బాపూఘాట్ కి పోదాం పద సెగట్రీ !

Saturday, 2 October 2010

" సెగట్రీ  ఇవ్వాళ  మన ఇందిరాగాంధీ  తాత గారి పుట్టినరోజు కదా సోనియా మేడం ని అభినందించాలి అప్పాయింటుమెంటు తీసుకున్నావా ? "
"అయ్యా ఇవ్వాళ బాపూజీ పుట్టినరోజు సార్. ఇందిరాగాంధీ కి ఆయనకు ఏమీ సంభందం లేదండీ. సోనియా మేడం కూడా ఆయన పుట్టినరోజు కార్యక్రమాలలో బిజీ కాబట్టి నో అప్పాయింటుమెంట్ అన్నారండీ ."
" అలా అంటావేంటి సెగట్రీ ?  మనదేశంలో పేరున్న గాంధీ కుటుంబం, అంటే మా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ  వాళ్ళదే కదా ? వాళ్ళ కుటుంబం లో ఆయన కాకపోతే ఇంత పెద్దగా పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తారా ? మహాత్మా గాంధీ గారి పుట్టినరోజని  కదా ఇవాళ సెలవిచ్చారు ?  మళ్ళీ  ఈ బాపూజీ ఎవరు ? "
" సార్ ఇందిరాగాంధీ గారు నెహ్రు కుటుంబానికి చెందినావిడ సార్. ఆయన మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారని ఆయన పైన గౌరవంతో ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటుంటాం.ఆయన్నే ఆప్యాయంగా బాపూజీ అంటాం సార్. "
" అదేంటి సెగట్రీ అబద్దాలు చెబుతావ్ ? ఇందిరమ్మది  నెహ్రు కుటుంబం అయితే వాళ్ళందరినీ గాంధీలు  ఎందుకంటారు ? నాకే సెటైర్లిస్తున్నావా ? "
" అయ్యో అయ్యో అబద్దం కాదు సార్. అమ్మతోడు సార్. ఇందిరమ్మ భర్త ఫిరోజ్ గాంధీ సార్ ఆయన కుటుంబం పేరుతో వీళ్ళని గాంధీలు అంటారు సార్. "
" అట్లానా ? ఏంటో ఈ చరిత్ర నాకు చస్తే అర్ధం కాదు.  సరే కానీ బయటికి వెళ్ళేలోపు కొద్దిగా చుక్కేసుకుందాం ఏర్పాట్లు చూడు. "
" సా...ర్.. "
" ఏమిటీ నీళ్ళు నముల్తున్నావ్ సెగట్రీ ? "
" గాంధీ గారి పుట్టినరోజున తాగకూడదు సార్. అందుకనే ఈ రోజు మద్యం షాపులు కట్టేస్తారు సార్. "
" ఇవ్వాళ బంద్ అనే కదా మన ' గాంధీ బ్రాందీ షాప్ ' నుంచి నిన్నే తెప్పించి స్టాకు పెట్టిన్చేసాం. పైగా మనం బయట తాగట్లేదు కదయ్యా పర్లేదులే తీసుకురా.  "
"సార్... పెట్టేసాను రండి. "
" ఇదేమిటయ్యా  సెగట్రీ ? నేనేప్పుడయినా ముక్కలేకుండా మందు కొట్టానా ?  చికెనేదీ ? "
" సా...ర్.. "
" నీ సిగతరగా మళ్ళీ నీళ్ళు నముల్తావేమి  సెగట్రీ ? "
" ఈ రోజు మాంసాహారం తినకూడదు సార్. "
" ఏమిటిది సెగట్రీ సోనియామ్మ పుట్టిన రోజు కే ఎటువంటి ఆంక్షలు లేవు ఈయన పుట్టినరోజు కు ఇన్ని కిరికిరులేంటీ ?  పైగా స్వాతంత్ర్యం తెచ్చాడని చెప్పి ఇంత ఫిటింగా ? "
" మద్యపాన నిషేధం, అహింసా, సత్యమూ ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు చెప్పారు కాబట్టే ఆయన్ని మహాత్మా గాంధీ అన్నారు సార్.  ఆయన పుట్టినరోజునైనా మందూ, ముక్కా లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో అలా పెట్టారు సార్. "
" అంటే ఆయన పేరు మహాత్మా కే. గాంధీ కాదా  సెగట్రీ ? "
" కాదు సార్. మోహన్దాస్  కరంచంద్ గాంధీ సార్. "
" ఏదోలే.. ఆయన సొనియమ్మ చుట్టం కాకపోయినా ప్రోగ్రాం కి పిలిచారు కాబట్టి వెళ్ళాలి తప్పదు. ఇవ్వాళ చెప్పాల్సిన స్పీచి తయారు చేసావా సెగట్రీ ? "
" ఇదిగో సార్ రెడీ గానే ఉంది. "
" సరే మరి త్వరగా ఇంకో సోడా తీసుకురా. గబుక్కున ముగించేసి బాపూఘాట్ కి వెళ్దాం. అదే చేత్తో మంచి కిళ్ళీ తీసుకురా కొద్దిగా వాసన తగ్గుతుంది. "
" ఇప్పుడే తెప్పిస్తాను సార్. "

1 comments:

రక్తచరిత్ర said...

" ఏమిటిది సెగట్రీ సోనియామ్మ పుట్టిన రోజు కే ఎటువంటి ఆంక్షలు లేవు ఈయన పుట్టినరోజు కు ఇన్ని కిరికిరులేంటీ ?

""సోనియామ్మ పుట్టిన రోజుకు birhtday gift లాగా తెలుగు జాతి వాడి శరీరాన్నే ముక్కలు, ముక్కలుగా కోసి విందు ఇచ్చిన దాని కంటే ఈ కోడి మాంసం చేసిన తప్పేంటి!సెగట్రీ ?""

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )