ఆరోగ్యం బాగా ఉండట్లేదని కొన్నాళ్ళ క్రితం ఒక ప్రకృతి చికిత్సాలయం లో ఒక మూడు వారాలు ఉన్నాను. ఆ సమయం లో చాలా మంది విభిన్న మనస్తత్వాలు ఉన్న వాళ్ళను చూసాను. ఆశ్రమం లోనికి అడుగు పెట్టగానే ముందు వాళ్ళు అడిగిన ప్రశ్న" మీ దగ్గర ఏదైనా తిండి పదార్ధాలు కానీ, పానీయాలు కానీ, సిగరెట్లు కానీ, మద్యం కానీ ఉన్నాయా ? " అని. నవ్వు వచ్చింది ' అంటే అలా తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారన్నమాట ' అనిపించింది. ఏమీ లేవని చెబితే చెక్ చెయ్యలేదు కానీ, " ఎప్పుడైనా ఉన్నట్లు తెలిస్తే గురువు గారికి కోపం వస్తుంది. మంచిది కాదు " అని చెప్పారు. " మీకు ఏ విధమైన అవసరాలున్నా మాకు చెప్పాలి డబ్బులిస్తే అవి ఆశ్రమ నియమానికి ఇబ్బంది కాకపొతే తెచ్చిపెడతాము కానీ మీరు ఎట్టి పరిస్తితులలోనూ బయటకు వెళ్ళటానికి కుదరదు " అని చెప్పారు. సంతోషం అనిపించింది. ' ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది ? ' అనుకున్నాను.
ఒక్క వార్తా పత్రికలు తప్ప మిగతా బయటి ప్రపంచంతో కావాలని సంబంధాలు కట్ చేసుకోవడం వల్ల సమయమే సమయం. పచ్చని మొక్కలతో, రంగు రంగుల పూలతో పళ్ళతో నిండిన చెట్లతో. వేడి అన్నదే లేక ఒక హిల్ స్టేషన్ లో ఉన్నామేమో అనిపించేలా ఉన్న వాతావరణం. చెట్ల కిందా, రూము ఎదురుగా ఎక్కడ చూసినా బుట్ట ఉయ్యాలలూ, బల్ల ఉయ్యాలలూ, రణగొణ ద్వనికి దూరంగా ప్రశాంతమైన పరిసరాలు మళ్ళీ బ్రతుకు మీద ఆశలు పెంచేస్తూ, ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండును ఇక్కడ అనిపించేది. ఉగాది ముందు సమయమేమో కోయిలల కుహు కుహూలూ, పక్షుల కిల కిలలూ సంగీత ధ్వనులుగా అనిపిస్తూ యాంత్రిక మైన నగర జీవితంలో ప్రకృతికి దూరమై ఎంత నష్టపోతున్నామో గుర్తు చేసింది. కాఫీ టీ ల బదులు తీసుకుంటున్న చెరుకు రసమూ, కూరగాయల రసాలు అమృతం లా తోచేవి. యోగాసనాలు కొత్తలో శరీరానికి ఇబ్బంది అనిపించినా అలవాటైన తరువాత చాలా మందికి వ్యసనంలా మారిపోయాయి. నాకు వచ్చిన అనారోగ్యం వల్ల యోగాసనాలకు నేను దూరంగా ఉండాల్సిరావడం కొంత బాధగానే అనిపించింది.
ఇంత ఆహ్లాదకర వాతావరణంలో నేను చేరిన రోజే రాజబాబు కూడా చేరాడు. చక్కటి కుండ లాంటి బొజ్జ తప్ప వేరే ఏమీ ఇబ్బందులు ఉన్నట్లు అనిపించలేదు. నా వయసులో సగం ఉన్నా చక్కగా స్నేహపూర్వకంగా కలిసిపోయాడు. అతనికి ఉన్న అలవాటు ఏమిటంటే సందు దొరికితే వాక్ మాన్ లో పాటలు వింటూ, చింగం ( చూయింగ్ గమ్ ) నమిలేస్తూ, ఆశ్రమం రోడ్లమీద చక చకా వాకింగ్ చేస్తూ ఉండటం. " నేను ఇక్కడ ఒక 60 లేదా 90 రోజులుంటాను అంకుల్. ఈ లోపు నా బొజ్జ కరిగించేసుకోకపోతే నాకు పెళ్లి కావడం కష్టం అని డాడీ బలవంతం మీద పంపించారు. తగ్గకపోతే ఇంకా ఉండాల్సి వస్తుందేమో అని నడిచేస్తున్నాను " అనేవాడు అతను. " మరి ఇంత యాక్టివ్ గా ఉండేవాడికి ఇంత బొజ్జ ఎక్కడినుంచి వచ్చిందయ్యా ? " అంటే. " ఇంట్లో ఉన్నవాళ్ళందరూ నేతిలో ముంచిన అన్నం ముద్దలు తినిపించీ, స్వీట్లు నోట్లో కుక్కి సహాయం చేస్తే, డబ్బులెక్కువై రోజూ మందు, ముక్క లాగించేసి పెంచేసాను అంకుల్ " అనేవాడు. " మరి ఆ లైఫ్ స్టైల్లోంచి బయట పడక పొతే బొజ్జ మళ్ళీ వచ్చేస్తుంది కదా ? " అంటే. " యింక డిసైడ్ చేసేసాను అంకుల్ పూర్తిగా మారి పోయాను. " అనేవాడు. అతని తో పాటు అతని రూంమేట్, నా రూంమేట్ కూడా పిల్లలే అయినా నాతో సరదాగా ఉండే వాళ్ళు.
