మన మేయర్ గారు అమెరికా తిరిగి వచ్చిన తరువాత ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మన నగరం, దాంట్లోని రోడ్లు అధ్వాన్నంగా ఉండటానికీ, అక్కడి రోడ్లు, నగరాలు గొప్పగా ఉండటానికీ మధ్య తేడాలలో ముఖ్యమైనది ప్రజల అలవాట్లూ, వాటిని పాడు చేయకూడదని వాళ్ళ మనసులో ఉన్న ధృడ నిశ్చయమూ అని తేల్చేసారు ! రేపు ఎవరైనా ఇన్ని కోట్లు పోసి వేస్తున్న రోడ్లు ఏమైనాయి అని అడిగితే చెప్పేయడానికి సమాధానం ఇప్పుడే తయారు అయిపొయింది అన్నమాట !
ఒక విధంగా అది కూడా నిజమేనేమో ?
మనం మన కార్పోరేటర్లను నిలదీయం !
ట్రాఫిక్ రూల్స్ చస్తే పాటించం !
చెత్తను కుండీలలో తప్ప అన్ని చోట్లా పారేస్తాం !
సందు దొరికితే ఫ్లేక్సీలూ, తోరణాలూ కట్టి తీయకుండా వదిలేస్తాం ! ( కోపం వస్తే రోడ్డు మీదే దిష్టి బొమ్మలతో కలిపి తగలేస్తాం ! )
పెరిగే జనాభాకు సరిపడా సులభ కాంప్లెక్సులు లేవు కాబట్టి రోడ్డు మీదే పని కానిచ్చేస్తాం !
కిళ్ళీలు నములుతుంటాం కాబట్టి కళ్ళు మూసుకుని పక్కకు ఊసేస్తాం ! అవి ఎవరి మీద పడుతున్నాయో కూడా చూడం !
సిగరెట్టు పొగ స్తయిల్గా పీల్చేసి పక్కనున్న పిల్లల్నీ, వృద్దుల్నీ చావండిరా అంటూ ముఖం మీదికి ఊదేస్తాం !
అలా చేస్తే దండించరు కాబట్టి చేసేస్తాం !
ఇవన్నీ ఇదివరకూ ఉన్నాయి !
కానీ వీటికి తోడు ఇప్పుడు అవినీతి తో కట్టిన రోడ్లూ, పట్టించుకోని ఇంజనీర్లూ, పారిశుధ్య సిబ్బందీ మనని కోట్లు ఖర్చు పెట్టినా కూపం లోనే బ్రతికిస్తున్నాయ్ !
మేయరు గారు ఇదే నగరం కొన్నేళ్ళ క్రితం వరసగా నాలుగు సంవత్సరాలు దేశం మొత్తం మీద పరిశుభ్రమైన నగరం గా నిలిచి ఇప్పుడు ఇలా భ్రష్టు పట్టడానికి కారణాలు గుర్తించడం మరిచి పోయారు !
ఒక రోడ్డు సుందరంగా, గుంటలు లేకుండా ఉందీ అంటే ఈ కింద ఇచ్చిన కారణాలే తోస్తున్నాయి ప్రస్తుతానికి :
- ఆ రోడ్డు సి ఏం గారి ఇంటికి వెళ్ళేది అన్నమాట !
- ఆ రోడ్డు వేసింది పదేళ్ళ క్రితం అయి ఉండాలి !
- ఆ రోడ్డు వేసిన, మైంటైన్ చేస్తున్న వాళ్లు నీతి మంతులై ఉండాలి !
- అది ఏ ప్రయివేటు రోడ్డో కావచ్చు !
- దానిమీద ఇంకా మైంటైన్ చేసేవాళ్ళ కళ్ళు పడలేదన్నమాట ( రోడ్డు కొట్టు - బిల్లు పట్టు కోసం ) !
అంతేనంటారా మేయర్ గారూ ?
హైదరాబాదు రోడ్లిలా ఎందుకున్నాయి ?
Tuesday, 30 November 2010
Posted by ప్రభు at 11/30/2010 05:01:00 pmమేమేం స్త్రీకింగ్ చేయట్లా నీ పని చూసుకోవోయ్ !
Posted by ప్రభు at 11/30/2010 02:31:00 pm
మీకేం బాబూ.. బర్రున తొక్కేసి తుర్రున పోతారు !
మాకలా కాదే పరిగెడితే కానీ గెలవలేం !
ఎండ ఎలా ఉందో చూడండి !
మాకలా కాదే పరిగెడితే కానీ గెలవలేం !
ఎండ ఎలా ఉందో చూడండి !
నీకున్న బాంబులనుపసిగట్టే శక్తి వల్లె బ్రతికి ఉన్నా !
Posted by ప్రభు at 11/30/2010 02:29:00 pmనా ఆట చూడు !
Posted by ప్రభు at 11/30/2010 02:00:00 pm
మా వాళ్ళెవరికీ ఇలా ఆటలు ఆడాలి అనిపించదు !
నాకైతే ఒక్కసారైనా వరల్డ్ రికార్డ్ స్థాపించాలి అనిపిస్తూ ఉంటుంది !
ఈ ప్రయత్నం సక్సెస్స్ అయితే గిన్నీస్ బుక్ లో ఎక్కేస్తా !
నాకైతే ఒక్కసారైనా వరల్డ్ రికార్డ్ స్థాపించాలి అనిపిస్తూ ఉంటుంది !
ఈ ప్రయత్నం సక్సెస్స్ అయితే గిన్నీస్ బుక్ లో ఎక్కేస్తా !
ఇటురా బావా !
Posted by ప్రభు at 11/30/2010 10:42:00 am
నీతో చెడ్డ చిక్కే బావా !
నీ మగతనం చూపించమంటే అలా గంతులేస్తావెంటీ ?
నువ్వేం సూపర్ మేన్ వి కాదుగానీ ఇంక ఆపు !
నీ మగతనం చూపించమంటే అలా గంతులేస్తావెంటీ ?
నువ్వేం సూపర్ మేన్ వి కాదుగానీ ఇంక ఆపు !
అందాకా ఈ నీళ్లన్నీ తోడి పోయగలనా ?
Posted by ప్రభు at 11/30/2010 10:40:00 am
అప్పటికీ చెబుతూనే ఉన్నా !
అందరిలా మునిసిపాలిటీ పంపే వాడుదాం అని !
వినకుండా నది నుంచి రిజర్వాయర్ కి వెళ్ళే లైన్ తో కనెక్షన్ కలిపాడీయన !
ఇప్పుడేమో అది లీకవుతోంది !
ఆయనెప్పుడు వస్తాడో ?
ఈ ప్రవాహం ఎలా ఆగుతుందో ?
అందరిలా మునిసిపాలిటీ పంపే వాడుదాం అని !
వినకుండా నది నుంచి రిజర్వాయర్ కి వెళ్ళే లైన్ తో కనెక్షన్ కలిపాడీయన !
ఇప్పుడేమో అది లీకవుతోంది !
ఆయనెప్పుడు వస్తాడో ?
ఈ ప్రవాహం ఎలా ఆగుతుందో ?
మీ పప్పులుడకవు లే !
Monday, 29 November 2010
Posted by ప్రభు at 11/29/2010 03:12:00 pm
అమ్మా.. ఆశ.. దోశ.. అప్పడం.. వడ.. నేను మాట్లాడితే ఈ కాయలు కొట్టేయోచ్చని చూస్తున్నారా ?
నా గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వడానికి తీసుకెళ్తూ జారకూడదని పళ్లకు గుచ్చేసా !
నా గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వడానికి తీసుకెళ్తూ జారకూడదని పళ్లకు గుచ్చేసా !
నో బార్కింగ్ అది పార్కింగ్ !
Posted by ప్రభు at 11/29/2010 10:48:00 am
మా పార్కింగ్ లో మీరు బండి పెడితే మీ కుక్కలను కూడా మేమే చూసుకుంటాం !
కార్లో వదిలి వెళ్ళకండి !
మేం ఏర్పాటు చేసిన పక్కమీద పడుకుంటే మళ్ళీ మీరోచ్చే వరకూ కదిలితే అడగండి !
కార్లో వదిలి వెళ్ళకండి !
మేం ఏర్పాటు చేసిన పక్కమీద పడుకుంటే మళ్ళీ మీరోచ్చే వరకూ కదిలితే అడగండి !
ఎక్కడా పోలీసులు లేరులే... స్పీడు పెంచు !
Posted by ప్రభు at 11/29/2010 10:48:00 am
త్వరగా పదవయ్యా మగడా !
పొద్దుననగా తీసుకొచ్చావు !
తిండి లేదూ... తిప్పలు లేవు !
మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది !
పద పద !
పొద్దుననగా తీసుకొచ్చావు !
తిండి లేదూ... తిప్పలు లేవు !
మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది !
పద పద !
పొడుగు కష్టాలు !
Posted by ప్రభు at 11/29/2010 10:47:00 am
అదే మరి !
ఆరడుగుల అందగాళ్ళని పొడుగ్గా ఉన్నవాళ్ళను చూసి ఒకటే ఇది పోతారు మీరంతా !
కానీ మా పొడుగోళ్లకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకేం తెలుసు ?
ఆరడుగుల అందగాళ్ళని పొడుగ్గా ఉన్నవాళ్ళను చూసి ఒకటే ఇది పోతారు మీరంతా !
కానీ మా పొడుగోళ్లకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకేం తెలుసు ?
మీ పంచకల్యాణి ఎక్కడ ?
Posted by ప్రభు at 11/29/2010 10:47:00 am
నా పంచకల్యాణి మీద ఏ రోడ్డు ఎక్కినా పోలీసు ప్రమాదం లేదు !
ఆఘమేఘాల మీద చేరుకోవచ్చు !
పార్కింగ్ ప్రాబ్లం లేదు !
పొల్యూషన్ భయం లేదు !
ఆఘమేఘాల మీద చేరుకోవచ్చు !
పార్కింగ్ ప్రాబ్లం లేదు !
పొల్యూషన్ భయం లేదు !
కే.సి.ఆర్. గారి కూలి డబ్బులు !
Friday, 26 November 2010
Posted by ప్రభు at 11/26/2010 01:55:00 pm
కే.సి.ఆర్. గారికి పాపం వరంగల్ సభ కోసం జన సమీకరణ చేయాలంటే పలచబడిన పరువుతో సాధ్యం కావట్లేదు అనుకుంటా !
రోజుకో విధంగా మాట్లాడి, చేతలకు మాటలకు పొంతన లేకుండా ప్రవర్తించీ తనను తానే చులకన చేసుకున్నారాయే !
కే.సి.ఆర్. గారి మాటలు విని తెలంగాణా సానుభూతిపరులు ఆర్ధిక సాయం చేయడం కూడా ఆపేసినట్లు ఉన్నారు !
పరిశ్రమల యాజమాన్యాన్ని పిలిచి బెదిరించి డబ్బులు వసూలు చేద్దామంటే మన తెలంగాణా వాదులే తిడుతున్టిరి !
ఇంకేమిటి దారి ? రోజూ కొన్ని నిముషాలు కూలీ పని చేసి డబ్బులు సంపాయిస్తున్నారు !
రోజు కూలీ అంటే మహా అయితే రెందొందలూ, లేకపోతే గొప్ప పనిమంతుడైతే అయిదొందలు సంపాయించ వచ్చు !
మరీయనకు కష్టపడి ఎన్ని దినాలాయె, ఏమి పని చేస్తారు ? ఎంత సంపాయిస్తారు ?
అలా ఆమ్ ఆద్మీ లా సంపాయిస్తే ఆయన నేత ఎలా అవుతారు ? సభలోపు ఎంత సంపాయిస్తారనీ ?
మొన్న పాపం ఒక కంపెనీకి వెళ్లి కాసేపు ఆ పనీ ఈపనీ చేసినట్లు ఫోటోలు దిగేసి ఓ ఐదు లక్షలు కూలడిగే సరికి ఆ యాజమాన్యం దిమ్మ దిరిగి పోయి, పోన్లే మన కంపెనీకి వచ్చీ ఫోటోలు దిగావు, ఇంత జనాన్ని వెంట పెట్టుకోచ్చావు కాబట్టి ఓ పాతిక వేలిస్తలే కూలి కింద లేక్కేసుకో అన్నారు !
దిమాక్ గానీ ఖరబ్ అయ్యిందా అని తీసుకోకుండా వెళ్ళిపోయారు మన ఘనత వహించిన కే.సి.ఆర్. గారు !
ఇంక నిన్న ఇంకో కంపెనీలో మళ్ళీ ఇజ్జత్ ఖరాబు కాకుండా ముందే చెప్పున్చిన్రేమో కూలి చేసిన యాక్షన్ చేసేయగానే చప్పట్లు కొట్టి ఒక లక్ష రూపాయలు చేతిలో పెట్టి నమస్కారం చేసేసారు కంపనీవాళ్ళు !

మా శిఖరం చేరడం అంత వీజీ కాదు !
Posted by ప్రభు at 11/26/2010 12:36:00 pm
ఈ మధ్య అందరికీ మా నెత్తిన ఎక్కడం ఫేషన్ అయిపొయింది !
రోశయ్య లా పట్టుదలలేని వాళ్ళూ ఎక్కకుండా ఇలా దారిని కత్తుల మయం చేసాను !
రోశయ్య లా పట్టుదలలేని వాళ్ళూ ఎక్కకుండా ఇలా దారిని కత్తుల మయం చేసాను !
కూత ఘనమైతేనే రాజువి !
Posted by ప్రభు at 11/26/2010 12:33:00 pmస్పైడర్ మేన్ నిజ రూపం !
Posted by ప్రభు at 11/26/2010 10:42:00 am
ఇప్పుడెలా ?
నా మాస్క్ ఊడి కింద పడింది !
నేను కాపాడుతున్న జీవులను గమనిస్తూ ఇంకా నన్ను చూడలా సరిగా !
ఇన్నాళ్ళూ జాగ్రత్తగా దాచుకోస్తున్న నా రహస్యం బట్టబయలవుతోంది !
నా మాస్క్ ఊడి కింద పడింది !
నేను కాపాడుతున్న జీవులను గమనిస్తూ ఇంకా నన్ను చూడలా సరిగా !
ఇన్నాళ్ళూ జాగ్రత్తగా దాచుకోస్తున్న నా రహస్యం బట్టబయలవుతోంది !
జగన్, కిరణ్ లలో అదృష్టం ఎవరిదీ ?
Posted by ప్రభు at 11/25/2010 01:57:00 pm
మంత్రి పదవి అలంకరిన్చకుండానే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రికార్డ్ కొట్టేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు !
స్పీకర్ గా పని చేస్తూ ఎన్నో ముఖ్యమైన సమస్యలను సరిగా అసెంబ్లీ లో చర్చించకుండా తన చాకచక్యంతో అడ్డుకోవడంలో సఫలీకృతం అయిన కిరణ్ కమార్ రెడ్డి గారు అదే సమస్యలను ఎంత చాకచక్యంతో ఎదురుకొని ఫలితం సాధిస్తారో ఎదురు చూడాల్సిందే !
జీతాలు తప్పితే ఇంకేమీ ఖర్చు పెట్టగల స్థితిలో లేని ఖజానా, స్టయిపెండ్ల సమస్యలో చిక్కుకు పోయిన పేద విద్యార్ధులూ, వరుస వరదలతో నలిగిపోయిన రైతన్నలూ, సమ్మెలు చేస్తున్న ప్రభుత్వోద్యోగులూ, ఆకాశాన్ని అంటిన ధరలూ, మితిమీరిన అవినీతి, మొదలే కాకుండానే ఖజానా కబళించి వేసిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ లో గ్రూపులై కొట్టుకుంటున్న జగన్, ఇతర వర్గాలూ, అన్నిటినీ మించి త్వరలో రాబోతున్న శ్రీకృష్ణ కమిటీ రిపోర్టూ దాన్ని అంటుపెట్టుకుని ఉన్న పేలబోతున్న అగ్నిపర్వతం లా అణచి పెట్టబడి ఉన్న భావాగ్నిలాంటి సమస్యల విషవలయంలో నుంచి దెబ్బలు తినకుండా బయటపడాలంటే ఏ ముఖ్యమంత్రికైనా కత్తిమీద సాములాంటి విద్యలో ఆరితేరిన అనుభవమో, అల్లాదీన్ దీపమో, అక్షయ పాత్రో, మాయలపకీరు మంత్రదండమో కలిగి ఉండటమో కావాల్సిందే !
ఆ విషయం తెలిసేనేమో జగన్ వర్గం, జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యాలని అంత పట్టు పట్టలేదు !
సాక్షిలో సోనియా మీద చెణుకులు విసరకపోయి ఉంటే నన్నేసి. ఎమ్. చేసి ఉండేవాళ్ళు బ్రతికి పోయా అని జగన్ భావించినా ఆశ్చర్యం లేదు !

హా...........చ్ !
Posted by ప్రభు at 11/25/2010 01:24:00 pm
ఈ మధ్య బాగా జళుబు జేసింది !
తుమ్ములు అస్సలు ఆగట్లేదంటే నమ్మండి !
డాక్టర్ గారు నన్ను కొన్నాళ్ళు వేడి ప్రదేశాలు తిరిగి రమ్మన్నారు !
తుమ్ములు అస్సలు ఆగట్లేదంటే నమ్మండి !
డాక్టర్ గారు నన్ను కొన్నాళ్ళు వేడి ప్రదేశాలు తిరిగి రమ్మన్నారు !
దాక్కున్న కారు !
Posted by ప్రభు at 11/25/2010 01:23:00 pm
ఈ మధ్య పెట్రోలు దొంగలు ఎక్కువై పోయారండీ !
అందుకని సేఫ్టీ కోసం ఇలా ఏర్పాటు చేసాం !
ఇంటి ముందు పిల్లలు ఆడుకోవడానికి కూడా స్పేస్ దొరికింది !
అందుకని సేఫ్టీ కోసం ఇలా ఏర్పాటు చేసాం !
ఇంటి ముందు పిల్లలు ఆడుకోవడానికి కూడా స్పేస్ దొరికింది !
పుట్టి ముంచిన రోశయ్య !
Wednesday, 24 November 2010
Posted by ప్రభు at 11/24/2010 03:36:00 pm
మొత్తానికి పెద్దాయన అరిచి, అరిచి అలిసిపోయి రాజీనామా సమర్పించాడు !
సమస్యలతో సతమతం అవుతున్న మన రాష్ట్రాన్ని హుస్సేన్సాగర్లో ముంచేసి ఇంకో రాష్ట్రం లో గవర్నర్ గిరీ వెలగ పెట్టడానికి తయారై పోయారు రోశయ్య గారు !
చంద్రబాబు ను తిట్టినట్లుగానే విలేఖరులనూ తిట్టి రోశయ్యకు రోషం ఎక్కువ అనిపించుకున్నాను అని ఆయన అనుకున్నారేమో కానీ ఆడలేక మద్దెల ఓడు అన్నసామెతను గుర్తు చేసారాయన !
ఇప్పుడు కొత్త ముఖ్య మంత్రి ఎన్నిక చేయడానికి అంతా కలుస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు కానీ.... సాయంత్రం సోనియా చేతిలోనే భారం పెట్టి చేతులు దులుపుకున్నా ఆశ్చర్యం లేదు !
కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా కానీ, ఖాళీ అయినా ఖజానా, పెరిగిన గ్రూపుల సంఖ్య, రగులుతున్న తెలంగాణా లాంటి సమస్యల గుర్రాలకు కళ్ళెం వేయడం అంత తేలిక కాదు !
ఏది ఏమైనా నోటి దురుసు లేని వాళ్ళూ, నయానో భయానో అందరినీ ఒక్క త్రాటిమీదకు తేగల వాళ్ళూ వినిపిస్తున్న పేర్ల జాబితాలో కనిపించట్లేదు మరి !
కాంగ్రెస్ నూ మన రాష్ట్రాన్నీ దేవుడే కాపాడాలి

హెల్ప్ ప్లీజ్ !
Posted by ప్రభు at 11/24/2010 01:17:00 pm
ఎవ్వరూ ఎత్తుకెళ్ళ కూడదని నా సైకిల్ ఆ ముందు పెట్టాను !
కానీ ఇప్పుడు తీయాలంటే ఎన్ని సైకిళ్ళు తీయాలో దేవుడా !
కానీ ఇప్పుడు తీయాలంటే ఎన్ని సైకిళ్ళు తీయాలో దేవుడా !
గట్టులెక్క గలవా !
Posted by ప్రభు at 11/24/2010 01:17:00 pm
ఈ బీచ్ లో గట్లు కట్టిన వెధవ ఎవడో కానీ జాగింగ్ కి భలే ఇబ్బందిగా ఉంది !
(ఇక్కడ ఏ విధమైన గట్లూ లేవండీ అవన్నీ ఆ పెద్దమనిషి ఇసుకలో గీసిన గీతలే ! )
(ఇక్కడ ఏ విధమైన గట్లూ లేవండీ అవన్నీ ఆ పెద్దమనిషి ఇసుకలో గీసిన గీతలే ! )
కొండ ఫేస్ నచ్చలేదు మాకు !
Tuesday, 23 November 2010
Posted by ప్రభు at 11/23/2010 09:48:00 am
మీరు రూపం తెస్తేనే మాకు భావాలు వస్తాయి అనుకుంటే ఎట్లా ?
మాకూ కొన్ని ఇష్టాలు ఉంటాయి !
మాకు నచ్చిన చోటికి మేమూ పోతుంటాం !
( ఇవి ఇలా కదలటానికి సరైన కారణం ఇంకా కనుక్కోలేదు ! )
మాకూ కొన్ని ఇష్టాలు ఉంటాయి !
మాకు నచ్చిన చోటికి మేమూ పోతుంటాం !
( ఇవి ఇలా కదలటానికి సరైన కారణం ఇంకా కనుక్కోలేదు ! )
వానలు బాబోయ్ !
Posted by ప్రభు at 11/23/2010 09:45:00 am
మీ పెరిగే జనాభాకు నీళ్ళు చాలట్లేదనే ఈ మధ్య మీకోసం ఊరికో రిజర్వాయర్ చొప్పున మోసుకొచ్చి కురిసేస్తున్నాం !
( ఈ మబ్బులు వానలు కురిపించినా కురిపించక పోయినా, ఇవి వచ్చాయి అంటే రాబోయే పెను తుఫానుకు సూచన ! )
( ఈ మబ్బులు వానలు కురిపించినా కురిపించక పోయినా, ఇవి వచ్చాయి అంటే రాబోయే పెను తుఫానుకు సూచన ! )
మరి ప్రాజెక్టులిలాగే కడతాం !
Posted by ప్రభు at 11/23/2010 09:43:00 am
వీళ్ళు మనకు చస్తే అర్థం కారు బాబాయ్ !
అవసరం లేకపోయినా మనకోసం బోట్లు తెచ్చారు !
ఖర్చు చూపిస్తే గానీ వీళ్ళకి డబ్బులు రావేమో ?
అయినా కష్ట పడకుండా ఇలా వెళ్ళడం బానే ఉందిలే !
అవసరం లేకపోయినా మనకోసం బోట్లు తెచ్చారు !
ఖర్చు చూపిస్తే గానీ వీళ్ళకి డబ్బులు రావేమో ?
అయినా కష్ట పడకుండా ఇలా వెళ్ళడం బానే ఉందిలే !
రేపు ఎటు వెళ్దాం ?
Monday, 22 November 2010
Posted by ప్రభు at 11/22/2010 06:51:00 pm
గట్టు కనిపిస్తోంది చూసావా ?
ఇంకాస్సేపు ఈదితే ఒడ్డెక్కి ఇంటికి వెళ్లిపోవచ్చు !
భార్య మాట విని ఇంతవరకూ ఎవరూ చెడి పోయి ఉండరు !
త్వరగా పద ! పిల్లలు ఎదురు చూస్తుంటారు !
ఇంకాస్సేపు ఈదితే ఒడ్డెక్కి ఇంటికి వెళ్లిపోవచ్చు !
భార్య మాట విని ఇంతవరకూ ఎవరూ చెడి పోయి ఉండరు !
త్వరగా పద ! పిల్లలు ఎదురు చూస్తుంటారు !
పెద్దల మాట వినాలి !
Posted by ప్రభు at 11/22/2010 06:50:00 pm
మనం నాన్ వేజ్జే తినాలిరా అంటే విన్నావా ?
ఈ చెట్టు కాయలు చేదుగా ఉన్నాయా ?
జాగ్రత్త క్రింద పడిపోతావ్ !
ఈ చెట్టు కాయలు చేదుగా ఉన్నాయా ?
జాగ్రత్త క్రింద పడిపోతావ్ !
ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు !
Posted by ప్రభు at 11/22/2010 12:17:00 pm
నేను జగన్ నో, రాహుల్ నో కాదు !
చూడండి ఎక్కడైనా మీడియా వాళ్ళు ఉన్నారేమో !
నేను ప్రతిరోజూ ఇంతే !
నేనిక్కడే ఉంటా !
చూడండి ఎక్కడైనా మీడియా వాళ్ళు ఉన్నారేమో !
నేను ప్రతిరోజూ ఇంతే !
నేనిక్కడే ఉంటా !
మంచు మురిపెం !
Posted by ప్రభు at 11/22/2010 11:36:00 am
ఇది భలే ఉంది భాయీ !
మన ఎడారికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది ?
ఒసామాకి ఇస్తే ఏ కే రైఫిళ్ల బదులు వీటితో దాడి చేద్దాం అంటాడేమో ?
మన ఎడారికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది ?
ఒసామాకి ఇస్తే ఏ కే రైఫిళ్ల బదులు వీటితో దాడి చేద్దాం అంటాడేమో ?
Subscribe to:
Posts (Atom)