యువకులు కదిలొస్తున్నారు !
చురకత్తులు పదునుపెట్టి,
చురకంచులు చేతబూని…
వస్తున్నారొస్తున్నారు !
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )