మనం మోసే కుళ్ళు దుంపల బరువెంత ?
Sunday, 10 October 2010
Posted by ప్రభు at 10/10/2010 08:03:00 pm
ఒక నర్సరీ టీచర్ తన క్లాస్ లోని పిల్లలను దగ్గరకు పిలిచి " పిల్లలూ రేపటి నుంచీ మనం ఒక ఆట ఆడుదాం సరేనా ? " అన్నారు.
" బలే.. బలే.. సరే మేడం." అన్నారు పిల్లలంతా సంబరంగా చప్పట్లు కొడుతూ.
" అయితే మీరంతా తలా ఒక ఒక సంచి, కొన్ని బంగాళా దుంపలూ తీసుకురావాలి. ఒక్కో బంగాళా దుంప కూ మీకిష్టం లేని వాళ్ళ పేరు పెట్టాలి. అంటే మీకేంతమంది మీద అయిష్టం ఉందో అన్ని బంగాళా దుంపలు తేవాలి అన్నమాట." ఆట ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ చెప్పారా టీచర్..
రెండో రోజు పిల్లలంతా ఒక్కో సంచిలో బంగాళా దుంపలతో, కొత్త ఆట ఆడబోతున్నాం అనే ఆనందంలో క్లాస్ కి వచ్చారు. కొందరు 2 దుంపలు తెస్తే కొందరైతే 3 ఇంకొందరు 5 దుంపల దాకా కూడా తెచ్చారు.
" పిల్లలూ మీరంతా ఇలా ఈ సంచిలో బంగాళా దుంపలను రోజంతా మీతోనే ఉంచుకోవాలి. మీరెక్కడికి వెళితే అక్కడికి అంటే టాయ్లెట్ కి వెళ్ళినా వెంట తీసుకు వెళ్ళాలి. అర్థం అయ్యిందా ? " ఆట నియమాలు చెప్పేశారు టీచర్.
ఇలా ప్రతి రోజూ టీచర్ చెప్పినట్లు ఆ సంచి మోస్తూ పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు. దుంపలు కుళ్ళి " వాసనేస్తోంది టీచర్ " అని కంప్లైంట్ కూడా చేసారు. అయినా ఆపకుండా ఆ ఆట ఆడించారా గురువుగారు. ఆ కంపు భరిస్తూ, బరువులు మోస్తూ పిల్లలంతా దిగాలుగా ఉండసాగారు కొందరి దగ్గర మరీ 5 దుంపలు ఉనాయయ్యే. కొన్నాళ్ళు గడిచినాక ఆట అయిపోయిందని టీచర్ చెప్పగానే పిల్లలందరూ వెళ్లి దుంపల సంచులు బయట పారేసి వచ్చారు. " మీ మీ అనుభవాలు చెప్పండి." అన్న టీచర్ మాటతో పిల్లలందరూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ బరువు , కంపు వెంట తీసుకు వెళ్ళడంలో తాము పడ్డ పాట్లు వివరించారు. "మాకైతే కొందరి మీద అయిష్టం తగ్గి పోయి దుంపలు తగ్గించాలని అనిపించినా టీచర్ చెప్పారని అలానే మోశాము. " అని కూడా చెప్పారు.
" అవును కదూ పిల్లలూ ? మీరు ఈ కొద్ది రోజులు మోసిన ఈ కుళ్ళు బంగాళా దుంపలకూ, మీ మనస్సులో మోసే ఇతరుల పట్ల ద్వేషానికీ ఏ విధమైన తేడా లేదు. మీరు మోసిన దుంపలు కుళ్ళి వాసన వచ్చినట్లే. ఇతరుల పట్ల ద్వేషం మీ మనసును కలుషితం చేస్తుంది. దాన్ని మీరు వెళ్ళిన ప్రతి చోటికీ మీరు మోసుకు వెళ్తూనే ఉంటారు. కాసిని దుంపలను ఒక వారం రోజులే మొయలేకపోయారే మరి జీవితకాలం ద్వేషం మోయడం ఎంత కష్టమో ఊహించ గలరా ? అంటే మనం ఇతరులను ద్వేషిస్తే మన మనస్సు పాడవుతుంది. మన మనస్సు పాడయితే మన బ్రతుకు పాడవుతుంది. ఇతరులను ద్వేషించడం పాపమయితే, ఇతరులను ప్రేమించడం పుణ్యం అన్నమాట. మరి మీరు ద్వేషాన్ని వదిలేస్తారు కదూ ? " అడిగారా టీచర్.
పిల్లలందరూ ఇంకెప్పుడూ ఎవరినీ ద్వేషించమని ఒక్కమాటగా చెప్పారు.
ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా ఆడాల్సిన ఆటే కానీ, బస్తాలుబస్తాల దుంపలు మోసే శక్తి ఎందరికి ఉంటుందంటారు ?
కనిపించకుండా మనం మనస్సులో మోస్తున్న కుళ్ళు దుంపల బరువెంత ?

పరీక్ష తప్పిన ప్రొఫెసర్ గారు !
Friday, 8 October 2010
Posted by ప్రభు at 10/08/2010 02:19:00 pm
ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు తన విద్యార్థులకు ' సంస్థలలో లాజిక్ ' గురించి చెప్పి టెస్ట్ పెట్టారు. అందులో ఫెయిల్ అయిన ఒక విద్యార్ధి ప్రొఫెసర్ గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు : " సార్ మీరు నా పేపర్ కి ' ఏ ' గ్రేడ్ ఇవ్వకపోవడం అన్యాయం."
" మరి నువ్వు రాసినదాన్ని బట్టి చూస్తే నీకు అస్సలు విషయం అర్థమైనట్లే లేదు. " కోపంగా అన్నారా ప్రొఫెసర్.
ఈ కుర్రాడు కూడా తగ్గకుండా " అంటే మీకు విషయం పూర్తి గా అర్థం అయ్యిందంటారు ? " అని రెట్టించాడు.
" అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపొతే నేను ప్రొఫెసర్ని ఎలా అవుతాను ? ' అన్నారు ప్రొఫెసర్ గారు కూడా తగ్గకుండా.
" అంతేనంటారు ? సరే అలా అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. దానికి మీరు సమాధానం చెప్పగలిగితే మీరు నాకిచ్చిన మార్కులను ఒప్పుకుని వెళ్ళిపోతాను. కానీ ఒకవేళ మీరు సమాధానం చెప్పలేక పొతే నా పేపర్ కు ' ఏ ' గ్రేడ్ ఇవ్వాల్సిందే. సిద్ధమేనా సార్ ? " చాలెంజ్ చేసాడు కుర్రాడు.
క్లాసులో అందరి ముందూ అలా అడిగేసరికి, ఉక్రోషం పట్టలేకో, ఈ పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అనుకునో, తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి వెంటనే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక " సరే నేను ఒప్పుకుంటున్నాను. నీ ప్రశ్న ఏదో అడుగు. " అన్నారు ప్రొఫెసర్ ధీమాగా.
అయితే చెప్పండి సార్. ఏది ' లీగల్ ' అయినా ' లాజికల్ ' కాదు ; ' లాజికల్ ' అయినా , లీగల్ కాదు ; అటు ' లాజికల్' కానీ , ఇటు ' లీగల్ ' కానీ కాదు ? " అడిగేసాడు కుర్రాడు ఉత్సాహంగా.
ఒక్కసారిగా బుర్ర తిరిగిపోయినంత పని అయ్యింది ప్రొఫెసర్ గారికి చాలాసేపు అలోచించినా జవాబు తట్టక చచ్చినట్లు ఆ స్టూడెంట్ పేపర్ కి ' ఏ ' గ్రేడ్ ఇచ్చేసారు. తరువాత తన శిష్యులు అందరిలోకీ తెలివైన వాడిని తన గదికి పిలిపించుకొని ఆ ప్రశ్నకు తనకేమైనా సమాధానం తట్టిందేమో అని కూపీ తీసారు ప్రొఫెసర్ గారు.
ఆ విద్యార్ధి వెంటనే సమాధానం ఇచ్చాడు " సార్! మీ వయసు 65 , మీ శ్రీమతి వయసు 35. ఇది లీగలే కానీ లాజికల్ కాదు. అయితే మీ శ్రీమతికి 25 ఏళ్ళ వయసున్న ప్రేమికుడున్నాడు. ఇది లాజికలే కానీ లీగల్ కాదు. మీరేమో తప్పాల్సిన మీ శ్రీమతి ప్రేమికుడికి ' ఏ ' గ్రేడ్ ఇచ్చారు. అదేమో అటు లీగలూ కాదూ, ఇటు లాజికలూ కాదు."

నన్ను దేవుడంటూ ఉంటారు మీరు !
Thursday, 7 October 2010
Posted by ప్రభు at 10/07/2010 04:37:00 pmనా దూతల్ని మీకు దారిచూపమని పంపాను !
అయినా మీరు మారలేదు, మీ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు !
నాకు కోపం వచ్చి మీమీదకు మరణమనే మొసలిని పంపినా ,
మీ మీద జాలి వేసి మీ కడుపు నింపి జోకోట్టినా ,
ఒక్కటి మాత్రం నిజం. అదేమిటంటే మీ మీద నాకు అత్యంత ప్రేమ !
మీకోసం ఎప్పుడూ బహుమతులు తేవడం నాకిష్టం !
నన్ను వెతుకుతూ చాలామంది కైలాసపర్వతం వరకూ కూడా వెళ్తారు !
కొందరు ధ్యానం, యోగం చేస్తూనో, గాయత్రి లాంటి మంత్రాలు చదువుతూనో నన్ను చూడగలిగాం అంటారు !
కొందరు నాకు ఒకే రూపం ఉందని చెప్పడానికి ప్రయత్నించారు !
ఇలా వాళ్ళకిష్టమైన రూపం నాకిస్తూ, నన్ను దేవుడని చెప్పి పూజిస్తుంటారు ఎంతోమంది !
నన్ను ఎవరు ఏ పేరు తో పిలిచినా, నాకు మాత్రం నన్ను ప్రకృతి గా గుర్తించడమే బాగుంటుంది !
మీరందరూ ఒకరినొకరు నాశనం చేసుకోకుండా కలిసి బ్రతకడమే, మీరు నాకివ్వగలిగిన అమూల్యమైన బహుమతి !
ఇస్తారు కదూ ?
అంటే మన కళ్ళు మనని మోసం చేయట్లేదంటారా ?
Posted by ప్రభు at 10/07/2010 02:04:00 pm![]() |
ముద్దు పెడుతున్న ముద్దుగుమ్మా ? ముద్ద పెడుతున్న పక్షి అమ్మా ?
ఇవి చలనం లేని వృత్తాలేనా ?
విరిసిన సుమం పై సీతాకోకచిలుకా ? మత్తైన పెదవులపై బుల్లి నాసికా ?
అవి గుండ్రటి వృత్తాలే కదూ ?
ఈ పిన్నుల బంతి తిరగట్లేదంటే మది నమ్మదే ?
చాక్లెట్ సుడిగుండం లో చిక్కిన చాక్లెట్ పాపను కాపాడతారా ?
సరదాగా మిత్రులు పంపిన చిత్రాలు మీకు చూపించాను కానీ ఇందులో మన ప్రతాపం ఏమీ లేదండోయ్ !
సుబ్రమణ్యం మళ్ళీ సిగరెట్లు మానేసాడు !
Wednesday, 6 October 2010
Posted by ప్రభు at 10/06/2010 09:01:00 pm
సిగరెట్లు త్రాగటం ఎలా మానాలి ? ఎలా మానాలి ? ఎలా మానాలి అని టీవీ సీరియల్లో లాగా మూడు మూడు సార్లు అనుకుంటూ బుర్రమీద మిగిలిన గుప్పెడు వెంట్రుకలూ గట్టిగా పీక్కుంటూ ఆలోచించినా అర్ధం కాక బెంగ పెట్టేసుకుంటున్నాడు సుబ్రమణ్యం.
దానితో బుర్ర వేడెక్కి రోజుకన్నా ఎక్కువ సిగరెట్లు తాగేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం శ్రీమతికి ఈయన వ్యవహారం చూసి భయం వేసింది.
" మీరు సిగరెట్లు మానలేకపోతే పోనీయండి కానీ ఇలా ఉన్న కాస్త జుట్టూ పీకేసుకుని అరగుండులా ఉండే మీరు గుండులా అయిపోయి తరవాతచేయరానిదేదైనా చేసేస్తే నా మంగల్యానికేదీ దిక్కు ? " అదేదో దిక్కుమాలిన సీరియల్ లోని హీరోయిన్ లాగా కళ్ళలో నీళ్ళు కాలువలా కార్చేసింది.
" అస్సలే బుర్రతిరిగి నేనేడుస్తుంటే నీ ఏడుపెంటీ నన్ను నా మానాన వదిలేసి అటుపో " అని అరిచేసి పీక్కుని చేతిలో పట్టుకున్న జుట్టు సిగరేట్టనుకుని నోట్లో పెట్టుకుని వెలిగించుకుని మూతి కాలి బావురుమన్నాడు సుబ్రమణ్యం.
అస్సలు సిగరెట్లు మానేయాల్సి వస్తుందని కానీ, మానడం ఇంత కష్టమని కానీ అనుకుంటే ఈ వెధవ సిగరెట్లు తాగడం మొదలు పెట్టేవాడు కాదు సుబ్రమణ్యం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే కాలం లోనే, వాళ్ళ నాన్న త్రాగే దున్నపోతు బ్రాండ్ ( ఆ కాలంలో ఆ బ్రాండ్ ఘాటు గురించి గొప్పగా చెప్పుకుంటూ దాన్ని ప్రేమగా అలానే పిలుచుకునేవారులెండి ) కార్టన్లు కార్టన్లుగా దాచుకున్న సిగరెట్ ప్యాకెట్ లలోంచి ఒక పాకెట్ చొప్పున దొంగిలించి బొడ్డూడని మిత్రులతో కలిసి చెరువు గట్టు మీద రింగులు రింగులుగా గుప్పు గుప్పు మని పొగ ఊదుతూ సిగరెట్లు మానాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు సుబ్రమణ్యం
హిందీ సినిమాలలో శత్రుఘన్ సిన్హాలాగా, దక్షిణాదిన అప్పుడప్పుడే కొత్తగా వస్తూన్న రజనీకాంత్ లాగా స్టయిల్ గా హెర్క్యులిస్ సైకిల్ మీద చేతులు వదిలేసి తమ కాలేజ్ అమ్మాయిలకు సైటు కొట్టేటప్పుడు కూడా సిగరెట్ల వల్ల తనకు అనారోగ్యం చుట్టుకుంటుందని ఎప్పుడూ ఊహించలేదు.
పెళ్లైనాక కొత్త పెల్లికూతురుగా ఇంట్లోకి అడుగు పెట్టిన రాజ్యం కూడా స్టయిల్ గా సిగరెట్ తాగుతున్న మొగుడిని ఎడ్మైరింగ్ గా చూస్తూ అడ్డు చెప్పకపోవడమూ, తన చేతులతోనే సుబ్రమణ్యం నోట్లో సిగరెట్ కి అగ్గిపుల్ల గీసి వెలిగించి ఇస్తూ ఉండటమూ చేసే సరికి సుబ్రమణ్యం రెచ్చిపోయాడు. పైగా ఇదివరకులా జామాకులు నమలడమో, కిళ్ళీ తినడమో, చింగం నమలడమో చేసి వాసన దాచుకోవాల్సిన అవసరం లేకపోయే సరికి రోజుకు ఒక్క పాకెట్ తాగేవాడు కాస్తా ఇప్పటికి రోజుకి ఆరేడు పాకెట్ల సిగరెట్లు తాగే స్టేజ్ కి చేరిపోయాడు.
పెరిగిన దగ్గూ, పడుతున్న కళ్లె లో పెరుగుతున్న ఎరుపూ సుబ్రమణ్యం ను పేరు మోసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు పరిగేట్టిన్చేసాయి.
" నువ్వు సిగరెట్లు తాగడం మానేయకపోతే నీ ఊపిరితిత్తులు మటుమాయం అయిపోయి నువ్వుకూడా 'డాం' అనడం ఖాయం ", అని డాక్టర్ గారు చెప్పిన దగ్గరి నుంచీ సిగరెట్లు మానడం ఎలా అనే విషయం మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు సుబ్రమణ్యం.
" ఎన్నాళ్ళ నుంచో తాగుతున్నావు కాబట్టి ముందు కొద్ది కొద్దిగా తగ్గించితే ఇబ్బంది లేకుండా మానేయోచ్చు ", అని ఎవరో చెబితే ఒకరోజు తగ్గించేయడమూ, మళ్ళీ రెండోరోజు నిన్నతగ్గించిన కోటా కూడా కలుపుకొని పెంచేయడమూ జరిగింది.
" ఇలా కాదు నువ్వు సిగరెట్లు తాగడం మానేస్తున్నట్లు అందరికీ చెప్పు, ఆ తరువాత మానేయకపోతే అందరూ నవ్వుతారని చచ్చినట్లు మానేస్తావని ", ఎప్పుడూ పాన్ పరాగ్ నమిలే బావగారు చెబితే, ఇదేదో బాగుందనుకుని ఒక మంచి రోజు చూసుకుని " నేను సిగరెట్లు తాగడం మానేస్తున్నానోచ్ ", అని ప్రకటించేసాడు. ఎలాగూ మానేస్తున్నాను కదా అని అమెరికా నుంచి మేనల్లుడు ప్రేమతో కొనితెచ్చిన సిగరెట్ లైటర్ ను ఫ్రండ్ కి ఇచ్చేసాడు సుబ్రమణ్యం.
కానీ ప్రకటించిన కాస్సేపటికే నాలుక పిడచకొట్టుకు పోయినట్లూ, లాగేస్తున్నట్లూ ఫీలైపోయి గబ గబా బడ్డీకొట్టుకి వెళ్లి సిగరెట్టు కొని ముట్టించేసాడు. " ఇంక మానలేను కానీ నా లైటర్ నాకివ్వు ", అని ఫ్రండ్ ని అడిగితే, " అస్సలు నువ్వు దగ్గర సిగరెట్, సిగరెట్ లైటర్ లు పెట్టుకోకుండా, తాగాల్సి వచ్చినప్పుడల్లా బడ్డీ కొట్టుకు వెళ్లి తాగుతుంటే కూడా సిగరెట్లు మానేయోచ్చు ", అని హింటిచ్చాడు లైటర్ వాపస్సివడం ఇష్టం లేని ఆ స్నేహితుడు.
ఇదీ బాగానే ఉందనుకుని కొన్నాళ్ళు అలానే చేసాడు, కానీ " మాటి మాటికీ బడ్డీ కొట్టుకు వెళ్ళటం మానెయ్యకపోతే మేమో ఇవ్వాల్సి వస్తుంది ", అని బాస్ వార్నింగ్ ఇవ్వడం, పైగా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పెట్టడం వల్ల మళ్ళీ ఇదివరకులానే సిగరెట్ పెట్టె, కొత్త లైటర్ తో తిరగడం మొదలు పెట్టాడు సుబ్రమణ్యం.
ఇలా మానేయడమూ, మొదలెట్టడమూ ప్రహసనంలా అయిపోయి కొలీగ్స్ అందరూ " సుబ్రమణ్యం మాటంటే మాటే. ప్రతిరోజూ మాట మార్చే రకం కాదు మా సుబ్రమణ్యం. చూడండి ప్రతిరోజూ ఒకే మాట చెబుతాడు, 'రేపటినుంచీ సిగరెట్లు తాగనని' " అంటూ సెటైర్లు వెయ్యడం మొదలు పెట్టారు.
మూతి కాల్చుకున్న మొగుడిని చూసి బెంబేలు పడిపోయిన రాజ్యం పక్క వీధిలో ఉన్న వాళ్ళ బాబాయిని పిలిచి విషయం చెప్పి ముక్కు చీదేసింది.
" నువ్వూరుకో తల్లీ ఇంత చిన్న విషయానికి ఇలా తల్లడిల్లిపోతే ఎలా ? నేనున్నానుగా ? ", అని రాజ్యానికి భరోసా ఇచ్చి కాలిన మూతిని అద్దంలో చూసుకుంటూ బర్నాల్ రాస్తున్న సుబ్రమణ్యం వేపు తిరిగాడు రాజ్యం వాళ్ళ చలమయ్య బాబాయ్
" ఏమిటోయ్ సుబ్రమణ్యం, నువ్వు మరీనూ ? పెళ్లైనప్పుడు హ్రితిక్ రోషన్ లా రింగుల జుట్టుతో ఉండేవాడివి, ఇలా రాకేశ్ రోషన్ లా అయిపోయావేమిటీ ? "
జోకులు భరించే ఓపిక లేదు మామయ్యగారూ, నవ్వులాటై పోయింది నా బ్రతుకు. నా బాధ ఎవరికి చెప్పుకోను ? ", అని ఏఎన్నార్ లెవల్ లో గొంతు దగ్గర గుండీ సరిచేసుకున్నాడు సుబ్రమణ్యం.
" పిచ్చివాడా ! అస్సలు సిగరెట్లు తాగడం మానాలంటే అన్నిటికన్నా ముందు నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. ఒక విషయం చెప్పు ఎవరి ముందయినా సిగరెట్లు తాగాలంటే సంకోచిస్తావా ? " అడిగాడు చలమయ్యగారు.
" భలేవారే మామయ్యగారూ, మీ ముందు ఎప్పుడైనా సిగరెట్ తాగానా ? నాకు పెద్దలంటే గౌరవం. మావేపు కానీ, రాజ్యం వేపు కానీ పెద్దలముందు ఎప్పుడూ తాగలేదు, తాగను. అలాగే మా సీనియర్ల ముందు కానీ, పై ఆఫీసర్ల ముందు కానీ తాగను. " బర్నాల్ నేప్కిన్ తో తుడుచుకుంటూ చెప్పాడు సుబ్రమణ్యం.
" ఇంకే, ఇప్పుడు నువ్వు సిగరెట్లు మానెయ్యడం చాలా సులువు. నువ్వు చెయ్యవలిసిన మొదటిపని నీ మనసులో సిగరెట్లు మానాలనే దృఢమైన కోరిక ను పెంచుకోవడం. తరువాత ఇన్నాళ్ళుగా తాగి మానుతున్నావు కాబట్టి కొంత ఇబ్బంది కలుగుతుంది అంటే కడుపులో నొప్పి రావొచ్చు, వాంతులయ్యేలా అనిపించొచ్చు, భరించలేని తలనొప్పి రావొచ్చు" అయినా సరే నేను మళ్ళీ సిగరెట్లు తాగను ఎందుకంటే నేను మానేసాను కాబట్టి , ఈ ఇబ్బందులు భరిస్తాను ", అని పదే పదే నీ మనసుకు చెప్పుకోవాలి. ఇంక " పెద్దల ముందు తాగకుండా ఉండ కలను కాబట్టి ఎప్పుడూ కూడా తాగ కుండా ఉండ గలను ", అని ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి. ఇలా నిన్ను నువ్వు తయారు చేసుకుంటే నువ్వు జన్మలో మళ్ళీ సిగరెట్లు తాగలేవు. " గీతోపదేశం చేసాడు చలమయ్యగారు.
" అంతేకాదమ్మాయీ, నువ్వుకూడా కొన్ని నెలలు మీ ఆయనకు తోడుగా నిలబడాలి. కొత్తలో సిగరెట్లు తాగకపోవడం వల్ల వచ్చే అసహనం వల్ల, లేదా తలనోప్పీ, కడుపునోప్పీ, వామిటింగ్ సెన్సేషన్ ల వల్ల సుబ్రమణ్యం కు కోపం రావడమూ, తిక్క తిక్క గా ప్రవర్తించడమూ ఉంటాయి కాబట్టి, నువ్వు శాంత మూర్తిలా ఉండి అతనికి సాయ పడాలి. అనవసరమైన వాదులాటలు లేకుండా అతనిని సాధ్యమైనంతగా బిజీగా ఉంచితే మీ ఆయన సిగరెట్లు మానేస్తాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. " చెప్పాడు చలమయ్యగారు.
భార్యాభర్తలు ఇద్దరూ ఆరోజు చలమయ్యగారికి చక్కని విందు భోజనం పెట్టి కృతజ్ఞతలు చెప్పుకుని, రేపటినుంచీ ఇంక నో సిగరెట్లని చలమయ్యగారికి ఒట్టేసి చెప్పి, చలమయ్యగారిని సాగనంపారు.
సో సుబ్రమణ్యం మళ్ళీ సిగరెట్లు మానేసాడు !

యింక ఆ రోజు నుంచీ మా రాజబాబు వాకింగ్ మానేసాడు.
Tuesday, 5 October 2010
Posted by ప్రభు at 10/05/2010 03:48:00 pm
ఆరోగ్యం బాగా ఉండట్లేదని కొన్నాళ్ళ క్రితం ఒక ప్రకృతి చికిత్సాలయం లో ఒక మూడు వారాలు ఉన్నాను. ఆ సమయం లో చాలా మంది విభిన్న మనస్తత్వాలు ఉన్న వాళ్ళను చూసాను. ఆశ్రమం లోనికి అడుగు పెట్టగానే ముందు వాళ్ళు అడిగిన ప్రశ్న" మీ దగ్గర ఏదైనా తిండి పదార్ధాలు కానీ, పానీయాలు కానీ, సిగరెట్లు కానీ, మద్యం కానీ ఉన్నాయా ? " అని. నవ్వు వచ్చింది ' అంటే అలా తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారన్నమాట ' అనిపించింది. ఏమీ లేవని చెబితే చెక్ చెయ్యలేదు కానీ, " ఎప్పుడైనా ఉన్నట్లు తెలిస్తే గురువు గారికి కోపం వస్తుంది. మంచిది కాదు " అని చెప్పారు. " మీకు ఏ విధమైన అవసరాలున్నా మాకు చెప్పాలి డబ్బులిస్తే అవి ఆశ్రమ నియమానికి ఇబ్బంది కాకపొతే తెచ్చిపెడతాము కానీ మీరు ఎట్టి పరిస్తితులలోనూ బయటకు వెళ్ళటానికి కుదరదు " అని చెప్పారు. సంతోషం అనిపించింది. ' ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది ? ' అనుకున్నాను.
ఒక్క వార్తా పత్రికలు తప్ప మిగతా బయటి ప్రపంచంతో కావాలని సంబంధాలు కట్ చేసుకోవడం వల్ల సమయమే సమయం. పచ్చని మొక్కలతో, రంగు రంగుల పూలతో పళ్ళతో నిండిన చెట్లతో. వేడి అన్నదే లేక ఒక హిల్ స్టేషన్ లో ఉన్నామేమో అనిపించేలా ఉన్న వాతావరణం. చెట్ల కిందా, రూము ఎదురుగా ఎక్కడ చూసినా బుట్ట ఉయ్యాలలూ, బల్ల ఉయ్యాలలూ, రణగొణ ద్వనికి దూరంగా ప్రశాంతమైన పరిసరాలు మళ్ళీ బ్రతుకు మీద ఆశలు పెంచేస్తూ, ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండును ఇక్కడ అనిపించేది. ఉగాది ముందు సమయమేమో కోయిలల కుహు కుహూలూ, పక్షుల కిల కిలలూ సంగీత ధ్వనులుగా అనిపిస్తూ యాంత్రిక మైన నగర జీవితంలో ప్రకృతికి దూరమై ఎంత నష్టపోతున్నామో గుర్తు చేసింది. కాఫీ టీ ల బదులు తీసుకుంటున్న చెరుకు రసమూ, కూరగాయల రసాలు అమృతం లా తోచేవి. యోగాసనాలు కొత్తలో శరీరానికి ఇబ్బంది అనిపించినా అలవాటైన తరువాత చాలా మందికి వ్యసనంలా మారిపోయాయి. నాకు వచ్చిన అనారోగ్యం వల్ల యోగాసనాలకు నేను దూరంగా ఉండాల్సిరావడం కొంత బాధగానే అనిపించింది.
ఇంత ఆహ్లాదకర వాతావరణంలో నేను చేరిన రోజే రాజబాబు కూడా చేరాడు. చక్కటి కుండ లాంటి బొజ్జ తప్ప వేరే ఏమీ ఇబ్బందులు ఉన్నట్లు అనిపించలేదు. నా వయసులో సగం ఉన్నా చక్కగా స్నేహపూర్వకంగా కలిసిపోయాడు. అతనికి ఉన్న అలవాటు ఏమిటంటే సందు దొరికితే వాక్ మాన్ లో పాటలు వింటూ, చింగం ( చూయింగ్ గమ్ ) నమిలేస్తూ, ఆశ్రమం రోడ్లమీద చక చకా వాకింగ్ చేస్తూ ఉండటం. " నేను ఇక్కడ ఒక 60 లేదా 90 రోజులుంటాను అంకుల్. ఈ లోపు నా బొజ్జ కరిగించేసుకోకపోతే నాకు పెళ్లి కావడం కష్టం అని డాడీ బలవంతం మీద పంపించారు. తగ్గకపోతే ఇంకా ఉండాల్సి వస్తుందేమో అని నడిచేస్తున్నాను " అనేవాడు అతను. " మరి ఇంత యాక్టివ్ గా ఉండేవాడికి ఇంత బొజ్జ ఎక్కడినుంచి వచ్చిందయ్యా ? " అంటే. " ఇంట్లో ఉన్నవాళ్ళందరూ నేతిలో ముంచిన అన్నం ముద్దలు తినిపించీ, స్వీట్లు నోట్లో కుక్కి సహాయం చేస్తే, డబ్బులెక్కువై రోజూ మందు, ముక్క లాగించేసి పెంచేసాను అంకుల్ " అనేవాడు. " మరి ఆ లైఫ్ స్టైల్లోంచి బయట పడక పొతే బొజ్జ మళ్ళీ వచ్చేస్తుంది కదా ? " అంటే. " యింక డిసైడ్ చేసేసాను అంకుల్ పూర్తిగా మారి పోయాను. " అనేవాడు. అతని తో పాటు అతని రూంమేట్, నా రూంమేట్ కూడా పిల్లలే అయినా నాతో సరదాగా ఉండే వాళ్ళు.
ఒక రోజు నా రూం మేట్ సురేష్ " అంకుల్ మీకు తెలుసా రాజబాబు అంత వాకింగ్ ఎందుకు చేస్తుంటాడో? " అని అడిగాడు. " బొజ్జ తగ్గటానికి. " అంటే, " కాదంకుల్ ఆ వంకన దూరంగా ఉన్న పసరు, బురద స్నానాల ప్లేస్ కి వెళ్లి దమ్ము కొట్టి వస్తుంటాడు. " అని చెప్పాడు. ' అదన్నమాట చింగం నమలటం లో ఉన్న రహస్యం వాసన పోగొట్టడం కోసం చింగం.' ఆశ్రమంలో రోజు కూలీకి పని చేసే వ్యక్తులకు చిన్న చిన్న లంచాలిచ్చి తెప్పించుకుంటూ ఉన్నాడనీ , తెలిసినప్పటినుంచీ గురువుగారికి చెబుతాం అని ఏడిపిస్తున్నామనీ చెప్పాడు సురేష్. యింక తగ్గించేస్తాననీ, గురువుగారికి చెప్పొద్దనీ బతిమాలుకునేవాడుట రాజబాబు. . నాకు కూడా విషయం తెలిసిపోయినట్లు తెలిసి కొద్దిగా గిల్టీగా తప్పుకు తిరిగే వాడు రాజబాబు.
కొన్నాళ్ళు గడిచినాక మళ్ళీ సురేష్ నాతో మాట్లాడుతూ, " అంకుల్ ఇవ్వాళ రాజబాబు గురువుగారికి దొరికిపోయాడు." అని చెప్పాడు. " ఏమయ్యిందీ " అంటే పొద్దున్నే మట్టి స్నానాల దొడ్డి లో దాక్కుని దమ్ము కొడుతుంటే, ఉదయమే వాకింగ్ కి వెళ్ళిన గురువుగారికి ఆ దొడ్డిలోంచి పొగ గుప్పు గుప్పున వస్తూ కనిపించి ' ఇప్పుడు ఇక్కడెవరూ ఉండరే ఈ పొగ ఏమిటబ్బా' అని అనుమానించి లోపలి వెళ్తూ అక్కడ ఏదో రిపేర్ పని చేస్తున్న కుర్రాడితో మాట్లాడటం విని రాజబాబు సిగరెట్ పారేసి గబగబా బయటికి వస్తోంటే, " ఏమి చేస్తున్నారిక్కడ ? కొంపతీసి సిగరెట్టు కానీ తాగట్లేదు కదా ? " అని గురువుగారు అడిగితె, " అబ్బే లేదండీ ఊరికే అలా తిరుగుతూ వచ్చాను. " అని రాజబాబు రిప్లై. " ఇక్కడ తిరగటానికి మట్టి బురద తప్ప ఏముంది ? ఒకసారి మీ జేబులు చూపించండి. " అని అడిగారట గురువుగారు. చచ్చినట్లు జేబులోంచి సిగరెట్ పాకెట్ తీసి చూపించి సగం నిండా ఉన్న ప్యాకెట్ ను ముక్కలు ముక్కలు చేసి పారేసాడట మన రాజబాబు. " ఇంకెప్పుడైనా తాగుతారా ? " అని గురువుగారడిగితే " అమ్మతోడు తాగను. " అని కాళ్ళు పట్టుకున్నంత పని చేసి పారిపోయి వచ్చేసాడట రాజబాబు. రూం దాకా పరిగెత్తి ఇంకా రూమ్లో వేరు వేరు చోట్ల దాచినవన్నీ బయటికి తీసి సురేష్ కి ఇచ్చి పారేయమని చెప్పాడుట రాజబాబు. యింక ఆ రోజు నుంచీ మా రాజబాబు వాకింగ్ మానేసాడు.

కాల్మాడీలకు కూడా వీడ్కోలు చెప్పేద్దాం.
Monday, 4 October 2010
Posted by ప్రభు at 10/04/2010 05:21:00 pm
అతి ఆడంబరంగా మొదలైన కామన్ వెల్త్ గేమ్స్ అసమర్థ నాయకత్వ కారణంగా మసకబారుతున్న మన దేశ ప్రతిష్టను పునః తేజోవంతం చేసాయి. మన దేశానికి కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించే సత్తా లేదేమో అని ఎవరికీ అనుమానం లేదు. ఆ గేమ్స్ కు పెట్టే ఖర్చేదో స్టేడియాలను దేశం మొత్తం మీద, జిల్లాల వారీగా నిర్మిస్తే, క్రీడాకారులకు సరైన శిక్షణ దొరికే ఏర్పాటు చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఇంకా ఉజ్వలంగా ఉంటుందనీ, ఒలెంపిక్ మెడల్స్ కూడా పెరుగుతాయనీ ఒక ఆశ తప్ప. ముందు నుంచీ సరైన నాయకత్వం చూపించి ఉంటే ఇంతకన్నా తక్కువ ఖర్చుతో, అవినీతికి అవకాశం ఇవ్వకుండా, విమర్శలకు తావివ్వకుండా సంబరాలు మొదలయ్యేవేమో. మన రాష్ట్రపతి ప్రతిభాభారతి గారి ఉపన్యాసంలో అబుల్ కలాంగారి ప్రస్తావన రాంగానే మోగిన చప్పట్లు( అందరికన్నా ఎక్కువగా ), ఆయనను మనమంతా ఎంత మిస్ అవుతున్నామో తెలియ చేస్తున్నాయి. సురేష్ కాల్మాడీ గారు పాపం సుదీర్ఘ సుత్తి వేసి తాను అంతా బాగా చేసినట్లు చూపించడానికి ప్రయత్నించినా పదే పదే, గేలి చేస్తూ బూ.. అన్న జనం నిన్ను మేం క్షమించలెం అని చెప్పక చెప్పారు. హరిహరన్ గారి స్వాగతాన్ని చూపించిన విధానమూ, ఏడేళ్ళ బుడతడితో కలిసి రిధం అఫ్ ఇండియా అంటూ డ్రమ్స్ చేసిన నాదం బావుండటమే కాక, విదేశీ క్రీడాకారులతో కూడా నృత్యం చేయించింది. హీలియం బెలూన్ వెంబడే పైకి లేచిన తోలుబొమ్మలు నృత్యం చేస్తున్నట్లు ఊగడం చక్కగా ఉండింది, యోగ ముద్రలో వివిధ చక్రాలను తేజోవంతం చేస్తూ ధ్యాన మగ్నమైన మూర్తి, గాంధీ గారి మూర్తి కిందనుంచి ఉద్బవించిన తీరు చాలా గొప్పగా అనిపించింది. ఇసుకను అప్పటికప్పుడు సర్దుతూ గాంధీ గారి పాత చిత్రంగా మలచిన తీరు కూడా బాగుంది. దేశం మొత్తం మీద ఉన్న అన్నిటినీ చూపాలనే ఉత్సాహంలోరైలు వెంబడే వచ్చిన వివిధ రకాలైన వేషాల వల్ల స్టేడియం కలగూర గంప లా తయారై నట్లు కొద్దిగా అనిపించకపోలేదు. రెహమాన్ కామన్వెల్త్ గేమ్స్ కోసం స్వరపరిచిన గీతం బానే ఉంది కానీ, స్పష్టత, ఉద్వేగం తగ్గినట్లు అనిపించింది. చివరికి ఆయన జయహో పాటతోనే పూర్తి జోష్ తేగలిగారు. ప్రత్యక్ష ప్రసారం చేస్తామంటూ దూరదర్శన్ వారు వాణిజ్య ప్రకటనలతో చీకాకు తెప్పించి, ఆలస్యంగా ప్రసారం చేస్తూ అపహాస్యం చేసారు.
ఇంక ఒక రెండు వారాలు జరిగే ఆటలలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురవ్వకూడదనీ, భద్రతకు ఎటువంటి భయమూ ఉండదనీ, మన క్రీడాకారులు మెడళ్ళ పంట పండిస్తారనీ ఆశిస్తాను. అందరు అతిధులను సగౌరవంగా, సంతృప్తిగా పంపుతూ వీడ్కోలు చెప్పినాక మనం నిజంగా జయహో అని పాడుకుందాం. ఆపైన కాల్మాడీలకు కూడా వీడ్కోలు చెప్పేద్దాం.

బాపూఘాట్ కి పోదాం పద సెగట్రీ !
Saturday, 2 October 2010
Posted by ప్రభు at 10/02/2010 08:26:00 pm
" సెగట్రీ ఇవ్వాళ మన ఇందిరాగాంధీ తాత గారి పుట్టినరోజు కదా సోనియా మేడం ని అభినందించాలి అప్పాయింటుమెంటు తీసుకున్నావా ? "
"అయ్యా ఇవ్వాళ బాపూజీ పుట్టినరోజు సార్. ఇందిరాగాంధీ కి ఆయనకు ఏమీ సంభందం లేదండీ. సోనియా మేడం కూడా ఆయన పుట్టినరోజు కార్యక్రమాలలో బిజీ కాబట్టి నో అప్పాయింటుమెంట్ అన్నారండీ ."
" అలా అంటావేంటి సెగట్రీ ? మనదేశంలో పేరున్న గాంధీ కుటుంబం, అంటే మా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళదే కదా ? వాళ్ళ కుటుంబం లో ఆయన కాకపోతే ఇంత పెద్దగా పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తారా ? మహాత్మా గాంధీ గారి పుట్టినరోజని కదా ఇవాళ సెలవిచ్చారు ? మళ్ళీ ఈ బాపూజీ ఎవరు ? "
" సార్ ఇందిరాగాంధీ గారు నెహ్రు కుటుంబానికి చెందినావిడ సార్. ఆయన మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారని ఆయన పైన గౌరవంతో ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటుంటాం.ఆయన్నే ఆప్యాయంగా బాపూజీ అంటాం సార్. "
" అదేంటి సెగట్రీ అబద్దాలు చెబుతావ్ ? ఇందిరమ్మది నెహ్రు కుటుంబం అయితే వాళ్ళందరినీ గాంధీలు ఎందుకంటారు ? నాకే సెటైర్లిస్తున్నావా ? "
" అయ్యో అయ్యో అబద్దం కాదు సార్. అమ్మతోడు సార్. ఇందిరమ్మ భర్త ఫిరోజ్ గాంధీ సార్ ఆయన కుటుంబం పేరుతో వీళ్ళని గాంధీలు అంటారు సార్. "
" అట్లానా ? ఏంటో ఈ చరిత్ర నాకు చస్తే అర్ధం కాదు. సరే కానీ బయటికి వెళ్ళేలోపు కొద్దిగా చుక్కేసుకుందాం ఏర్పాట్లు చూడు. "
" సా...ర్.. "
" ఏమిటీ నీళ్ళు నముల్తున్నావ్ సెగట్రీ ? "
" గాంధీ గారి పుట్టినరోజున తాగకూడదు సార్. అందుకనే ఈ రోజు మద్యం షాపులు కట్టేస్తారు సార్. "
" ఇవ్వాళ బంద్ అనే కదా మన ' గాంధీ బ్రాందీ షాప్ ' నుంచి నిన్నే తెప్పించి స్టాకు పెట్టిన్చేసాం. పైగా మనం బయట తాగట్లేదు కదయ్యా పర్లేదులే తీసుకురా. "
"సార్... పెట్టేసాను రండి. "
" ఇదేమిటయ్యా సెగట్రీ ? నేనేప్పుడయినా ముక్కలేకుండా మందు కొట్టానా ? చికెనేదీ ? "
" సా...ర్.. "
" నీ సిగతరగా మళ్ళీ నీళ్ళు నముల్తావేమి సెగట్రీ ? "
" ఈ రోజు మాంసాహారం తినకూడదు సార్. "
" ఏమిటిది సెగట్రీ సోనియామ్మ పుట్టిన రోజు కే ఎటువంటి ఆంక్షలు లేవు ఈయన పుట్టినరోజు కు ఇన్ని కిరికిరులేంటీ ? పైగా స్వాతంత్ర్యం తెచ్చాడని చెప్పి ఇంత ఫిటింగా ? "
" మద్యపాన నిషేధం, అహింసా, సత్యమూ ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు చెప్పారు కాబట్టే ఆయన్ని మహాత్మా గాంధీ అన్నారు సార్. ఆయన పుట్టినరోజునైనా మందూ, ముక్కా లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో అలా పెట్టారు సార్. "
" అంటే ఆయన పేరు మహాత్మా కే. గాంధీ కాదా సెగట్రీ ? "
" కాదు సార్. మోహన్దాస్ కరంచంద్ గాంధీ సార్. "
" ఏదోలే.. ఆయన సొనియమ్మ చుట్టం కాకపోయినా ప్రోగ్రాం కి పిలిచారు కాబట్టి వెళ్ళాలి తప్పదు. ఇవ్వాళ చెప్పాల్సిన స్పీచి తయారు చేసావా సెగట్రీ ? "
" ఇదిగో సార్ రెడీ గానే ఉంది. "
" సరే మరి త్వరగా ఇంకో సోడా తీసుకురా. గబుక్కున ముగించేసి బాపూఘాట్ కి వెళ్దాం. అదే చేత్తో మంచి కిళ్ళీ తీసుకురా కొద్దిగా వాసన తగ్గుతుంది. "
" ఇప్పుడే తెప్పిస్తాను సార్. "

ఇలా చేస్తే మనం ఇంకా సుఖంగా బ్రతుకగలం !
Friday, 1 October 2010
Posted by ప్రభు at 10/01/2010 02:33:00 pm
నిన్న అయోధ్య పై అలహాబాదు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సయోధ్యను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన తీర్పులా కనిపించింది. ఎన్నో ఏళ్ళ తరువాత శాంతిని కాపాడాలనే తాపత్రయం ప్రజలతో పాటు ప్రభుత్వంలో కూడా కనిపించింది. అందరూ ఉత్కంటతో ఎదురు చూసిన తీర్పు ప్రజాస్వామ్య చిన్హంలా రావడం దేశ ప్రజలందరినీ సంతృప్తి పరిచింది అనడంలో ఏ మాత్రమూ అనుమానంలేదు. తీర్పు కోసం ఎదురుచూస్తున్న సమయంలో కానీ, తీర్పు విన్న తరువాత ప్రతిక్రియగా కానీ ఎటువంటి అవాంచనీయ ఘటనలూ జరగకపోవడం, మన దేశం నిజమైన సర్వమానవ సౌబ్రాత్వుత్వాన్ని, సర్వమత సామరస్యాన్ని కోరుకుంటుందని ప్రపంచానికి మరోసారి ఎలుగెత్తి చూపింది. మనమంతా ఇంత శాంతియుతంగా ఊపిరి తీసుకోగలిగిన సుందర క్షణాలు చెదరకుండా ఉండటానికి కారణాలు మాత్రం ప్రధానంగా మూడు చర్యలు.
1. భద్రతా చర్యలు : ముందు జాగ్రత్త చర్యగా వివాదాస్పద స్థలాలనూ, సున్నిత స్థలాలనూ భద్రతా వలయాలలో ఉంచడమూ, కార్యాలయాలకు, స్కూళ్ళూ కాలేజీ లకు సెలవులు ప్రకటించడమూ, దుకాణాలను, వ్యాపార సంస్థలనూ మూయించడమూ, సందిగ్ద చరిత ఉన్న వ్యక్తులను నిర్భందం లోనికి తీసుకోవడమూ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియచేసి ప్రజలనూ శాంతి వేపు దృష్టి సారించేలా చేసింది.
2. మీడియా పై నియంత్రణ : టీవీలు, న్యూస్ పేపర్లకు వార్తా ప్రసారానికి మసాలాలను అంటించనీయక పోవడమూ, బాబ్రి మసీదు కూల్చివేత దృశ్యాలను పునః ప్రదర్శించనీయక పోవడమూ, కోర్టులోనికి మీడియాను అనుమతించక పోవడమూ, కోర్టు తీర్పుకు విపరీతార్ధాలు తీయనీయక పోవడమూ టీవీలు చూస్తున్న ప్రజల భావోద్వేగాలను నియంత్రించేలా చేసింది.
3. బల్క్ ఎస్ ఎమ్ ఎస్ ల పై నిషేధం : అదిగో పులి అంతే ఇదిగో తోక అనే విధంగా అపవాదులు పుట్టించడం లోనూ, వ్యాపింపజేయడం లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్న మొబైల్ బల్క్ ఎస్ ఎమ్ ఎస్ లను నిషేదించడం ద్వారా పనికిరాని అపవాదుల ప్రవాహం ఆగేలా చేసింది.
మొదటిదైన భద్రతా చర్యలు ఇంత తీవ్ర స్థాయిలో నిత్యం చేపట్టడం కష్టమైనా కొంత వరకూ అయినా ఉంటుంటే హింస రగలకుండా ఉంటుంది.
అయితే మన జీవితాలు ఇలాగే శాంతియుతంగా సాగిపోవాలంటే మటుకూ మీడియా ప్రసారాలపై స్వయం నియంత్రణ ఉండేలా చర్యలు చేపట్టాల్సిందే. టీ ఆర్ పీ రేటింగులకోసమో, తమ చానళ్ళ ప్రాభవం పెంచుకోవడం కోసమో లేని వార్తలను పుట్టించడమూ, లేదా సంఘటనలకు వక్రభాష్యాలు చెప్పడమూ చేయకుండా, ఎటువంటి మషాలాలూ అద్దని వార్తలను చూపించడమూ, భావోద్వేగాలు రెచ్చిపోతాయనుకుంటే ఆ వార్తలను తక్కువ మోతాదులో తెలియచేయడమూ , రక్త మాంసాలతో నిండిన దృశ్యాలను చూపకుండా వార్తను మాత్రం తెలియచేయడం వంటి చిన్న చిన్న సుగుణాలను న్యూస్ చానళ్లు పెంపొందిచేలా ప్రయత్నించాలి.
ఈ అయోధ్య తీర్పు పుణ్యమా అని పనికిరాని ఎస్ ఎమ్ ఎస్ లు రాక హాయిగా ఉండింది. ప్రతి టెలికాంసేవల కంపెనీకీ, బల్క్ ఎస్ ఎమ్ ఎస్ లను పంపే ముందు దాన్ని సెన్సార్ చేసే హక్కు ఇచ్చి, ఆ నెట్ వర్క్ నుంచి ఒకవేళ ఏదైనా అపవాదు పాకితే ఆ నెట్ వర్క్ అందిస్తున్న కంపెనీని బాధ్యులుగా చేయాలి.

Subscribe to:
Posts (Atom)