ఒక రోజు నా రూం మేట్ సురేష్ " అంకుల్ మీకు తెలుసా రాజబాబు అంత వాకింగ్ ఎందుకు చేస్తుంటాడో? " అని అడిగాడు. " బొజ్జ తగ్గటానికి. " అంటే, " కాదంకుల్ ఆ వంకన దూరంగా ఉన్న పసరు, బురద స్నానాల ప్లేస్ కి వెళ్లి దమ్ము కొట్టి వస్తుంటాడు. " అని చెప్పాడు. ' అదన్నమాట చింగం నమలటం లో ఉన్న రహస్యం వాసన పోగొట్టడం కోసం చింగం.' ఆశ్రమంలో రోజు కూలీకి పని చేసే వ్యక్తులకు చిన్న చిన్న లంచాలిచ్చి తెప్పించుకుంటూ ఉన్నాడనీ , తెలిసినప్పటినుంచీ గురువుగారికి చెబుతాం అని ఏడిపిస్తున్నామనీ చెప్పాడు సురేష్. యింక తగ్గించేస్తాననీ, గురువుగారికి చెప్పొద్దనీ బతిమాలుకునేవాడుట రాజబాబు. . నాకు కూడా విషయం తెలిసిపోయినట్లు తెలిసి కొద్దిగా గిల్టీగా తప్పుకు తిరిగే వాడు రాజబాబు.
కొన్నాళ్ళు గడిచినాక మళ్ళీ సురేష్ నాతో మాట్లాడుతూ, " అంకుల్ ఇవ్వాళ రాజబాబు గురువుగారికి దొరికిపోయాడు." అని చెప్పాడు. " ఏమయ్యిందీ " అంటే పొద్దున్నే మట్టి స్నానాల దొడ్డి లో దాక్కుని దమ్ము కొడుతుంటే, ఉదయమే వాకింగ్ కి వెళ్ళిన గురువుగారికి ఆ దొడ్డిలోంచి పొగ గుప్పు గుప్పున వస్తూ కనిపించి ' ఇప్పుడు ఇక్కడెవరూ ఉండరే ఈ పొగ ఏమిటబ్బా' అని అనుమానించి లోపలి వెళ్తూ అక్కడ ఏదో రిపేర్ పని చేస్తున్న కుర్రాడితో మాట్లాడటం విని రాజబాబు సిగరెట్ పారేసి గబగబా బయటికి వస్తోంటే, " ఏమి చేస్తున్నారిక్కడ ? కొంపతీసి సిగరెట్టు కానీ తాగట్లేదు కదా ? " అని గురువుగారు అడిగితె, " అబ్బే లేదండీ ఊరికే అలా తిరుగుతూ వచ్చాను. " అని రాజబాబు రిప్లై. " ఇక్కడ తిరగటానికి మట్టి బురద తప్ప ఏముంది ? ఒకసారి మీ జేబులు చూపించండి. " అని అడిగారట గురువుగారు. చచ్చినట్లు జేబులోంచి సిగరెట్ పాకెట్ తీసి చూపించి సగం నిండా ఉన్న ప్యాకెట్ ను ముక్కలు ముక్కలు చేసి పారేసాడట మన రాజబాబు. " ఇంకెప్పుడైనా తాగుతారా ? " అని గురువుగారడిగితే " అమ్మతోడు తాగను. " అని కాళ్ళు పట్టుకున్నంత పని చేసి పారిపోయి వచ్చేసాడట రాజబాబు. రూం దాకా పరిగెత్తి ఇంకా రూమ్లో వేరు వేరు చోట్ల దాచినవన్నీ బయటికి తీసి సురేష్ కి ఇచ్చి పారేయమని చెప్పాడుట రాజబాబు. యింక ఆ రోజు నుంచీ మా రాజబాబు వాకింగ్ మానేసాడు.
యింక ఆ రోజు నుంచీ మా రాజబాబు వాకింగ్ మానేసాడు.
Tuesday, 5 October 2010
Posted by ప్రభు at 10/05/2010 03:48:00 pm
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
meeru walking modalettaledu kadaa?ha ha ha ..:)
eppudu ilage santhoshanga vundalani korukuntunna prabhu garu,
meeku janma dina subhakankshalu.
http://lh5.ggpht.com/_ZQ0GN9ydhOs/StGj-2MEn-I/AAAAAAAAAH0/kR2Snr-GJy4/s400/11472.png
thanks alot hemagaaroo !
:-) :-) Nice..
మీరు చెప్పిన కథ చదివాక మా హాస్టల్ లో అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయి పొద్దున్నే లేచి చదువుదామని రాత్రి 9 కే మంచమెక్కి, రాత్రి చదువుదాం లెమ్మని ఉదయం 9 కీ లేచేది, పైగా మాకు అలారం మోతా.. ఒక్కోసారి ఉదయం లేచి చేతిలో పుస్తకం తోటే నిద్రపోయేది.. అదేమంటే.. చదివినవి కళ్ళు మూసుకుని పునశ్చరణ చేసుకుంటున్నాను అనేది :-) మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాక మళ్ళీ చదువులో పడింది..
bagundi mee raja babu katha. aasramam varnana kooda bagundi :)
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )