ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు తన విద్యార్థులకు ' సంస్థలలో లాజిక్ ' గురించి చెప్పి టెస్ట్ పెట్టారు. అందులో ఫెయిల్ అయిన ఒక విద్యార్ధి ప్రొఫెసర్ గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు : " సార్ మీరు నా పేపర్ కి ' ఏ ' గ్రేడ్ ఇవ్వకపోవడం అన్యాయం."
" మరి నువ్వు రాసినదాన్ని బట్టి చూస్తే నీకు అస్సలు విషయం అర్థమైనట్లే లేదు. " కోపంగా అన్నారా ప్రొఫెసర్.
ఈ కుర్రాడు కూడా తగ్గకుండా " అంటే మీకు విషయం పూర్తి గా అర్థం అయ్యిందంటారు ? " అని రెట్టించాడు.
" అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపొతే నేను ప్రొఫెసర్ని ఎలా అవుతాను ? ' అన్నారు ప్రొఫెసర్ గారు కూడా తగ్గకుండా.
" అంతేనంటారు ? సరే అలా అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. దానికి మీరు సమాధానం చెప్పగలిగితే మీరు నాకిచ్చిన మార్కులను ఒప్పుకుని వెళ్ళిపోతాను. కానీ ఒకవేళ మీరు సమాధానం చెప్పలేక పొతే నా పేపర్ కు ' ఏ ' గ్రేడ్ ఇవ్వాల్సిందే. సిద్ధమేనా సార్ ? " చాలెంజ్ చేసాడు కుర్రాడు.
క్లాసులో అందరి ముందూ అలా అడిగేసరికి, ఉక్రోషం పట్టలేకో, ఈ పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అనుకునో, తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి వెంటనే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక " సరే నేను ఒప్పుకుంటున్నాను. నీ ప్రశ్న ఏదో అడుగు. " అన్నారు ప్రొఫెసర్ ధీమాగా.
అయితే చెప్పండి సార్. ఏది ' లీగల్ ' అయినా ' లాజికల్ ' కాదు ; ' లాజికల్ ' అయినా , లీగల్ కాదు ; అటు ' లాజికల్' కానీ , ఇటు ' లీగల్ ' కానీ కాదు ? " అడిగేసాడు కుర్రాడు ఉత్సాహంగా.
ఒక్కసారిగా బుర్ర తిరిగిపోయినంత పని అయ్యింది ప్రొఫెసర్ గారికి చాలాసేపు అలోచించినా జవాబు తట్టక చచ్చినట్లు ఆ స్టూడెంట్ పేపర్ కి ' ఏ ' గ్రేడ్ ఇచ్చేసారు. తరువాత తన శిష్యులు అందరిలోకీ తెలివైన వాడిని తన గదికి పిలిపించుకొని ఆ ప్రశ్నకు తనకేమైనా సమాధానం తట్టిందేమో అని కూపీ తీసారు ప్రొఫెసర్ గారు.
ఆ విద్యార్ధి వెంటనే సమాధానం ఇచ్చాడు " సార్! మీ వయసు 65 , మీ శ్రీమతి వయసు 35. ఇది లీగలే కానీ లాజికల్ కాదు. అయితే మీ శ్రీమతికి 25 ఏళ్ళ వయసున్న ప్రేమికుడున్నాడు. ఇది లాజికలే కానీ లీగల్ కాదు. మీరేమో తప్పాల్సిన మీ శ్రీమతి ప్రేమికుడికి ' ఏ ' గ్రేడ్ ఇచ్చారు. అదేమో అటు లీగలూ కాదూ, ఇటు లాజికలూ కాదు."
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
Oh my....మాకు తలతిరిగినంత పనయింది.
:)
LOL
:) manchi logical ga raasaru :)
a good one in the recent days :-)
;-)
:-)
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )