నిద్ర లేచాడు సూర్యుడు,
తన కాంతితో లోకాన్ని
తేజోవంతం చేయాలని,
జరుగుతున్నది చూసి
ఎర్రనైపోయాడు,
బాగుపడండని జనులకు
లేతవెలుగులిచ్చాడు,
మారని జనులజూసి,
ఉగ్రుడైపోయాడు,
అంతకంతకు వెలుగు పెంచి,
వేడెక్కి పోయాడు,
చండ్ర నిప్పులు జిమ్మి,
లొకాన్ని కాల్చాడు
కాల్చినా కరగని
లోకుల్ని చూశాడు,
కరుణకీ లోకంలో,
చోటులేదనుకున్నాడు,
జ్వలించిపోయాడు,
జ్వాలల్ని రేపాడు,
తాళజాలక ప్రజలు,
పరుగెత్త నవ్వాడు,
నవ్వుతూ చూశాడు,
నవ్వలేక ఆగాడు,
ఆగి చూసినవాడు,
చూడలేకపోయాడు,
కాల్చదగినవారు
రక్షణలో ఉండగా,
రక్షించదగినవారు
కాలిపోతున్నారు,
తన వేడికి మాడేది,
పీడితులేనని తెలిసి,
కన్నీరు కార్చాడు,
అలసి, కళ్ళెర్రపడి,
సిగ్గుపడి, పా..రిఫోయి,
దాగాడు సూర్యుడు,
పడమటి కొండల వెనుక
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )