ప్రేమను పొందిన ఎంతోమందికిలా,
నాకు గర్వం,
ప్రపంచంలో ప్రేమ నా ఒక్కడి సొత్తేనని,
నాదో భ్రమ,
నాకు గర్వభంగం చేశింది
ఒక్క చిన్న ప్రశ్న - ప్రేమంటే ఏమిటి?
ప్రేమంటే ఏమిటని
నన్ను నేను ప్రశ్నిస్తే,
సమాధానం తోచక
తెల్లమొహం వేసాను,
అవునూ ప్రేమంటే ఏమిటని
నాప్రేయసిని అడిగాను,
తనకూ తెలియదంది,
ఎన్నో రచనలు చదివాను,
ఎందర్నో అడిగాను,
యువకుల్ని, వ్రుద్ధుల్ని,
జంటల్ని, ఒంటరిని,
అందరినీ అడిగాను,
ఉహూ తెలియదనేశారు,
మరి లోకమంతా వ్యాపించిన
ఈ ప్రేమనేది ఎక్కడిది?
ఎవరు కనిపెట్టారు?
ఎందుకు వివరించలేదు?
ఇన్నాళ్ళూ ప్రేమపేరుతో,
జనం చేస్తున్నదేమిటి?
ఎలుగెత్తి అడిగాను,
ఎవ్వరూ చెప్పలేదు,
పిచ్చివాణ్ణయ్యాను,
ప్రేయసికి చెప్పాను,
నాకు ప్రేమంటే తెలియదని,
నేను ప్రేమించట్లేదని,
తనకూ నాకూ ఇష్టమే వారధనీ,
దాన్ని ప్రేమ అనలేనని,
లోకంలో ప్రేమ లేనేలేదనీ,
తనను కూడా ప్రేమించ వద్దని,
విన్నంతనే ఆమె పారిపోయింది,
నన్ను మరిచిపోయింది,
నేనెవరో తెలియదు పొమ్మంది,
పిచ్చివాళ్ళకిక్కడ స్థానం లేదంది,
మంచిగా వెనుకకు మరలిపొమ్మంది,
తలుపు మూసిన చెలిది తప్పుకాదని తలిచి,
తానెక్కడున్నా బాగుంటే చాలనుకొని,
వెనుతిరిగిన నాకు లోకం చీకటై తొచింది,
బ్రతుకు భారమనిపించింది
అడుగు వెయ్యలేక అల్లల్లాడుతూ,
కూలి పోయాను ఆ ఇంటి ముందే,
కడసారి నా చెలికి దీవెనలు చెబుతూ,
గుండెతలుపులు తెరిచి,
కళ్ళు మూసేసాను.
ప్రేమంటే ఏమిటో అప్పుడే తెలిసిన నేను…
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )